📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, October 7, 2026
Visitors: 29,112  |  612 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్నరేంద్ర మోడీ 25 ఏళ్ల సుపరిపాలన: మంచిర్యాలలో 'సేవా జ్యోతి' ర్యాలీ​సైబర్ మోసాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి ​– రామగుండం CP అంబర్ కిషోర్ ఝా‘భూములున్నా పిల్లనివ్వట్లేదు’: డీకే వద్ద రైతు బిడ్డ ఆవేదన.. ప్రత్యేక పథకం తేవాలని డిమాండ్RBI కీలక నిర్ణయం.. రెపో రేటు 5.50 శాతానికి పెంపుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్నరేంద్ర మోడీ 25 ఏళ్ల సుపరిపాలన: మంచిర్యాలలో 'సేవా జ్యోతి' ర్యాలీ​సైబర్ మోసాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి ​– రామగుండం CP అంబర్ కిషోర్ ఝా‘భూములున్నా పిల్లనివ్వట్లేదు’: డీకే వద్ద రైతు బిడ్డ ఆవేదన.. ప్రత్యేక పథకం తేవాలని డిమాండ్RBI కీలక నిర్ణయం.. రెపో రేటు 5.50 శాతానికి పెంపు
Mancherial ⚡ AMP

​సైబర్ మోసాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి ​– రామగుండం CP అంబర్ కిషోర్ ఝా

October 7, 2026 9 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రెస్ మీట్ న్యూస్, ​మంచిర్యాల,అక్టోబర్ 07: ​సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, సందేశాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. అక్టోబర్ జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ‘సైబర్ జాగ్రూకత దివస్’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సైబర్ భద్రత పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఆర్థిక విషయాలను బహిరంగంగా పంచుకోవడం వల్ల సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేస్తారని హెచ్చరించారు.

‘పాజ్ ఫర్ సేఫ్టీ – పాజ్ థింక్ వెరిఫై’ నినాదంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. ​మంచిర్యాల జోన్ డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందంతో పాటు మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, సైబర్ క్రైమ్ ఏసీపీ డి.వి. రంగారెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు, రామగుండం సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!