📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, October 6, 2026
Visitors: 26,468  |  705 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం: రూ.10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదంరాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: మంచిర్యాల జిల్లా బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహంవిద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారం: ట్రూ-అప్ ఛార్జీల వసూలుకు ఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్ఆధార్‌లో పేరు మార్పు నిబంధనలు కఠినతరం: కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన యూఐడీఏఐఅత్యాచారాలు చేస్తే ప్రాణాలు పోతాయనే భయం పుట్టించాలి: దిల్లీ రేప్‌లపై సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం: రూ.10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదంరాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: మంచిర్యాల జిల్లా బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహంవిద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారం: ట్రూ-అప్ ఛార్జీల వసూలుకు ఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్ఆధార్‌లో పేరు మార్పు నిబంధనలు కఠినతరం: కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన యూఐడీఏఐఅత్యాచారాలు చేస్తే ప్రాణాలు పోతాయనే భయం పుట్టించాలి: దిల్లీ రేప్‌లపై సుప్రీంకోర్టు
Mancherial ⚡ AMP

రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: మంచిర్యాల జిల్లా బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం

October 6, 2026 12 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రెస్ మీట్ న్యూస్,​మంచిర్యాల, అక్టోబర్ 06:

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లపై వ్యక్తిగత విమర్శలు, అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను ఏమాత్రం సహించేది లేదని బీజేపీ మంచిర్యాల జిల్లా నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో హాజీపూర్ మండల అధ్యక్షులు గడ్డం స్వామి రెడ్డి, మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ళ జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ మరియు నస్పూర్ జోన్ అధ్యక్షులు కర్రె చక్రవర్తి ల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీజేపీ పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేని బొలిశెట్టి తిరుపతి, పార్టీ నుండి సస్పెండ్ అయిన మడిపల్లి సత్యం నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రఘునాథ్ వెరబెల్లి, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొందరు భూ సెటిల్మెంట్లు చేసే వారితో చేతులు కలిపి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రఘునాథ్ గారిపై విమర్శలు చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. జాతీయ రహదారి 63 విషయంలో లక్షట్టిపేట పట్టణానికి, వ్యాపారులకు నష్టం కలగకుండా బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరారే తప్ప, అలైన్మెంట్ మార్చాలని ఎక్కడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదని స్పష్టం చేశారు. రహదారి విషయంలో రఘునాథ్ గారు వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నారని చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు; లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


​పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలను అవమానించేలా “పాలేరులకు పదవులు ఇస్తున్నారు” అని అనడం బాధాకరమన్నారు. గతంలో తిరుపతిని హాజీపూర్ మండల అధ్యక్షుడిగా, సత్యంను మండల ప్రధాన కార్యదర్శిగా చేసి పార్టీ బాధ్యతలు అప్పగించిన రఘునాథ్ గారికి పాలేరులా అని ప్రశ్నించారు. అంతేకాకుండా తిరుపతి కుమారుడికి గతంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుతం యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు ఇప్పించిన నాయకుడు రఘునాథ్ గారే అని గుర్తుచేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్న నాయకులపై అనుచితంగా మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు అమిరిశెట్టి రాజ్ కుమార్, గడ్డం స్వామి రెడ్డి, కర్రె చక్రవర్తిలతో పాటు మధువరపు రమణ రావు, బియ్యాల సతీష్ రావు, హనుమండ్ల శ్రీనివాస్, కొట్టే ప్రశాంత్, మెరెడికొండ శ్రీనివాస్, రాజనర్సు, కొంకటి మహేందర్, ఇలవేణి సతీష్, సాగర్, చిందం తిరుపతి, బూర్ల అజయ్, కంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!