📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, October 2, 2026
Visitors: 17,010  |  492 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుగాంధీ జయంతి రోజున ‘వెట్రి పయనం’.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకోర్టుల్లో ఏఐ వినియోగించాలి.. కానీ రాజ్యాంగ విలువలు మరువొద్దు : CJIబీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్: ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై రూ.1 లక్ష ఉచిత ప్రమాద బీమా.. సైబర్ మోసాలకూ రక్షణ​టీబీజీకేఎస్‌లోకి భారీగా ఐఎన్టీయూసీ కార్మికుల చేరికటీనేజర్ల భద్రత కోసం వాట్సప్ కీలక ఫీచర్లు: సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్ విడుదలLatest Breaking News from PressMeetతాజా వార్తలుగాంధీ జయంతి రోజున ‘వెట్రి పయనం’.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకోర్టుల్లో ఏఐ వినియోగించాలి.. కానీ రాజ్యాంగ విలువలు మరువొద్దు : CJIబీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్: ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై రూ.1 లక్ష ఉచిత ప్రమాద బీమా.. సైబర్ మోసాలకూ రక్షణ​టీబీజీకేఎస్‌లోకి భారీగా ఐఎన్టీయూసీ కార్మికుల చేరికటీనేజర్ల భద్రత కోసం వాట్సప్ కీలక ఫీచర్లు: సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్ విడుదల
National ⚡ AMP

గాంధీ జయంతి రోజున ‘వెట్రి పయనం’.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

October 2, 2026 16 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

చెన్నై కోయంబేడు బస్టాండ్‌లో పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్

చెన్నై: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ‘వెట్రి పయనం’ పథకాన్ని ప్రారంభించారు. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అనంతరం బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించారు. వారికి టికెట్లను కూడా పంపిణీ చేశారు.

పలు రకాల ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం

‘వెట్రి పయనం’ విస్తరణలో భాగంగా మహిళలకు ఇంతకుముందు అందుబాటులో లేని పలు కేటగిరీల ప్రభుత్వ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మెట్రోపాలిటన్‌, పట్టణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్‌, ఎల్‌ఎస్‌ఎస్‌, డీలక్స్‌ బస్సులతో పాటు సాధారణ ఛార్జీ ఉన్న మోఫస్సిల్‌, కొండ ప్రాంత రూట్ల బస్సుల్లోనూ ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

ఈ పథకం ద్వారా మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణాల సంఖ్యపై పరిమితి, ఆదాయ పరిమితి ఉండదని ప్రభుత్వం ప్రకటించింది.

విద్య, ఉద్యోగాలకు ప్రయాణ సౌకర్యం

దూర ప్రాంతాల్లోని కళాశాలలు, ఉద్యోగ ప్రదేశాలు, వైద్య సేవలు తదితర అవసరాలకు వెళ్లే మహిళలకు రవాణా ఖర్చు తగ్గేలా పథకాన్ని విస్తరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విస్తరణకు ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.6,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రకటించింది. గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ పథకం తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత విస్తరించింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!