📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, October 24, 2026
Visitors: 98,061  |  254 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టు

హిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలు

October 23, 2026 1 days ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

చైనా, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లో 4.1 నుంచి 4.9 తీవ్రతతో ప్రకంపనలు

అంతర్జాతీయం: హిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలు నమోదయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున చైనా, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) వివరాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో భూకంపాల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.1 నుంచి 4.9 మధ్య నమోదైంది. అత్యధికంగా పాకిస్థాన్‌లో 4.9 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి.

చైనాలో ఉదయం 6.05 గంటలకు 4.4 తీవ్రతతో, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉదయం 5.54 గంటలకు 4.1 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో ఉదయం 4.56 గంటలకు 4.9 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపాల వల్ల జరిగిన నష్టం, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

టిబెట్‌లో 7.0 తీవ్రతతో భూకంపం.. 16 మంది మృతి

మరోవైపు చైనాలోని టిబెట్‌ ప్రాంతంలో గురువారం రాత్రి 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర నష్టం కలిగించింది. ఈ ఘటనలో కనీసం 16 మంది మరణించగా, 32 మందికి పైగా గాయపడినట్లు నివేదికలు వెల్లడించాయి. 300కుపైగా ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం. సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులకు సహాయం అందిస్తున్నాయి.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనాలు దెబ్బతినడం, రవాణా, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *