📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, October 14, 2026
Visitors: 61,047  |  471 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజర్మనీలో ఘోర అగ్నిప్రమాదం: ముగ్గురు భారతీయుల మృతిదివ్యాంగులకు కేంద్రం శుభవార్త: 40 శాతం వైకల్యం ఉన్నా పెన్షన్.. కనీస వయోపరిమితి రద్దుఏపీలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారాబాలికపై రోబో అసభ్య ప్రవర్తన: సోషల్ మీడియా లైవ్‌లో టీనేజర్ల పైశాచికం.. జర్మనీలో తీవ్ర దుమారంసర్వైకల్ క్యాన్సర్‌కు చెక్: 4 నుంచి 8 ఏళ్ల బాలికలకూ హెచ్‌పీవీ వ్యాక్సిన్.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక సిఫార్సుLatest Breaking News from PressMeetతాజా వార్తలుజర్మనీలో ఘోర అగ్నిప్రమాదం: ముగ్గురు భారతీయుల మృతిదివ్యాంగులకు కేంద్రం శుభవార్త: 40 శాతం వైకల్యం ఉన్నా పెన్షన్.. కనీస వయోపరిమితి రద్దుఏపీలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారాబాలికపై రోబో అసభ్య ప్రవర్తన: సోషల్ మీడియా లైవ్‌లో టీనేజర్ల పైశాచికం.. జర్మనీలో తీవ్ర దుమారంసర్వైకల్ క్యాన్సర్‌కు చెక్: 4 నుంచి 8 ఏళ్ల బాలికలకూ హెచ్‌పీవీ వ్యాక్సిన్.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక సిఫార్సు

ఏపీలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా

October 14, 2026 10 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెరలేచింది.రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు.షెడ్యూల్ వెలువడిన తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

1. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు (కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు)

మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలోని 13 నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), 77 పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు), 10 నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

  • నామినేషన్ల స్వీకరణ:అక్టోబర్ 16 నుంచి 18 వరకు
  • నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ):అక్టోబర్ 19
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు:అక్టోబర్ 21
  • పోలింగ్ తేదీ:అక్టోబర్ 28
  • ఓట్ల లెక్కింపు / ఫలితాలు:అక్టోబర్ 30

2. పరిషత్ ఎన్నికలు (ఎంపీటీసీ & జెడ్పీటీసీ)

గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ZPTC) ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్ విడుదల:అక్టోబర్ 19
  • నామినేషన్ల దాఖలుకు తుది గడువు:అక్టోబర్ 23
  • పరిశీలన: అక్టోబర్ 24
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ:అక్టోబర్ 27
  • పోలింగ్ తేదీ:నవంబర్ 3
  • ఓట్ల లెక్కింపు / ఫలితాలు:నవంబర్ 5

3. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే, పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

  • మొదటి విడత (Phase-1):నవంబర్ 26
  • రెండో విడత (Phase-2):నవంబర్ 29
  • మూడో విడత (Phase-3):డిసెంబర్ 2(గమనిక: పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి)

తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ప్రభుత్వ పథకాల కొత్త ప్రకటనలు, అధికారిక సమీక్షలపై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

(అక్టోబర్ 28న మున్సిపల్ పోలింగ్.. నవంబర్ 3న పరిషత్ ఎన్నికలు.. మూడు దశల్లో గ్రామ పంచాయతీల పోరు)

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *