📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, October 7, 2026
Visitors: 29,007  |  579 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్నరేంద్ర మోడీ 25 ఏళ్ల సుపరిపాలన: మంచిర్యాలలో 'సేవా జ్యోతి' ర్యాలీ​సైబర్ మోసాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి ​– రామగుండం CP అంబర్ కిషోర్ ఝా‘భూములున్నా పిల్లనివ్వట్లేదు’: డీకే వద్ద రైతు బిడ్డ ఆవేదన.. ప్రత్యేక పథకం తేవాలని డిమాండ్RBI కీలక నిర్ణయం.. రెపో రేటు 5.50 శాతానికి పెంపుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్నరేంద్ర మోడీ 25 ఏళ్ల సుపరిపాలన: మంచిర్యాలలో 'సేవా జ్యోతి' ర్యాలీ​సైబర్ మోసాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి ​– రామగుండం CP అంబర్ కిషోర్ ఝా‘భూములున్నా పిల్లనివ్వట్లేదు’: డీకే వద్ద రైతు బిడ్డ ఆవేదన.. ప్రత్యేక పథకం తేవాలని డిమాండ్RBI కీలక నిర్ణయం.. రెపో రేటు 5.50 శాతానికి పెంపు

నరేంద్ర మోడీ 25 ఏళ్ల సుపరిపాలన: మంచిర్యాలలో ‘సేవా జ్యోతి’ ర్యాలీ

October 7, 2026 8 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మంచిర్యాలలో ఘనంగా ‘సేవా సంకల్ప అభియాన్’ – కాగడ ర్యాలీ

ప్రెస్ మీట్ న్యూస్, మంచిర్యాల, అక్టోబర్ 07: ​ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ అధినేతగా 25 సంవత్సరాల (రెండున్నర దశాబ్దాల) నిరంతర ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా, ‘సేవా సంకల్ప అభియాన్’ మరియు ‘సేవా జ్యోతి’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా మోడీ గారి లైవ్ స్పీచ్‌ను వీక్షించారు. అనంతరం రైల్వే స్టేషన్ నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ఘనంగా కాగడ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాలీబాల్‌లో జాతీయస్థాయి కాంస్య పతకం సాధించిన రామ్మోహన్ విశిష్ట అతిథిగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి మరియు జిల్లా ఇంచార్జి కన్నెబోయిన ఓదెలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరియు ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ గారు, ఆ తర్వాత మూడుసార్లు సీఎంగా, 2014 నుండి వరుసగా దేశ ప్రధానిగా దేశానికి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఏ విధమైన రాజకీయ నేపథ్యం, కుటుంబ వారసత్వం లేకుండా కేవలం అంకితభావం, కష్టపడే తత్వంతో అంచెలంచెలుగా ఎదిగి దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి రోల్ మోడల్ అని, కోట్ల మంది భారతీయుల విశ్వాసమే ఆయన బలం అని పేర్కొన్నారు. ఈ సేవా సంకల్ప వేడుకలు గత విజయాలను గుర్తుచేసుకోవడంతో పాటు, దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించడానికి నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నాయని తెలిపారు.


​ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముఖేష్ గౌడ్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తుల ఆంజనేయులు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రమణా రావు, ఉపాధ్యక్షులు కోడి రమేష్, కమలాకర్ రావు, సేవా సంకల్ప్ అభియాన్ కో కన్వీనర్లు మోటాపలుకుల తిరుపతి, కస్తూరి నాగరాజు, జిల్లా కార్యదర్శులు వైద్య శ్రీధర్, రాచర్ల సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బియ్యాల సతీష్ రావు, సుధీర్ గౌడ్, కార్పొరేటర్ బోట్ల అనిత సత్యం, జోనల్ అధ్యక్షులు, మోర్చా అధ్యక్షులు, బీసీ మోర్చా అధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు ప్రేమ్ సింగ్, తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *