📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, October 7, 2026
Visitors: 29,039  |  580 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్నరేంద్ర మోడీ 25 ఏళ్ల సుపరిపాలన: మంచిర్యాలలో 'సేవా జ్యోతి' ర్యాలీ​సైబర్ మోసాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి ​– రామగుండం CP అంబర్ కిషోర్ ఝా‘భూములున్నా పిల్లనివ్వట్లేదు’: డీకే వద్ద రైతు బిడ్డ ఆవేదన.. ప్రత్యేక పథకం తేవాలని డిమాండ్RBI కీలక నిర్ణయం.. రెపో రేటు 5.50 శాతానికి పెంపుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్నరేంద్ర మోడీ 25 ఏళ్ల సుపరిపాలన: మంచిర్యాలలో 'సేవా జ్యోతి' ర్యాలీ​సైబర్ మోసాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి ​– రామగుండం CP అంబర్ కిషోర్ ఝా‘భూములున్నా పిల్లనివ్వట్లేదు’: డీకే వద్ద రైతు బిడ్డ ఆవేదన.. ప్రత్యేక పథకం తేవాలని డిమాండ్RBI కీలక నిర్ణయం.. రెపో రేటు 5.50 శాతానికి పెంపు

‘భూములున్నా పిల్లనివ్వట్లేదు’: డీకే వద్ద రైతు బిడ్డ ఆవేదన.. ప్రత్యేక పథకం తేవాలని డిమాండ్

October 7, 2026 13 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

కర్ణాటకలో వ్యవసాయంపై ఆధారపడిన రైతు కుటుంబాల యువకులు ఎదుర్కొంటున్న పెళ్లిళ్ల సమస్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి వచ్చింది. మైసూర్ జిల్లా పిరియాపట్నంలో నిర్వహించిన ‘ప్రజా సేవ’ కార్యక్రమంలో ఓ రైతు యువకుడు నేరుగా మైక్ అందుకుని తమ మనోవేదనను పంచుకున్నాడు. సొంతంగా ఎకరాల కొద్దీ సాగు భూములు, సొంత ఇళ్లు ఉండి గౌరవంగా వ్యవసాయం చేసుకుంటున్నా నేటి సమాజంలో తమకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయాడు.

దీని కారణంగా పల్లెల్లో ఎంతోమంది యువకులు 35 నుంచి 40 ఏళ్ల వయసు దాటినా పెళ్లిళ్లు కాక బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యవసాయ వృత్తిని గౌరవించేలా, రైతు యువకులకు సంబంధాలు కుదిరేలా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనతో వ్యవసాయ రంగంలో యువత ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభం మరోసారి బహిర్గతమైంది.

(పిరియాపట్నం ‘ప్రజా సేవ’లో వినూత్న విజ్ఞప్తి.. 40 ఏళ్లు వచ్చినా సంబంధాలు దొరకట్లేదని ఆవేదన)

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *