📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, September 30, 2026
Visitors: 12,758  |  666 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుటీనేజర్ల భద్రత కోసం వాట్సప్ కీలక ఫీచర్లు: సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్ విడుదలఫ్లై-దుబాయ్ కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై కో-పైలట్ కత్తితో దాడి.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ఏపీలో ఓటర్ల ప్రత్యేక సవరణ షెడ్యూల్ మార్పు: క్లెయిమ్‌ల గడువు పొడిగిస్తూ ఈసీఐ కీలక నిర్ణయం‘సిరిసిల్ల గడీని నేలమట్టం చేస్తాం’: కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు.. అక్రమాస్తులపై త్వరలో పార్ట్-2 బాంబ్అక్టోబర్ 2026 సంవత్సరానికి గాను ద్వాదశ (12) రాశుల వారి సంపూర్ణ రాశి ఫలాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుటీనేజర్ల భద్రత కోసం వాట్సప్ కీలక ఫీచర్లు: సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్ విడుదలఫ్లై-దుబాయ్ కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై కో-పైలట్ కత్తితో దాడి.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ఏపీలో ఓటర్ల ప్రత్యేక సవరణ షెడ్యూల్ మార్పు: క్లెయిమ్‌ల గడువు పొడిగిస్తూ ఈసీఐ కీలక నిర్ణయం‘సిరిసిల్ల గడీని నేలమట్టం చేస్తాం’: కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు.. అక్రమాస్తులపై త్వరలో పార్ట్-2 బాంబ్అక్టోబర్ 2026 సంవత్సరానికి గాను ద్వాదశ (12) రాశుల వారి సంపూర్ణ రాశి ఫలాలు

‘సిరిసిల్ల గడీని నేలమట్టం చేస్తాం’: కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు.. అక్రమాస్తులపై త్వరలో పార్ట్-2 బాంబ్

September 30, 2026 7 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ’ అంటూ వ్యాఖ్యానించిన సీఎం.. అమెరికాలో చిప్పలు తోమినోడికి తన విలువేం తెలుస్తుందని, ఫామ్‌హౌస్‌లో ఉన్న వాళ్ల అయ్యను అడిగితే తనేంటో తెలుస్తుందంటూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.

సిరిసిల్ల అభివృద్ధికి రూ.1,500 కోట్లు – గెలిపిస్తే మంత్రి పదవి

సిరిసిల్ల నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.

  • భారీ నిధులు: గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే సిరిసిల్ల అభివృద్ధి కోసం ఏకంగా ₹1,500 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
  • మంత్రి పదవి ఆఫర్: వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసే నాయకుడిని తమ ప్రభుత్వంలో తప్పకుండా మంత్రిని చేస్తామని ప్రజల సాక్షిగా హామీ ఇచ్చారు.
  • సామాజిక న్యాయం: కేసీఆర్ హయాంలో కుటుంబానికే పదవులు దక్కాయని, కాంగ్రెస్‌లో సామాన్యుడైన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యారని, సీతక్క వంటి ఆదివాసీ బిడ్డలకు కేబినెట్ మంత్రి పదవులు దక్కాయని గుర్తుచేశారు.

బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు – ‘పుట్టింటి సారె’తో మేలు

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేశారని ఆరోపించారు.

  • అసంపూర్తి పనులు: కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.
  • చీరల తయారీలో గోల్‌మాల్: టెండర్లలో కమీషన్లు దండుకోవడమే కాకుండా చివరకు పేద మహిళలకు పంచే బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు కొట్టేశారని మండిపడ్డారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ‘పుట్టింటి సారె’ పేరుతో ఆడబిడ్డలకు అత్యుత్తమ నాణ్యమైన చీరలను గౌరవప్రదంగా పంపిణీ చేస్తోందని వివరించారు.

దళితులపై వివక్ష – కేసీఆర్ కుటుంబ అక్రమాస్తులపై ‘పార్ట్-2’

దళితులను కించపరచడం, రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • డప్పు కొడితే పసుపు నీళ్లా?: ఎర్రవల్లిలో దళితులు డప్పు కొడితే ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారని, అసెంబ్లీలో గౌరవ స్పీకర్‌ను సైతం దూషించిన ఘనత ఆ పార్టీదేనని దుయ్యబట్టారు.
  • అక్రమాస్తుల లెక్కలు: ఎర్రవల్లి భూముల ఆక్రమణలతో పాటు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావుల పేరిట ఉన్న ఆస్తులపై పూర్తి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
  • స్టార్ హోటళ్ల వ్యవహారం: ‘ఎట్ హోమ్’, ‘దక్కన్ స్టార్ హోటల్స్’ వంటి స్టార్ హోటళ్ల ఆస్తులు వారికి ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సమయం చాలక దాచిన చిట్టాను త్వరలోనే ‘పార్ట్-2’ కింద ప్రజల ముందు పూర్తి ఆధారాలతో బయటపెడతామని సీఎం సంచలన హెచ్చరిక చేశారు.

(సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. కేసీఆర్ ఫ్యామిలీ హోటళ్లు, ఆస్తులపై త్వరలోనే ‘పార్ట్-2’ బయటపెడతామని స్పష్టీకరణ)

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *