📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 28, 2026
Visitors: 7,344  |  629 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఅక్టోబర్ 1 నుంచి మారే కీలక నిబంధనలు.. సామాన్యుడిపై ప్రభావంసీబీఎస్‌ఈ 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి ఊరట: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!క్యాన్సర్ చికిత్సలో 'ఎంఆర్ లినక్' (MR Linac) సరికొత్త విప్లవం : డాక్టర్ మణిదీప్కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు: గౌరీకుండ్‌ వద్ద 10 వేల మంది భక్తులు దిగ్బంధం..మంచిర్యాలలో అంగరంగ వైభవంగా గణపతి నిమజ్జన స్వాగత ఉత్సవంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఅక్టోబర్ 1 నుంచి మారే కీలక నిబంధనలు.. సామాన్యుడిపై ప్రభావంసీబీఎస్‌ఈ 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి ఊరట: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!క్యాన్సర్ చికిత్సలో 'ఎంఆర్ లినక్' (MR Linac) సరికొత్త విప్లవం : డాక్టర్ మణిదీప్కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు: గౌరీకుండ్‌ వద్ద 10 వేల మంది భక్తులు దిగ్బంధం..మంచిర్యాలలో అంగరంగ వైభవంగా గణపతి నిమజ్జన స్వాగత ఉత్సవం

క్యాన్సర్ చికిత్సలో ‘ఎంఆర్ లినక్’ (MR Linac) సరికొత్త విప్లవం : డాక్టర్ మణిదీప్

September 28, 2026 8 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

​

  • రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌కు చెక్
    • యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ) రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మణిదీప్ పెద్ది వెల్లడి

ప్రెస్ మీట్ న్యూస్,​మంచిర్యాల, సెప్టెంబర్ 28: సాధారణంగా రేడియేషన్ థెరపీ తీసుకునే రోగులలో “సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?”, “భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయా?” అనే భయాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి భయాలను పూర్తిగా తొలగించి, మరింత కచ్చితమైన మరియు సురక్షితమైన రేడియేషన్ చికిత్సను అందించేందుకు యశోద హాస్పిటల్స్ – హైటెక్ సిటీ ‘MR Linac’ అనే అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టిందని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మణిదీప్ పెద్ది (MBBS, MD) తెలిపారు. ఇది రేడియేషన్ చికిత్సలో ఒక కొత్త యుగానికి నాంది అని ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో వివరించారు.

​ఆధునిక సాంకేతికత – కచ్చితమైన చికిత్స:

యశోద హాస్పిటల్స్ – హైటెక్ సిటీలో ఉపయోగిస్తున్న ఈ ‘MR Linac’ ప్రపంచంలోని అత్యున్నత రేడియేషన్ యంత్రాలలో ఒకటి. ఇందులో MRI స్కాన్ మరియు లీనియర్ యాక్సిలరేటర్ (Linac) అనే రెండు సాంకేతిక పరిజ్ఞానాలు ఒకే యంత్రంలో పనిచేస్తాయని డాక్టర్ మణిదీప్ తెలిపారు. ప్రతి రోజు ట్రీట్‌మెంట్ ప్రారంభం కాకముందే రోగికి ఆటోమేటిక్‌గా MRI స్కాన్ జరుగుతుందని, దీని ద్వారా ఆ రోజు ట్యూమర్ (కణితి) ఆకారం, పరిమాణం, స్థానం స్పష్టంగా తెలుస్తాయని వివరించారు. దీని ఆధారంగా రేడియేషన్ కేవలం ట్యూమర్ ఉన్న ప్రాంతానికే కచ్చితత్వంతో ఇవ్వబడుతుందని, పక్కన ఉన్న ఆరోగ్యకరమైన అవయవాలపై దీని ప్రభావం అతి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

​తగ్గనున్న దుష్ప్రభావాలు:

సాధారణ రేడియేషన్ థెరపీలో పేషెంట్లకు వచ్చే తలనొప్పి, స్కిన్ ఇరిటేషన్ (చర్మ సమస్యలు), బలహీనత, వాంతులు, మూత్రంలో లేదా మోషన్‌లో రక్తం పడటం వంటి దుష్ప్రభావాలను ఈ MR Linac టెక్నాలజీతో చాలా వరకు నివారించవచ్చని ఆయన మీడియాకు వివరించారు. ప్రతి రోజు శరీరంలోని మార్పులను గుర్తించి చికిత్సను ఆ మేరకు సర్దుబాటు చేసే అద్భుత సామర్థ్యం ఈ యంత్రానికి ఉందని వెల్లడించారు.

​వివిధ క్యాన్సర్లకు విస్తృతమైన ఉపయోగం:

ప్రోస్టేట్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, యుటరస్ (గర్భాశయ), సర్విక్స్, బ్లాడర్, లంగ్ (ఊపిరితిత్తుల), ప్యాంక్రియాస్, బ్రెయిన్ ట్యూమర్లు వంటి కష్టమైన క్యాన్సర్ వ్యాధులలో ఈ టెక్నాలజీ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని డాక్టర్ తెలిపారు. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్లలో MRI గైడెన్స్ వల్ల ట్యూమర్ స్పష్టంగా కనిపించడంతో, రేడియేషన్‌ను మిల్లీమీటర్ స్థాయిలో అత్యంత కచ్చితత్వంతో ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు.
​తక్కువ కాలంలోనే మెరుగైన ఫలితం:
MR Linac విధానంలో ట్రీట్‌మెంట్ సమయం చాలా తక్కువ అని, కొన్ని సందర్భాల్లో కేవలం ఐదు రోజుల్లోనే పూర్తి చికిత్స పూర్తవుతుందని డాక్టర్ మణిదీప్ తెలిపారు. ఇది రోగులకు మానసికంగా మరియు శారీరకంగా పెద్ద ఉపశమనం ఇస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అరుదుగా లభించే ఈ టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ – హైటెక్ సిటీలో రెండేళ్ల క్రితం దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టామని, అప్పటి నుంచి ఎంతోమంది స్వదేశీ, విదేశీ రోగులకు అత్యధిక భద్రతతో అత్యుత్తమ ఫలితాలు అందించామని ఆయన స్పష్టం చేశారు.

​పత్రికా సమావేశంలో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మణిదీప్ పెద్ది గారితో పాటు యశోద హాస్పిటల్ – హైటెక్ సిటీ ఆంకాలజీ మేనేజర్ పత్తిపాక శ్రీకాంత్, అసిస్టెంట్ మేనేజర్ పాలకుర్తి నవీన్ మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *