📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, September 26, 2026
Visitors: 1,780  |  867 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఈసీలో అత్యవసర భేటీ.. SIRపై కీలక నిర్ణయంజంషెడ్‌పూర్‌లో సినీ ఫక్కీలో భారీ బ్యాంకు దోపిడీ: రూ.36 కోట్ల విలువైన బంగారం, రూ.43 లక్షల నగదు లూటీవివాహ వివాదాల్లో పిల్లలపై లైంగిక దాడి ఆరోపణలు: తక్షణ అరెస్టులు చేయవద్దు - సుప్రీంకోర్టు సంచలన తీర్పు!‘బర్త్ టూరిజం’పై అమెరికా ఉక్కుపాదం: కొత్త వీసా పరిమితుల విధానం ప్రకటన..!పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లిLatest Breaking News from PressMeetతాజా వార్తలుఈసీలో అత్యవసర భేటీ.. SIRపై కీలక నిర్ణయంజంషెడ్‌పూర్‌లో సినీ ఫక్కీలో భారీ బ్యాంకు దోపిడీ: రూ.36 కోట్ల విలువైన బంగారం, రూ.43 లక్షల నగదు లూటీవివాహ వివాదాల్లో పిల్లలపై లైంగిక దాడి ఆరోపణలు: తక్షణ అరెస్టులు చేయవద్దు - సుప్రీంకోర్టు సంచలన తీర్పు!‘బర్త్ టూరిజం’పై అమెరికా ఉక్కుపాదం: కొత్త వీసా పరిమితుల విధానం ప్రకటన..!పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

ఈసీలో అత్యవసర భేటీ.. SIRపై కీలక నిర్ణయం

September 26, 2026 5 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI)లో అంతర్గత విభేదాలపై వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, డాక్టర్‌ వివేక్‌ జోషి అత్యవసరంగా సమావేశమయ్యారు. SIR సహా పలు అంశాలపై కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

విభేదాలపై ఈసీ వివరణ

ఎన్నికల సంఘంలో 10 నెలల వ్యవధిలో పలు అంశాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలపై ఈసీ స్పందించింది. SIRతో సహా అన్ని కీలక నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని స్పష్టం చేసింది. అభ్యంతరాలు, సూచనలు సాధారణ నిర్ణయ ప్రక్రియలో భాగమేనని పేర్కొంది.

SIR నోటీసులపై కీలక వెసులుబాటు

ఇదిలా ఉండగా, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)లో నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణ కోసం తప్పనిసరిగా బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (BLO) కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. అత్యవసర పరిస్థితులు మినహా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఓటర్లకు అవసరమైన సహాయం అందించే బాధ్యత BLOలదేనని ఈసీ పేర్కొంది. అలాగే SIRకు సంబంధించిన నోటీసులకు సమాధానాలు, అవసరమైన పత్రాల సమర్పణకు ఈసీ పౌర సేవా పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉంది. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా SIR ప్రక్రియను నిర్వహించడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *