సెప్టెంబర్ 23న ‘నో-UPI డే’ అంటూ వైరల్.. అదంతా తప్పుడు ప్రచారమే: IndianOil
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: మధ్యప్రదేశ్‌లోని పెట్రోల్ బంకుల్లో రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులను స్వీకరించరని, సెప్టెంబర్ 23న ఇండోర్‌లో ‘నో-UPI డే’ పాటించనున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IndianOil) స్పష్టత ఇచ్చింది. ఈ ప్రచారం తప్పుడు, తప్పుదోవ పట్టించేదని సంస్థ తెలిపింది.
రూ.2,000పై ఎలాంటి ఆంక్షలు లేవు
మధ్యప్రదేశ్‌లోని పెట్రోల్ బంక్ యజమానులు రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదని IndianOil స్పష్టం చేసింది. పెట్రోలియం డీలర్ల పేరుతో కొందరు వ్యక్తులు చేస్తున్న వాదనలకు కూడా అధికారిక గుర్తింపు లేదని తెలిపింది.
పెట్రోలియం డీలర్ల సంఘాలు సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని, ‘నో-UPI డే’పై ఎలాంటి ప్రకటన లేదా సమాచారం తమకు అందలేదని IndianOil పేర్కొంది.
డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం
పెట్రోల్ బంక్ డీలర్లు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో ముందున్నారని IndianOil తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా లేదా ఇండోర్‌లో ప్రత్యేకం
![]()




