తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించి 17న ఫలితాలు వెల్లడించనున్నారు. ఆర్టీసీలో చివరిసారిగా 2016 జూలై 19న ఎన్నికలు జరిగాయి. వేతనాలు, బోనస్‌లు, డీఏలు, సర్వీస్ నిబంధనలు తదితర అంశాలపై యాజమాన్యం, ప్రభుత్వంతో చర్చించే చట్టబద్ధమైన హక్కు గుర్తింపు సంఘానికే ఉంటుంది. 2018లో జరగాల్సిన ఎన్నికలు అప్పట్లో నిర్వహించలేదు
![]()




