మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో విమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (WAPL) టీ20 టోర్నీకి రంగం సిద్ధమైంది. టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న ఈ టోర్నీలో అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్, గోదావరి గోల్డెన్ ఈగిల్స్, రాయలసీమ జెన్ స్టార్స్ జట్లు పాల్గొంటాయి. వేలంలో 74 మంది మహిళా క్రికెటర్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేశాయి. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరిలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
![]()




