యూజీసీ-నెట్ (UGC-NET) ప్రవేశ పరీక్షలకు సంబంధించి కొన్ని సబ్జెక్టుల్లో తప్పులు దొర్లడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
రీ-ఎగ్జామ్ షెడ్యూల్ వివరాలు:
- ఇంగ్లిష్: సెప్టెంబర్ 9 (షిఫ్ట్-1: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు)
- కామర్స్: సెప్టెంబర్ 9 (షిఫ్ట్-2: మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు)
- సోషియాలజీ: సెప్టెంబర్ 10 (ఉదయం 9 గంటల నుండి)
కీ & రెస్పాన్స్ కాపీలు:
జూన్ 22 నుండి 30 వరకు మొత్తం 87 సబ్జెక్టులకు ఎన్‌టీఏ పరీక్షలు నిర్వహించగా, రీ-ఎగ్జామ్ ఉన్న 3 సబ్జెక్టులు మినహా మిగిలిన 84 సబ్జెక్టులకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీలు, అభ్యర్థుల రెస్పాన్స్ కాపీలను ఎన్‌టీఏ తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
![]()




