📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, August 5, 2026
Visitors: 1,582,552  |  723 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలునిరసనకారులపై పోలీసుల దూకుడు వద్దు: కౌన్సిలింగ్‌తో శాంతింపజేయాలి.. సుప్రీంకోర్టురోడ్డు ప్రమాద బాధితులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్: కాంప్రహెన్సివ్ పాలసీ ఉంటే వాహనంలో ఉన్న ప్రయాణికులకు చెల్లించాల్సిందేఅర్ధరాత్రి వేళే ఎందుకు? భారత స్వాతంత్య్ర సమయం వెనుక ఉన్న చారిత్రక ఘట్టంభారత్‌లో 135 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం బ్యాంకింగ్ చట్టానికి గుడ్‌బై: లోక్‌సభలో 'బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026'బీమా లేని వాహనాలకు పెట్రోల్ నిరాకరించండి: కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలునిరసనకారులపై పోలీసుల దూకుడు వద్దు: కౌన్సిలింగ్‌తో శాంతింపజేయాలి.. సుప్రీంకోర్టురోడ్డు ప్రమాద బాధితులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్: కాంప్రహెన్సివ్ పాలసీ ఉంటే వాహనంలో ఉన్న ప్రయాణికులకు చెల్లించాల్సిందేఅర్ధరాత్రి వేళే ఎందుకు? భారత స్వాతంత్య్ర సమయం వెనుక ఉన్న చారిత్రక ఘట్టంభారత్‌లో 135 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం బ్యాంకింగ్ చట్టానికి గుడ్‌బై: లోక్‌సభలో 'బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026'బీమా లేని వాహనాలకు పెట్రోల్ నిరాకరించండి: కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రోడ్డు ప్రమాద బాధితులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్: కాంప్రహెన్సివ్ పాలసీ ఉంటే వాహనంలో ఉన్న ప్రయాణికులకు చెల్లించాల్సిందే

August 5, 2026 11 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రోడ్డు ప్రమాద పరిహార కేసులలో బీమా కంపెనీల వైఖరిపై మరియు కోర్టుల ధోరణిపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది. మోటారు వాహన ప్రమాద పరిహారం చెల్లింపుల వ్యవహారంలో న్యాయస్థానాలు ‘అతి సాంకేతికత దృక్పథాన్ని’ (Hyper-technical Approach) అనుసరించకూడదని స్పష్టం చేసింది. కాంప్రహెన్సివ్/ప్యాకేజ్ పాలసీ ఉన్న వాహన ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఏ వ్యక్తికైనా నష్టం జరిగినా లేదా మరణించినా బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది.

జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం 1996 నాటి ఓ ప్రమాద బాధితుడి కేసులో తీర్పు వెలువరిస్తూ ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

30 ఏళ్ల న్యాయపోరాటం.. బాధితుడి కుటుంబానికి విజయం

1996 జులై 13న ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జరిగిన ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన టి.రాము అనే వ్యక్తి ప్రయాణిస్తున్న మారుతి 800 కారును లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాము చికిత్స పొందుతూ మరణించారు. పరిహారం కోసం కుటుంబీకులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. యజమానికి అదనపు ప్రీమియం కవర్ లేదనే కారణంతో 2009లో పిటిషన్‌ను తిరస్కరించింది.

అయితే, 2012లో ఉమ్మడి హైకోర్టు ఈ తీర్పును సవాలు చేస్తూ బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చి, 7.5% వడ్డీతో రూ.10,00,500 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీం ధర్మాసనం బీమా కంపెనీ అప్పీలును కొట్టివేసింది.

రహదారి భద్రత & ఇన్సూరెన్స్‌పై సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు:

ఈ విచారణ సందర్భంగా దేశంలో ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, రోడ్డు రవాణా శాఖ మరియు ఐఆర్‌డీఏఐ (IRDAI)లకు పలు కఠిన ఆదేశాలు జారీ చేసింది:

  1. తప్పనిసరి దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బీమా:దేశంలో నూతనంగా రిజిస్ట్రేషన్ అయ్యే కొత్త కార్లకు 4 ఏళ్లు, ద్విచక్ర వాహనాలకు (Two-Wheelers) 6 ఏళ్లపాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం తప్పనిసరి చేయాలని ఆదేశించింది.
  2. బీమా లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఇంధనం కట్:చెల్లుబాటు అయ్యే బీమా లేని వాహనాలకు పెట్రోల్/డీజిల్ సరఫరా కాకుండా చూడాలని, దీని కోసం ఐఆర్‌డీఏఐ (IRDAI) పైలట్ ప్రాజెక్ట్‌ను వెంటనే అమలు చేయాలని సూచించింది.
  3. ANPR కెమెరాలు & ఈ-చలానాలు:బీమా లేని వాహనాలను ఆటోమేటిక్‌గా గుర్తించి ఈ-చలానాలు జారీ చేసేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ‘వాహన్’ (VAHAN) పోర్టల్ మరియు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో అనుసంధానించాలి.
  4. పోలీసులకు హ్యాండ్‌హెల్డ్ డివైజ్‌లు:వాహనాల బీమా స్టేటస్‌ను రియల్ టైమ్‌లో తనిఖీ చేసేందుకు వీలుగా ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక యాప్‌లు, హ్యాండ్‌హెల్డ్ పరికరాలను అందించాలి. విధి విధానాలు ఉల్లంఘిస్తే సెక్షన్ 196 కింద కఠిన చర్యలు తీసుకోవాలి.
  5. ఫోర్-టెయిర్ (నాలుగు అంచెల) బీమా విధానం:ప్రైవేటు వాహనాలకు స్పష్టమైన నాలుగు అంచెల బీమా విధానాన్ని తేవాలి.
    • థర్డ్ పార్టీ బీమా (తప్పనిసరి)
    • పిలియన్ రైడర్లు/ప్రయాణికులకు కవరేజ్
    • యజమాని/డ్రైవర్/కూర్చున్నవారికి పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్
    • వాహన నష్ట పరిహార కవరేజ్ (ఆప్షనల్).

వినియోగదారులు బీమా తీసుకునేటప్పుడు క్లియర్‌గా అర్థమయ్యేలా ఒకే తరహా పదజాలంతో కూడిన సమాచార పత్రాన్ని అందించాలని ఐఆర్‌డీఏను ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుపై ఆగస్టు 14వ తేదీలోగా సంబంధిత అన్ని భాగస్వామ్య పక్షాలు నివేదిక/సమాధానం దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *