📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,300  |  537 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాLatest Breaking News from PressMeetతాజా వార్తలుభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

పొగాకు నియంత్రణ కమిటీలో తెలుగు వ్యక్తి రఘునందన్

June 19, 2026 June 19, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పొగాకు నియంత్రణలో విశేష కృషి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతను దక్కించుకున్నారు. పంజాబ్‌కు చెందిన ‘సైఫర్’ సంస్థ అందజేసే ప్రతిష్టాత్మక “టుబాకో కంట్రోల్ హీరో” అవార్డుల ఎంపిక కమిటీ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ కమిటీలో చోటు సంపాదించిన ప్రప్రథమ తెలుగు వ్యక్తిగా రఘునందన్ రికార్డు సృష్టించారు.

త 2025 సంవత్సరంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకున్న తొలి వ్యక్తిగా నిలిచిన రఘునందన్‌కు, 2026 అవార్డుల ఎంపిక ప్రక్రియలో అర్హులైన వారిని నామినేట్ చేసే కీలక బాధ్యతను సంస్థ అప్పగించింది. పంజాబ్‌లోని చండీగఢ్ వేదికగా డాక్టర్ రాకేష్ గుప్తా నేతృత్వంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రఘునందన్ గత 22 ఏళ్లుగా పొగాకు నిర్మూలనకై నిరంతరం శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సుమారు 5,000 కిలోమీటర్లు ప్రయాణించి, 500 గ్రామాల్లోని ప్రజలకు పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే ప్రాణాంతక అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఆయన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *