📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, September 10, 2026
Visitors: 1,748,035  |  335 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం

అంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావు

June 4, 2026 June 4, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ప్రపంచంలో ఎక్కడైనా ఘర్షణలు, యుద్దాలు జరిగినా తల్లితండ్రులను, వారు నివసించే స్థలం, విద్య, ముఖ్యంగా బాల్యం కోల్పోయేది అమాయకమైన చిన్నారులే. యుద్ధాలకు పిల్లలు కారణం కాదు, కాని వారు బాధితులు, స్కూల్కు వెళ్ళాల్సిన చిన్నారులు శరణార్థి శిబిరాల్లో జీవిస్తున్నారు. ఆటలు ఆడి ఆనందంగా బాల్యం గడపాల్సి వీళ్ళు, ప్రాణాలు కాపాడుకోవాడానికి పరుగులు తీస్తున్నారు. పాలస్తీనా మరియు లెబనాన్ దేశాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో చాలా మంది పిల్లలు బాధితులగా మారారు. పిల్లలపై పెరుగుతున్న శారీరక, మానసిక హింసను అరికట్టాలి అని United Nations General Assembly ఆగస్టు 19,1982లో ఈ దినోత్సవం ప్రారంభించింది. June 4th International Day Innocent children Victims of Aggression. ఏపిల్లలైతే శారీరకంగా,మానసికంగా, భావోద్వేగానికి,బాధలకు గురైతారో, ఆ పిల్లల బాధలు, ఎదుర్కొనే కష్టాలు గురించి ప్రపంచ దేశాలు ఆలోచించి వారి కోసం,వారి హక్కుల్ని కాపాడటానికి ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం.

2024లో ఐక్యరాజ్య సమితి 41, 370 మంది పిల్లలు గ్రేవ్ వయలేన్స్ బాధితులు అని నిర్ధారించింది. 22, 495 పిల్లలు హింసకు గురి అయ్యారు అని,11,467 పిల్లలు చంపబడ్డారు / వికలాంగులుగా, 473 మిలియన్ పిల్లలు యుద్ద ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్నారు. దాదాపు 1.6 బిలియన్ చిన్నారులు హింసకు బాధితులు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో పిల్లల హక్కులకు గుర్తింపు లేదు, కేవలం పుస్తకాలకే పరిమితం. పిల్లల్ని పనిలో పెట్టుకునేవారు కొందరు, లైంగికంగా వేధించే వారు కొందరు, కిడ్నాప్ చేసి అమ్మేసే వాళ్లు కొంతమంది, బాల్య వివాహాల బారిన పడే వారు, ఇలా రకరకాలుగా పిల్లలు బాధల్లో కష్టాల్లో ఉన్నారు. 24/7 తల్లితండ్రి కాపలకాయ లేరు, బయట స్కుల్లో అంతే. పిల్లలను బెదిరించి పనులు చేయిస్తూ, నరకం చూపిస్తున్నారు. వారు డ్రగ్స్ బారిన, స్మోకింగ్,స్మగ్లింగ్ బారిన ఎందరో చిన్నారులు పడతున్నారు. అనేక మంది చిన్నారులు మత్తుకు బానిస అయితున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెపుతున్నాం,పిల్లల హక్కుల కోసం, వీరి రక్షణ కోసం, వీరి భవిష్యత్తు కోసం మనం మాట్లాడాలి, పోరాటం చేయాలి. మనం చుట్టూ ఉన్న సమాజంలో పిల్లలు ఎలాంటి హింసకు గురి అయిన,నా కెందుకు అని అనుకోకుండా, వేంటనే 1098 కు సమాచారం ఇవ్వాలి,అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మార్పు మన నుండే మొదలు అవ్వాలి,

అనూరాధ రావు
అధ్యక్షురాలు
బాలల హక్కుల సంఘం

అమాయక చిన్నారులపై హింసను ఆపండి... వారి బాల్యాన్ని కాపాడండి!

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *