తెలంగాణ ఎడ్‌సెట్ ($2026$) ఫలితాలు శనివారం అధికారికంగా విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి కలిసి ఈ ఫలితాలను వెల్లడించారు. మే $12$న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం $35,600$ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో $29,342$ మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన కీ విడుదల చేసి, అభ్యంతరాలను కూడా స్వీకరించారు.
![]()




