బ్రెజిల్‌లోని సౌ పోలోలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో టేకాఫ్ అయిన 9 నిమిషాలకే సాంకేతిక లోపంతో ఎడమ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని యూ-టర్న్ తీసుకుని సౌ పోలో ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పైలట్ చాకచక్యంతో విమానంలోని 300 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు ప్రమాద కారణాలపై విచారణ చేపట్టారు.
![]()




