ఆన్‌లైన్ మోసాల నివారణకు ఏప్రిల్ 1 నుండి ఆర్‌బీఐ కొత్త డిజిటల్ పేమెంట్ నిబంధనలను అమలులోకి తెస్తోంది. ఇకపై ప్రతి లావాదేవీకి కేవలం ఓటీపీ మాత్రమే కాకుండా పిన్ లేదా బయోమెట్రిక్ వంటి ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించక కస్టమర్ నష్టపోతే బ్యాంకులు లేదా పేమెంట్ సంస్థలే పూర్తి బాధ్యత వహించి ఆ సొమ్మును భర్తీ చేయాలి. విదేశీ లావాదేవీల రక్షణ కోసం అక్టోబర్ 1 నాటికి మరిన్ని శక్తివంతమైన రిస్క్-బేస్డ్ మెకానిజమ్స్ సిద్ధం చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనితో ఆన్‌లైన్ చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి.
![]()




