📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 5, 2026
Visitors: 569,475  |  344 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ ఫైర్: సీఎం పదవికి రాజీనామా చేయనుఅమెజాన్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు (WFO)దక్షిణాదిలో ఉచిత బస్సు రాజకీయం: మహిళా ఓటర్లే లక్ష్యంగా భారీ హామీలుకాగ్నిజెంట్‌లో మెగా వాక్-ఇన్ డ్రైవ్మధుమేహ చిన్నారులకు కేంద్రం భరోసా: ఆర్‌బీఎస్‌కే 2.0 మార్గదర్శకాలు విడుదలLatest Breaking News from PressMeetతాజా వార్తలుఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ ఫైర్: సీఎం పదవికి రాజీనామా చేయనుఅమెజాన్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు (WFO)దక్షిణాదిలో ఉచిత బస్సు రాజకీయం: మహిళా ఓటర్లే లక్ష్యంగా భారీ హామీలుకాగ్నిజెంట్‌లో మెగా వాక్-ఇన్ డ్రైవ్మధుమేహ చిన్నారులకు కేంద్రం భరోసా: ఆర్‌బీఎస్‌కే 2.0 మార్గదర్శకాలు విడుదల

దమ్ము కాదు… జీవితం ఎంచుకోండి…

February 3, 2026 February 3, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఒక సాధారణ సంభాషణ… అసాధారణ విషాదానికి ఆరంభం

“ఏవండి… సాయంత్రం సినిమాకి వెళ్దాం, ఇంటికి త్వరగా రండి” అన్న శైలజ మాటల్లో ప్రేమ ఉంది, ఎదురుచూపు ఉంది. “సర్లే” అంటూ సిగరెట్ దమ్ము లాగుతూ బండి ఎక్కిన ఆమె భర్తలో మాత్రం ఒక ప్రమాదకరమైన నిర్లక్ష్యం ఉంది. ఇది ఒక్క శైలజ కథ కాదు. ప్రతి ఇంటి కథ. ప్రతి భార్య గుండెల్లో మౌనంగా దాగున్న భయం.


ప్రకటనల మాటలు… మన చెవులకు అలవాటయ్యాయా?

“ఈ నగరానికి ఏమైంది…” అంటూ మొదలయ్యే ప్రజాహిత ప్రకటన. గుట్కా, బీడీ, సిగరెట్ ప్రాణాంతకమని హెచ్చరిక. సినిమా మొదలయ్యే ముందు Smoking is injurious to health అనే వాక్యం. అన్నీ చూస్తున్నాం… వింటున్నాం… కానీ మన జీవితం మీద వర్తింపజేయడం లేదు. అలవాటు పడ్డ ప్రమాదమే మనకు అసలైన శత్రువు.


ఫ్యాక్టరీలు మూసేస్తే సరిపోదా? – ఒక అపోహ

“సిగరెట్ మానమని చెప్పడం ఎందుకు? ఫ్యాక్టరీలే మూసేయొచ్చు కదా?” అని అడిగినవారు ఎందరో. కానీ ప్రజలకు తెలియని నిజం ఏంటంటే – పారిశ్రామిక విధానాల ప్రకారం ప్రభుత్వాలకు పరిశ్రమలను మూసే హక్కు లేదు. కానీ ఒక వ్యక్తి తన అలవాటును మూసేయగలడు. అదే నిజమైన స్వేచ్ఛ. అదే నిజమైన శక్తి.


చికిత్స కంటే నివారణ శ్రేష్టం

పొగాకు వల్ల క్యాన్సర్ రావడం ఖాయం. ఇది భయం కాదు… వాస్తవం. అందుకే పెద్దలు అన్నారు –
చికిత్స కంటే నివారణ శ్రేష్టం అని. దమ్ము మానేస్తే మన హృదయానికి, మన కాలేయానికి, మన ఊపిరికి
మనమే కాపలాదారులమవుతాం. ఆరోగ్యానికి మనమే శత్రువులమయ్యే పాపం నుంచి బయటపడతాం.


సినిమా హాల్‌లో దగ్గు… జీవితంలో కన్నీళ్లు

సినిమా మొదలయ్యాక హరి దగ్గుతూనే ఉన్నాడు. బోర్ అనిపిస్తే బయటకి వెళ్లి దమ్ము.
పాట వస్తే మళ్లీ అదే పని. ఇదంతా గమనించిన హిమబిందు “హరి… సినిమా వద్దులే, ఇంటికి వెళ్దాం” అంది.
ఆ మాటల్లో చిరాకు లేదు… భయం ఉంది. ఆందోళన ఉంది. భవిష్యత్తు మీద ఆరాటం ఉంది.


ఇంటర్వల్ వరకేనా జీవితం?

“ఐ యామ్ సారీ రా…” అంటూ ఏదో చెప్పబోయాడు హరి. అప్పుడే వచ్చిన మాట –
“ఇప్పుడు అంటే ఇంటర్వల్‌లోనే వచ్చేశాం… మరి జీవితం కూడా ఇంటర్వల్ వరకేనా?”
కళ్లలో నీళ్లు. నోట్లో మాటలు లేవు. వ్యసనపరుడైన శ్రీవారిని ఏమి అనలేని భార్య మౌనం…
అది ఏ అరుపుకన్నా గట్టిది.


దమ్ము కొడితే క్యాన్సర్ ఎలా వస్తుంది?

పొగాకు… పగకు మరో పేరు. దేహం ఎంత బలంగా ఉన్నా సిగరెట్, బీడీ అలవాటు ఉంటే చాలు.
పొగాకు దండయాత్రకు గేట్ తెరిచినట్టే. సిగరెట్‌లోని రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి
కణాల డీఎన్‌ఏను దెబ్బతీస్తాయి. ఆరోగ్యకరమైన కణాలను విపరీతంగా పెరిగేలా చేస్తాయి.
అదే క్యాన్సర్.


సినిమా, సమాజం… అలవాట్ల ప్రభావం

మైదాన్ సినిమాలో ధూమపానం అలవాటు ఉన్న కోచ్ పరిస్థితి మనకు చెప్పేది ఒక్కటే –
ప్రతిభ ఉన్నా, పేరు ఉన్నా పొగాకు ముందు ఎవరూ పెద్దవారు కాదు. తెలుగు సినిమా పరిశ్రమలో
ఎంతో ప్రతిభావంతులైన కవులు, రచయితలు, దర్శకులు ధూమపానం వల్లనే దూరమయ్యారన్న నిజం
చాలామందికి తెలియదు. సినిమాలో హీరో దమ్ము కొడితే యువత అదే స్టైల్‌గా భావిస్తుంది. అక్కడే ప్రమాదం మొదలవుతుంది.


అలవాటు కాదు… అంటుకునే వ్యాధి

దొస్తుల వల్ల అలవాటు. పాకెట్ మనీతో మొదలైన వ్యసనం. ఒక్కటి చాలు అంటూ మొదలెట్టి
రోజుకు డబ్బా ఖాళీ. పర్సు ఖాళీ. జీవితం ఖాళీ. దమ్ము కొట్టే ఒక్కరి వల్ల మరికొందరు ఆ అలవాటుకు దగ్గరవుతారు. అందుకే పాఠశాలల్లోనే మాదకద్రవ్య నిరోధక చర్యలు అవసరమయ్యాయి.


శరీర పునాదులు కూల్చే పొగాకు

సిగరెట్ కాల్చినప్పుడు వెలువడే రసాయనాలు ఉక్కు లాంటి కండరాలకే తుప్పు పట్టిస్తాయి.
కణాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. రోగనిరోధక శక్తిని మెల్లగా సమాధి చేస్తాయి.
పోరాడే సత్తా లేకుండా చేస్తాయి. రొంపిలో చిక్కుకున్న ప్రాణిలా ఊపిరి ఆడకుండా నరకం చూపిస్తాయి.


ఊపిరి విలువ తెలిసేలోపు ఆలస్యం కావద్దు

ఊపిరి ఆడకపోతే డబ్బు పనికిరాదు. పదవి పనికిరాదు. పేరు పనికిరాదు.
ఆరోగ్యం పోతే ఐశ్వర్యం కూడా జారిపోతుంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగే జీవితం
ఎవరూ కోరుకునేది కాదు. అందుకే ఈ రోజే నిర్ణయం తీసుకోండి.


దూరంగా ఉంటే… జీవితం దగ్గరవుతుంది

పొగాకు తో దోస్తీ ఎందుకు? దూరంగా ఉంటే ఆరోగ్యం మన దగ్గరే ఉంటుంది. ఆనందం మన ఇంట్లోనే టుంది.
కుటుంబం మన పక్కనే ఉంటుంది. దమ్ము కాదు… జీవితం ఎంచుకోండి. అదే నిజమైన హీరోయిజం.


రచయిత:
మాచన రఘునందన్
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత
పౌర సరఫరాల శాఖ – ఎన్ఫోర్స్‌మెంట్
డిప్యూటీ తాశిల్దార్
📞 9441252121

(ఫిబ్రవరి 4 – ప్రపంచ కాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సంపాదకీయము)

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *