అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలోని పెదబయలు–తొంకోట మధ్య ఉన్న అద్భుతమైన జలపాతం సీతకాలంలో పర్యాటకులను భారీగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకుల రద్దీ అధికంగా ఉంటుందని స్థానిక యువత చెబుతున్నారు. 2023లో అప్పటి కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ ఇంచార్జి అభిషేక్ గౌడ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ, నేటి వరకు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే గిరిజనులకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని వారు కోరుతున్నారు.
![]()

