TwitterWhatsAppFacebookTelegramShare


ఉరవకొండ : గవి మఠానికి చెందిన ఆస్తులు ఎక్కడున్నా కాపాడటమే తన లక్ష్యమని ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామి అన్నారు. స్థానిక గవి మఠంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామి మాట్లాడుతూ గరీమటానిక్ చెందిన ఆస్తుల పరిరక్షణ కోసం అప్పటి ఎండోమెంట్ కమిషనర్ ఉత్తరాధికారికి బాధ్యతలు అప్పగించారన్నారు
ఎందుకు నెలకు 12000 చొప్పున గౌరవ వేతనం ప్రకటించారు. తన గురుతర బాధ్యతగా భావించి 2018 నుంచి ఇప్పటిదాకా ఆస్తులను పరిరక్షించినట్లు డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామి తెలిపారు కర్ణాటక రాష్ట్రం లోని చిత్రదుర్గ్ జిల్లా కృష్ణా రాజపురం లో ఉన్న (సర్వ్ నెంబర్ 39) 10 ఎకరాల వ్యవసాయ భూమిని గవిమఠం శాఖ కు సంబంధించిన జాగీ రు బుడ్డనహళ్లి అర్చకులకు ధూపధిప నైవేద్యానికి ఇచ్చిన భూమిని 2003 వ సంవత్సరం లో అక్కడి రెవెన్యూ కార్యాలయంలో అక్రమంగా తమ పేరు మీదకు మార్చుకున్నట్లు తెలిసింది.

వెంటనే అక్కడి రెవెన్యూ, ఉన్నతాధికారుల దృష్టికి సాక్షాధారాలతో సహా ఈ ఆస్తి ఉరవకొండ గవిమఠం సంస్థానముకు చెందినదిగా నిరూపించిన్నట్లు తెలిపారు..అర్చకులు కేవలం అనుభవదారులే గాని పేరు మార్చుకోవడం,విక్రయించడానికి గాని వీలు లేదని అధికారులు స్పష్టం చేస్తూ 2025 వ సంవత్సరం (15.07.2025) అర్చకుల పేరు మీద ఉన్న రికార్డులను రద్దు పరుస్తూ అదే స్థానంలో ఉరవకొండ గవిమఠం పేరును మార్చినట్లు చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని దాదాపు కోటి రూపాయల విలువైన గవిమఠం సంస్థాన భూమిని అక్రమార్కుల చెర నుండి కాపాడిన ఉత్తరాధికారి డాక్టర్ శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి కృషి కి నియోజకవర్గ వీరశైవ సంక్షేమ సమాజం హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే: ఇంట గెలిచి రచ్చ గెలవాలని భక్తుల ఆందోళన వ్యక్తం చేశారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న కసాపురం ఈవో మల్లికార్జున 22 ఎకరాల భూమిని చేళ్ళగురికిలో తన పేరిట తన కుటుంబ సభ్యుల పేరిట అధికార దుర్వినియోగానికి పాల్పడి అడ్డగోలుగా మార్పులు చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకొని సొంత భూమిలాగా తన కుటుంబ సభ్యుల పేరిట మార్చుకున్నారు. అయితే ఆ భూ విషయంలో రద్దు కోసం ఉత్తరాధికారి చేసిన ప్రయత్నాలేవీ లేవని భక్తులు ఆరోపించారు. కాగా గయ్మట సంస్థాన ఆవరణంలో ఉన్న ఎడిషన్ పాఠశాలను ఏజెంట్ రాజన్న అక్రమంగా అమ్ముకున్నారు. దీనిని తిరిగి ఇద్దరు వ్యక్తులు లక్షలాది రూపాయలకు తిరిగి గుడ్ విల్ కు అమ్ముకున్నారు. ఈ విషయాన్ని గోవిమత ఆస్తుల పరిరక్షకుడైన ఉత్తరాధికారి చేపట్టినచర్యలు నామ మాత్రమే. కోట్లాది రూపాయలు విలువచేసే గవి మట భూముల, స్థల అక్రమాలపై చర్యలు తీసుకుంటే భక్తులు ప్రజలు హర్షిస్తారు. వీటి పైన ఉత్తరాధికారి ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాటిల్ నాగన్న గౌడ్,కార్యదర్శి పాటిల్ నిరంజన్ గౌడ్,రాకెట్ల మఠం వీరేశ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version