📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,250  |  441 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

టీపీసీసీ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల నియామకాలు: పార్టీ బలోపేతానికి మహేశ్ కుమార్ గౌడ్ చర్యలు

June 30, 2025 June 30, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణలో 2029 ఎన్నికల సన్నాహంలో టీపీసీసీ కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా మేనేజ్‌ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో వైస్ ప్రెసిడెంట్‌లను మరియు జనరల్ సెక్రటరీలను నియమించారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీలను నియమించాలన్న వ్యూహంతో ఈ నియామకాలు జరిగాయి. పార్టీ అభివృద్ధి, జిల్లా స్థాయిలో నాయకత్వ సామర్థ్యాన్ని పెంచడం, నియోజకవర్గాల్లో పార్టీ పునర్నిర్మాణం, బూత్ స్థాయి కార్యదర్శులతో సంబంధాలు మెరుగుపరచడం వంటి ప్రధాన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలు చేపట్టారు.

పార్టీకి విశ్వసనీయత కలిగిన, మాస్స్ అప్‌ధారకులు, బలమైన కేడర్ ఉన్న నాయకులను ఎంపిక చేయడం విశేషం. అందులో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మాజీ ఎంపీ రఘువీర్ రెడ్డి, పెద్దపల్లికి గాలి అనిల్ కుమార్, కరీంనగర్‌కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్, జహీరాబాద్‌కు బండి రమేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మెదక్ నియోజకవర్గానికి నవాబ్ ముజాహిదీన్ ఆలం ఖాన్, మల్కాజ్‌గిరికి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, సికింద్రాబాద్‌కు ఝాన్సీ రెడ్డి, హైదరాబాద్‌కు సంగమేశ్వర్, చేవెళ్లకు బొంతు రామ్మోహన్ వంటి నాయకులు నియమించబడ్డారు.

క నాగర్‌కర్నూల్‌కు కొండేటి మల్లయ్య, నల్గొండకు మామిండ్ల శ్రీనివాస్, భువనగిరికి కోటినిరెడ్డి వినయ్ రెడ్డి, వరంగల్‌కు సత్యనారాయణ, మహబూబాబాద్‌కు నాగేశ్వర్ రావు, ఖమ్మంకు శ్రవణ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్‌కు వేణు గౌడ్ బాధ్యతలు తీసుకున్నారు.

నియామకాలు ద్వారా పార్టీ తాలూకు పార్లమెంట్ స్థాయి కార్యచరణను మరింత శక్తివంతం చేయాలని టీపీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నియమించిన నాయకులు స్థానిక సమస్యలను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతోపాటు, ప్రజల్లో పార్టీకి మద్దతు పెంచే కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత ఉంటుంది. పీసీసీ ఈ నియామకాలను ఎన్నికల వ్యూహానికి భాగంగా చూసుకుంటూ, నియోజకవర్గాల్లో పార్టీకి కొత్త ఊపొచ్చేలా చేస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *