మీడియా స్వేచ్ఛపై దాడి.. బీఆర్‌ఎస్ మూకల చర్యలను ఖండించిన సీనియర్ జర్నలిస్టు : మాలపాటి

TwitterWhatsAppFacebookTelegramShare

హా న్యూస్ కార్యాలయంపై జరిగిన హింసాత్మక దాడిని తీవ్రంగా ఖండించిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు మాలపాటి శ్రీనివాసులు, మీడియా స్వేచ్ఛపై జరిగిన ఈ చర్యను ప్రజాస్వామ్యంపై ఘోర దాడిగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు మూకలు మహా న్యూస్‌ ఛానల్ కార్యాలయంపై అక్రమంగా ప్రవేశించి, ఆస్తిని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని తెలిపారు. వాస్తవాలను జీర్ణించుకోలేకే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు రౌడీలుగా వ్యవహరించినదని ఆరోపించిన శ్రీనివాసులు, ఇలాంటి చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధమని మండిపడ్డారు.

వార్తలపై అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో — ప్రెస్ కౌన్సిల్ లేదా కోర్టుల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. కానీ మీడియా కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడాన్ని ఆయన “పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేసిన చర్య”గా వర్ణించారు. మీడియా సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడమే తమ బాధ్యతగా భావిస్తాయని, అలాంటి బాధ్యతను నిర్విరామంగా నిర్వర్తించే ఛానళ్లను భయబ్రాంతులకు గురిచేయడమనే ఈ చర్య దుర్మార్గమైనదని పేర్కొన్నారు.

వసరమైతే ఆరోపిస్తాం.. అవసరం లేనప్పుడు ఖండిస్తాం” అనే ధృఢసంకల్పంతో పని చేయాల్సిన పాత్రికేయులపై భౌతిక దాడులకు దిగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలను ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఈ దాడిలో పాల్పడిన వారిపై రౌడీషీట్లు తెరవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించి రాష్ట్రం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) పార్టీ అవినీతి, అక్రమాలకు పాల్పడినందున ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ప్రజాస్వామ్యం బలపడాలంటే మీడియా స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించే పాత్రికేయుల వాణిని అణచివేయాలనే ప్రయత్నాలు ఎన్నటికీ సహించరాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, శాంతి భద్రతలకు ఇది ఒక పరీక్షగా మారిందని, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ప్రజలంతా చూస్తున్నారని అన్నారు.

లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, భవిష్యత్తులో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఎటువంటి చర్యలు చోటు చేసుకోకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని సూచించారు. మీడియా మీద అర్ధరాత్రి దాడులు జరగడం, ఆస్తులను ధ్వంసం చేయడం ప్రజాస్వామిక వ్యవస్థకు నల్లకలంకమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనను ఇతర చానళ్లు, పాత్రికేయ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఖండించాలని కూడా పిలుపునిచ్చారు.

నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుని బాధ్యులపై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అంతేగాక, రాష్ట్రంలో మీడియా సంస్థలు భద్రతగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. నేడు ఒక ఛానల్‌పై దాడి జరిగితే, రేపు ఇంకో మీడియా సంస్థ లక్ష్యంగా మారొచ్చని, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చివరగా, ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న మీడియా సంస్థల మీద నమ్మకాన్ని నిలబెట్టేలా రాష్ట్రం ప్రవర్తించాలన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version