📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,035,000  |  383 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

పాలిసెట్-2025: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

June 22, 2025 June 22, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2025 కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి 29వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ప్రవేశాల కన్వీనర్ దేవసేన షెడ్యూల్ విడుదల చేశారు. ఈసారి రెండు కొత్త ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కేసముద్రం (మహబూబాబాద్), పటాన్ చెరు (సంగారెడ్డి)లో ప్రారంభం అవుతుండగా, మొత్తం ప్రభుత్వ కళాశాలల సంఖ్య 59కి పెరిగింది. గత ఏడాది 30,468 సీట్లు ఉండగా, ఈసారి సీట్లు 28,632గా తగ్గాయి. కొత్త కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 42 సీట్లు కలుస్తాయి.

వంద శాతం కన్వీనర్ కోటా కింద సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్ కోసం 32 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కేంద్రంగా ఉంటుంది. విద్యార్థులు జూన్ 24 నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ₹300, ఇతరులు ₹600 చెల్లించాల్సి ఉంటుంది.

తరువాతి కౌన్సెలింగ్ దశలు:

ధ్రువపత్రాల పరిశీలన: జూన్ 26–29

వెబ్ ఆప్షన్లు: జూన్ 26–జూలై 1

సీట్ల కేటాయింపు: జూలై 4

ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: జూలై 4–6

రెండో విడత కౌన్సెలింగ్:

స్లాట్ బుకింగ్: జూలై 9–10

ధ్రువపత్రాల పరిశీలన: జూలై 11

వెబ్ ఆప్షన్లు: జూలై 11–12

వివరాలకు: https://tgpolycet.nic.in

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *