📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,539,222  |  599 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంLatest Breaking News from PressMeetతాజా వార్తలుకరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం

పొగాకు చేత ఔట్ కావడం అవసరమా?! మిత్రమా.!

May 31, 2025 May 31, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

(మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం)

దేహం ఎంత ధృఢంగా ఉన్నా..సిగరెట్, బీడీ అలవాటు ఉంటే?! చాలు. పొగాకు దండయాత్రకు గేట్ తీసినట్టే. పొగాకుతో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది.ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్రలో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు. కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు, ధూమపానం అలవాటుకు ఎలా బలయ్యాడు అని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది. అలాగే తెలుగు సినిమాలకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమ”కూర్చిన” రచయితలు , కవులు, కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్లనే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఒక్కటి చాలు అంటూ.. మొదలెట్టి మెల్లిగా..2,3,4 అలా ..రోజూ డబ్బా ఖాలి చేసి పర్సు ఖాలి చేసుకున్న అభాగ్యులు ఉన్నారు. సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే.

దమ్ము కొట్టినపుడు సిగరెట్, బిడిలోని పొగాకుతో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డి ఎన్ ఏ ను నాశనం చేసే పనిలో పడతాయి. అంటే సరళంగా చెప్పాలి అంటే ఓ వ్యక్తి జాతకం ఎలా ఉన్నా.. సిగరెట్ అలవాటుకు ముందు ఆ తర్వాత అని చెప్పొచ్చు. దొస్తుల వల్ల దమ్ము కొట్టడానికి అలవాటు అయిన వాళ్లు ఉన్నారు. అమ్మా, నాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో గుట్టుగా సిగరెట్ కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండిగా పైసలు ఉన్నా సద్వినియోగం చేసేవారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటుకు “దగ్గర” అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతే గాక కొన్ని సినిమాల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్ లు సైతం యువతను అటు వైపు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు. అయినా..ఎవరో వచ్చి చెప్తేనే “బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్” అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.

సిగరెట్ , బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఎంతటి ఉక్కు లాంటి కందరాల్ని ఐనా తుప్పు పట్టించే పనిలో ఉంటాయి. పటిష్టమైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బతీస్తాయి. కణాలు (సెల్స్) అడ్డగోలుగా పెరిగేలా కారకం అవుతాయి తద్వారా కేన్సర్ కు దారి తీస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాల డి ఎన్ ఏ ను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాలపై ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో. ఓ వ్యక్తి ఆరోగ్యంకు కూడా కణాల ఆరోగ్యం కూడా అంతే అవసరం. సిగరెట్, బీడీ అలవాటు వల్ల కణాల డి ఎన్ ఏ ను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు. ఆ తర్వాత మెళ్లిగా రోగ నిరోధక శక్తిని దారుణంగా దెబ్బ తీస్తాయి.దీంతో దేహానికి పోరాడదాం అని ఆశపడే సత్తాను కూడా సమాధి చేస్తాయి. వెరసి కణాల పై రాక్షసంగా దండ యాత్ర చేసి. దేహాన్ని జబ్బులతో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపిలో దిగబడ్డ ప్రాణి లా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి. మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకుతో దోస్తీ దేనికి.దూరంగా ఉంటే ఆరోగ్యం తో పాటు ఐశ్వర్య కూడా మన దగ్గరే ఉంటుంది.

మాచన రఘునందన్
9441252121
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత

మారియు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *