పిల్లలు చదువుకు దూరం అయి, డబ్బుల కోసం బండలు మోస్తు, రాళ్ళు కొడుతూ, పెద్దపెద్ద బట్టిల దగ్గర పనులు చేస్తుంటే, ఈ సమాజం ఏమైంది అని అనిపిస్తోంది. ఈ చిత్రాలు చూసినష్టమైయితే, వీరి వయస్సు పది, పరముడు లోపు ఉంటుంది. వీళ్ళ చేతిలో పుస్తకాలు ఉండాలి, కాని పరిస్థితుల ప్రభావం వల్ల, వీళ్ళ చేతిలో బండలు, బట్టల షాపుల్లో కత్తెరలు, హోటల్లో ప్లేట్లు ఉన్నాయి. ఈ వార్తా కథనం చుస్తే ” బాల కార్మికుల భాదలు పట్టవా? మనరాష్ట్రంలో ఇంకా ఎన్ని వేల మంది పిల్లలు బాల కార్మికులుని పనికి పోతున్నారు అనేది స్పష్టం అవుతుంది. ఈ ఇది దారుణం, చట్ట విరుద్ధం, 2016 బాల కార్మిక చట్ట సవరణ ప్రకారం భారతదేశంలో 14 సంవత్సరాల లోపు పిల్లలు ఏపనికి తీసుకున్న నేరం. 14-18 సంవత్సరాల పిల్లలు హానికరమైన పనులకు అసలు తీసుకోకుడదు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైన పని, కాని చాలా మంది తల్లితండ్రులు తెలియక పిల్లలను పంపిస్తున్నారు. వీరిని ప్రమాదాల్లో -పెడతున్నారు. అటు చదువు, ఆరోగ్యం భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ I LO ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 16.9 కోట్లు బాలకార్మికులు ఉన్నారని 2020 నివేదిక. వీరిలో 4.9 కోట్లు ప్రమాదకరమైన పనుల్లో ఉన్నారు. 2011 జనగణన ప్రకారం భారత దేశంలో 1.01 కోట్ల బాలకార్మికులు (5-14 yr) తాజా అంచానిల ప్రకారం 2023 దేశ వ్యాప్తంగా 80 లక్షల పైనే బాలకార్మికులు ఉన్నారు. ఎక్కువగా ఉతర ప్రదేశ్, బీహర్ రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నారు.
AP గుంటూరులో ఎక్కువ బాలకార్మికులు కూలీ పనులు, హోటళ్ళు, స్టాన్ క్రషింగ్ లో పనులు చేస్తున్నారు. తెలంగాణలో దాదాపు 2.5 లక్షల బాల కార్మికులు ఉన్నారని నివేదిక. హైదరాబాద్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ బాల కార్మికులు ఉన్నారు. ప్రతి సంవత్సరం బాలకార్మికులను రెస్క్యు చేస్తున్నారు రెండు దఫాలుగా. Operation smile Jan 1st- 31st Jan & Operation Muskan July 1st -31st July కాని ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఈ ఆపరేషన్లో పిల్లలను పట్టుకుంటారు. వారికి విముక్తి లేదు. కారణం అయా యజమానులకు వేసే శిక్షలు సాధారణం, అదే కఠినమైన శిక్షలు వేస్తే, వారి కార్యలయాయాలు సీజ్ చేసి, ఫైన్ కూడ భారీగా వేసిన కాస్త మార్పు రావచ్చు. అలా జరగదు కారణం అందరికి తెలిసిందే. కాని మనమంతా కలిస్తే ఈ అన్యాయాన్ని ఎదిరించి, బాలల హక్కులను రక్షించవచ్చు. మీ చుట్టూ ఉన్న బాల కార్మికులను గమనిస్తే 1098 కు పోన్ చేయండి. వీరికి భవిష్యత్తు ఇచ్చిన వారం అవుతాం. బాలల హక్కుల రక్షణ మన చేతుల్లో ఉంది.

రచయిత
అనురాధ రావు
బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు