📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, September 12, 2026
Visitors: 1,774,358  |  794 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

రఘునందన్ మాచన జీ.. ఆప్ రాష్ట్రపతి భవన్ కో అనా హై.! DT మాచనకు రాష్ట్రపతి భవన్ ఆహ్వానం

May 24, 2025 May 24, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మాచన రఘునందన్ ఈ..పేరు ఉన్న వ్యక్తి ఓ సాదా సీదా ఉద్యోగి పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్. ఆయన జనహితం కోసం, సామాజిక బాధ్యత గా..చేస్తున్న సమాజ సేవ ను రాష్ట్రపతి భవన్ గుర్తించింది. వచ్చే వారం తాము సూచించిన రోజు రాష్ట్రపతి భవన్ కు రావాలని పేర్కొంటు..తనకు శనివారం సాయంత్రం న్యూ ఢిల్లీ రాష్ట్ర పతి భవన్ అధికార వర్గాలు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టు మాచన రఘునందన్ వెల్లడించారు..

వివరాల్లోకి..వెళ్తే..

వృత్తి లోనే ప్రవృత్తిని వెతుక్కొని.. సమాజ హితం కోసం తపిస్తున్న అధికారి గా రఘునందన్ పేరు తెచ్చుకున్నారు. 22 ఏళ్లుగా పొగాకు నియంత్రణపై పోరాటం చేస్తున్న.. రఘునందన్ కు.. ఇటీవలే రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు ఫోన్ చేశారు. మీ పొగాకు నియంత్రణ కృషి అభినందనీయం అని కొనియాడారు. తాజాగ శనివారం నాడు రాష్ట్ర పతి భవన్ అధికార వర్గాలు మళ్లీ ఫోన్ చేశారు. వచ్చే వారం రాష్ట్ర పతి భవన్ కు రావాలని ఆహ్వానం పంపారు. ఏ రోజు రావాలి అనేది సోమవారం నాడు తెలియజేస్తాం అని రఘునందన్ కు చెప్పారు. పొగాకు నియంత్రణ కృషి తో.. శభాష్ “మాచన” అనేలా అసాధారణ కృషి చేసిన.. ఓ సామాన్యుడు రఘునందన్..

ఈ సందర్భంగా ప్రత్యేక కధనం.

వృత్తి లోనే ప్రవృత్తి ని వెతుక్కున్నారు మాచన రఘునందన్. సగటు మనిషిపై వ్యసన పరుడిగా..ముద్ర వేస్తున్న పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకం గా..22 ఏళ్లుగా పోరాటం సలుపు తున్నారు. పొగాకు ఉత్పత్తుల బారిన పడుతూ ప్రాణాంతకమైన వ్యాధులను కొని తెచ్చుకోవద్దని చెప్తూ సమాజ శ్రేయస్సుకు పాటు పడుతున్నారు.

పొగాకు ఉత్పత్తుల కు వ్యతిరేకంగా తనదైన రీతిలో పోరాటం చేస్తున్నారు. పొగాకు వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అందరిలో అవగాహన కల్పిస్తున్నారు. పొగాకు.. వ్యసనపరుల బతుకుల్లో పొగ బెడు తున్న తీరును సామాజిక మాధ్యమాల ద్వారా వివరిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన రఘునందన్ సేవలు అభినందనీయం.

సామాజిక స్పృహతో..

రఘునందన్ మాచన..మేడ్చల్ జిల్లా కేశవరం వాస్తవ్యుడు. ఆయన తండ్రి అభిమన్యు ఆంగ్లభాషా పండితుడు. ఆయన రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్నందుకున్నారు. అలా భావి పౌరులను తీర్చిదిద్దే క్రమంలో తనదైన సేవలు అందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు గడించారు అభిమన్యు. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకునేలా రఘునందన్ సమాజ శ్రేయస్సు కోసం తనవంతు కృషి చేస్తున్నారు. యువత పెడదోవ పట్టకుండా తనదైన రీతిలో స్పందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. పౌర సరఫరాల శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్‌గా నిత్యం దాడులు, తనిఖీలు నిర్వ హించే అధికారులు ఎందరో ఉన్నారు. కానీ రఘునందన్ మాచన అలా కాదు. ఉద్యోగాన్ని తన విధిగానో, ఓ అధికారిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతగానో మాత్రమే భావించలేదాయన. అందులో మానవత దృక్పథాన్ని వెతుక్కున్నారు. సమాజాన్ని మా ర్చాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. అలా కమిట్‌మెంట్‌తో సామాజిక స్పృహతో పనిచేస్తుంటారు రఘునందన్.

సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తూ..

పొగాకు నియంత్రణపై రఘునందన్ సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోస్టులు అంతర్జాతీయంగా అన్ని సమాజాలను చేరుతూ ఆలోచింపజేస్తున్నాయి. ఎక్స్ ద్వారా ఆయన పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, జర్మనీ దేశస్తులను ఆకట్టుకోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రఘునందన్‌ను ఆహ్వానించింది. దేశం తరఫున పాల్గొనడం ఆనందాన్నిచ్చింది..

మాచన రఘునందన్

పంజాబ్ ఛండీగడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జాతీయ సదస్సులో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా నేను పా ల్గొనడం ఆనందాన్నిచ్చింది. పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికీ, ఐశ్వర్యానికీ ముప్పు వాటిల్లక ముందే.. టుబాకోకు గుడ్ బై చెప్పాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని ఆశిస్తున్న వారిలో నేనొకణ్ని. నేను సుమారుగా రెండు దశాబ్దాలుగా పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా.

ఆ ఫలాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ సంస్థ ‘టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్’గా నా సేవలను గుర్తించిం ది. అమెరికాకు చెందిన హెల్త్ మ్యాగజీన్ పల్మనరీ మెడిసిన్ కూడా నా సక్సెస్‌ను గుర్తిస్తూ వావ్.. వెల్డన్ అని కొనియాడింది. ఇటీవల పలువురు నన్ను అభినందించడం ఆనందాన్నిచ్చింది. ఈ అభినందనలన్నీ నా బాధ్యతను మరింత పెంచాయి.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *