TwitterWhatsAppFacebookTelegramShare

కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ.ఎన్.టీ.యూ.సి) డిమాండ్
ఐ. ఎన్. టీ.యూ. సి. రాష్ట్ర సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఐఎన్టియూసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి. త్యారాజన్ గారి ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఈరోజు అనగా ది.21.5.2025 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా త్యాగరాజన్ గారు మాట్లాడుతూ సింగరేణి మేనేజ్మెంట్ ఇటీవల విడుదల చేసిన బదిలీ నిబంధన సర్కులర్ పూర్తిగా కార్మికుల అభ్యున్నతికి వ్యతిరేకంగా ఉందని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.


ముఖ్యంగా :
1. పర్చేస్ డిపార్ట్మెంట్, కోల్ బ్రాంచ్, స్టోర్స్ , రిక్రూట్మెంట్ సెల్, అకౌంట్స్ ముఖ్యమైన పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులు కనీసం నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసినప్పుడే బదిలీకి అర్హులు కావాలన్న నిబంధన
2. ఈ కీలక పోస్టుల్లో ఇప్పటికే పనిచేసిన ఉద్యోగులను మళ్లీ నియమించరాదన్న నిబంధన
3. పర్మనెంట్ ఉద్యోగి బదిలీ కోసం కనీసం మూడు సంవత్సరాలు సర్వీస్ నిబంధన
4. ఉద్యోగ జీవితంలో కేవలం రెండుసార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కి అవకాశం ఇవ్వడం
మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కు 10 సంవత్సరాలలోపు సంబంధిత ఏరియాలో పనిచేసిన అనుభవం ఉండకూడదు అన్న నిబంధన

ఇవన్నీ సింగరేణి చరిత్రలో కఠినంగా ఉన్నాయన్నారు.ఈ విధానాలు ఉద్యోగులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని, కుటుంబ జీవితం, ఉద్యోగ భద్రతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేగాక ఈ నిబంధనలు సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కార్మికుల మనోభావాలను గౌరవించకుండా గుర్తింపు సంఘాలతో సంప్రదించకుండా తీసుకొచ్చిన ఈ సర్కులర్ ను ఐఎన్టీయూసీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సి.త్యాగరాజన్ గారితో పాటు జనరల్ సెక్రెటరీ కె. ఆల్బర్ట్ గారు, కేజీఎం ఏరియా ఐఎన్టియుసి ఉపాధ్యక్షులు ఎం. డి. రజాక్ గారు,

కార్పొరేట్ ఏరియా ఉపాధ్యక్షులు ఎస్. పీతాంబర్ రావు గారు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు పోశం శ్రీనివాస్ గారు, చీఫ్ ఆర్గనైసింగ్ సెక్రటరి ఎస్. కే. గౌస్ గారు, సీనియర్, ఎస్ అండ్ పీ. సి. పిట్ సెక్రటరీ జల్లారపు శ్రీనివాస్ గారు, సీనియర్ ఐఎన్టీయూసీ నాయకులు ఎస్. మధుసూదన్ రావు (చిన్ని )గారు తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version