సైబరాబాద్ పోలీసులు పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ‘సురక్షా కవచ్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జూన్ నుంచి అమల్లోకి వచ్చే ఈ కార్యక్రమం ద్వారా సైబర్, రోడ్డు భద్రతతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, టీజీ న్యాబ్, విద్యాశాఖ సహకారంతో ఈ కార్యాచరణను చేపడుతున్నారు.
కార్యక్రమంలో బోధించేది ఏమిటంటే:
- గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తేడా గురించి స్పష్టత
- మత్తు పదార్థాల ప్రమాదాలుపై విద్య
- ఆన్‌లైన్ వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ ముప్పులపై అవగాహన
- మానసిక ఆరోగ్యం, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా చెప్పే వాతావరణం సృష్టించడం
- పాఠశాల ఆవరణలో ప్రమాదకర వస్తువులు గుర్తించడం, అధికారులను అప్రమత్తం చేయడం
- రహదారి భద్రతపై ప్రాథమిక అవగాహన, ట్రాఫిక్ నిబంధనలు
- భద్రంగా ప్రయాణించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రచారం విద్యార్థుల్లో భద్రతా చైతన్యం పెంపొందించే దిశగా ముందడుగు కావనిస్తున్నారు.