సింగరేణి కోల్డ్ మేన్స్ లేబర్ యూనియన్INTUC సెక్రటరీ జనరల్. మరియు తెలంగాణ రాష్ట్రకనీస వేతన సలహా మండలి చైర్మన్. శ్రీ జనక్ ప్రసాద్ గారి అధ్యక్షతన హైదరాబాదులోని నారాయణగూడ ఐ ఎన్ టి యూ సి ఆఫీసులో రెండు రోజులు కోరు కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో సింగరేణి గని కార్మికులు
ఎదుర్కొంటున్న పలు పెండింగ్ సమస్యలపై చర్చ జరిగింది.
+ప్రధానంగా సొంత ఇంటి పథకము అమలు కోసం.
- పెర్క్స్ పై ఉన్న ఆదాయపన్ను మాఫీ గురించి.
- కార్పొరేట్ మెడికల్ బోర్డు మార్పు.
- మెడికల్ అటెండెన్స్ నిబంధనలో సవరణ.
- డిస్మిస్ అయిన కార్మికుల సమస్యల పరిష్కారం.
- హైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం.
సింగరేణి కంపెనీలోనే ఐటి కంపెనీ స్థాపన మరియు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు.
+3.700 కంటే ఎక్కువ ఉద్యోగ సంబంధిత కేసుల పరిష్కారానికి ఒకే విడతలో లోక్ అదా లత్ నిర్వహించాలని. ఈ సమస్యల పరిష్కారానికి సింగరేణిచైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం నాయక్ ఐఆర్ఎస్ గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది . ఈ సమస్యలపై వారు సానుకూలంగా స్పందించారు. మరుసటి రోజు తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖ మంత్రిగారూ శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారినీ జన ప్రసాద్ గారి బృందము మరియు కోర్ కమిటీ సభ్యులు కలవడం జరిగింది కార్మికుల సొంతింటి పథకం పై వారికి వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. త్యాగరాజు. జనరల్ సెక్రెటరీ (R)ఆల్బర్ట్ .వైస్ ప్రెసిడెంట్స్. రజాక్ మరియు పితాంబరావు. బ్రాంచ్ సెక్రెటరీ లలిత లక్ష్మి .సెక్రటరీలు పరమేష్ యాదవ్ గారు.చిలుక రాజయ్య. డేవిడ్ రాజ్. సీతారామరాజు. రాయమల్లు పాల్గొన్నారు.