📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, September 12, 2026
Visitors: 1,776,836  |  632 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!

ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు పేదలకు: RTE చట్టం అమలుపై హైకోర్టు దృష్టి

January 23, 2025 January 23, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

2009 విద్యా హక్కు చట్టం ప్రకారం, ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు పేదలకు ఉచితంగా కేటాయించాల్సి ఉన్నా, తెలంగాణలో ఈ నిబంధన ఇప్పటి వరకు అమలు కాలేదు. దీనిపై హైకోర్టు మధ్యస్తం చేయగా, ప్రభుత్వం 2025-26 నుంచి అమలుకు సిద్ధమని హామీ ఇచ్చింది.

ఈ నిబంధన ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతులకి వర్తిస్తుండగా, 1 కిలోమీటర్‌లో ప్రాథమిక పాఠశాల లేదా 3 కిలోమీటర్లలో అప్పర్ ప్రైమరీ పాఠశాల లేనప్పుడు మాత్రమే అమలవుతుంది. తెలంగాణలో 12,126 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నిబంధన అమలుతో ఫీజులను ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఉన్నతవిద్య ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 5,700 కోట్లు బకాయి ఉంది.

సీట్ల కేటాయింపు

అనాథలు, దివ్యాంగులు: 5%

ఎస్టీలు: 4%

ఎస్సీలు: 10%

బీసీ, మైనార్టీలు: 6%
మొత్తం: 25%

ఇతర రాష్ట్రాల్లో స్థితి:
దేశంలోని ఐదారు రాష్ట్రాల్లో తప్ప, మిగతా అన్నింటిలో ఈ నిబంధన అమలు అవుతోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇది ఇంకా అమలు కాలేదు. కొందరు ఈ నిబంధనను ప్రతీ ప్రైవేట్ స్కూల్‌లో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *