📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,770,295  |  575 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు గిరిజన హక్కుల ఉల్లంఘన – మలోతు అశోక్ బాబు

November 3, 2024 November 3, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మలోతు అశోక్ బాబు కొత్తగూడెం మరియు పాల్వంచ పట్టణాలు, అలాగే పరిసర గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గిరిజన ప్రజల హక్కులను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఈ నిర్ణయంతో గిరిజన ప్రజలకు ఉద్యోగాలు, ఐటీడీఏ ద్వారా అందే అభివృద్ధి పథకాలు, పంచాయతీ హక్కులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవులు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో గిరిజన ప్రజలకు దక్కాల్సిన ప్రత్యేకాధికారాలు నష్టం చెందుతాయని, 5వ షెడ్యూల్ పరిధిలో ఉన్న ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో కలపడం వల్ల ప్రజలకు ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కోల్పోతారని స్పష్టం చేశారు. చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్ వంటి ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి దిశగా ఉన్నాయని, ఈ గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో చేర్చడం అసమంజసం అని అభిప్రాయపడ్డారు.

అశోక్ బాబు మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో గ్రామాలను కార్పొరేషన్‌లో కలపడం వెనుక కేవలం గిరిజన భూములను లాక్కోవాలనే కుట్రే ఉన్నట్లు ఆరోపించారు. ఏజెన్సీ హక్కుల కోసం గిరిజనులు సాగిస్తున్న ఉద్యమాలను తక్షణమే నెగ్గించాలని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే మరియు రాజకీయ నాయకులు చేసే అభివృద్ధి ప్రచారాలను తప్పు పట్టారు.
ఏజెన్సీ ప్రాంతాల జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *