అక్టోబర్ 25న మాల మహాపాదయాత్ర ను విజయవంతం చేయండి : జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్

TwitterWhatsAppFacebookTelegramShare

హైదరాబాదులో మాల మహానాడు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం

👉ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ… జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో అక్టోబర్ 25 నుండి డిసెంబర్ 1 తారీకు వరకు మాలల మహాపాదయాత్రను నిర్వహిస్తున్నాము ఈ పాదయాత్రకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు మాల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలపాలని కోరడమైనది.

👉భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది

👉1000 కిలోమీటర్లు
👉16 జిల్లాలు
👉ఉమ్మడి పాత 7 జిల్లాలు
👉45 నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది.

వర్గీకరణ ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలిఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీని రద్దు చేయాలి
మాలలమీద మందకృష్ణ విషం చిమ్మడం మానుకోవాలి

పాదయాత్ర షెడ్యూల్:
▪️▪️▪️▪️▪️▪️▪️▪️
భద్రాచలం (25-10-2024), మొరంపల్లి బంజర, పెద్దమ్మ గుడి, పాల్వంచ, కొత్తగూడెం టేకులపల్లి, ఇల్లెందు, లింగాల, ఖానాపురం, ఖమ్మం, తిరుమలాయపాలెం, మరిపెడ, ఎడ్జెర్ల,చింతపల్లి, కురవి, అప్పరాజుపల్లి, గూడూరు, మంగళవారిపేట,ఖానాపురం, నర్సంపేట, గిర్నిబావి, గీసుకొండ, ధర్మారం, వరంగల్, హనుమకొండ, హసన్ పర్తి, ఎల్కతుర్తి, హుజురాబాద్,కేశవపట్నం, మానకొండూరు, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, రామగుండం, ఇందారం, మంచిర్యాల, హాజీపూర్,లక్షెట్టిపేట, రాయపట్నం, ధర్మపురి, జగిత్యాల, కోడిమెల, పజిల్, వట్టెముల, సాత్రాజుపల్లి, వేములవాడ, సిరిసిల్ల, జక్కాపూర్, దుబ్బాక, బొంపల్లి, మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట, తూఫ్రాన్, కాలెకల్,మనోహరాబాద్,మేడ్చల్, శామిర్ పేట్, ఘట్ కేసర్, ఉప్పల్, హైదరాబాద్ ట్యాంక్ బండ్ విగ్రహం( ముగింపు1-12-2024) రవీంద్రభారతి లో ముగింపు సభ

ఈ సమావేశంలో జాతీయ ప్రదానకార్యదర్శి భైరి రమేష్, జాతీయ కమిటి సభ్యులు గోలి సైదులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నర్సింగరావు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటి చైర్మైన్ ఉదండపురం సత్యనారాయణ, రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మైన్ ర్యాకం శ్రీరాములు, రాష్ట్ర కో. ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి, రాష్ట్ర మహిళ కన్వీనర్ ఇందిర ప్రియదర్శిని,ఉపాద్యక్షులు నాయకోటి రవికాంత్, సామల అశోక్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు, వాసుమళ్ళ సుందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి బోగరి విజయ్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version