📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,768,828  |  509 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

September 2, 2024 September 2, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యంగా మహిళా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందికి రక్షణ కోసం రాత్రి సమయాల్లో షీ టీమ్స్‌తో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను అమలు చేయాలని, అన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లకు అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.

టిమ్స్ ఆసుపత్రులకు ప్రత్యేక ఆదేశాలు

ప్రతి ఆసుపత్రిలో శాశ్వత సెక్యూరిటీ అవుట్ పోస్టులు నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పది టీచింగ్ ఆసుపత్రుల్లో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించామని తెలిపారు. అలాగే, సెక్యూరిటీ హౌజ్‌ను ప్రతి ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పీహెచ్‌సీ స్థాయి నుంచి అన్ని ఏరియా హాస్పిటల్స్ వరకు సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు.

ప్రత్యేక సమీక్ష సదస్సు

సప్రీంకోర్టు నిబంధనల ప్రకారం భద్రతా నియమాలను రూపొందించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో హాస్పిటల్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. 14 సెప్టెంబర్‌ లోపు రిపోర్టు సమర్పించాలని, కేసుల విచారణ వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో హోం శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *