📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,406  |  504 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు

ఎంబీబీఎస్ అడ్మిషన్ల జీవోతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం : హరీష్ రావు

August 8, 2024 August 8, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది. ఏ అంశంపైనా స్పష్టత లేదు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచన లేదు. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు వైద్యవిద్యా శాఖ ఇచ్చిన జీవోతో తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే ప్రమాదముంది. నీళ్లు, నియామకాలు, నిధుల ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేర్చారు. నీళ్లు, ఉద్యోగాలు దక్కాయి. తెలంగాణ రాకముందు 40 శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు దక్కేవి. కేసీఆర్ 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా జీవో 124 తీసుకొచ్చారు. విద్య అడ్మిషన్లను ఉమ్మడి రాష్ట్రంలోని పాత పద్ధతి కింద 15 శాతం ఓపెన్ కాంపిటిషీన్ మరో పదేళ్లపాటు ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. 1979లో జీవో 644లో విద్యా ప్రవేశాల్లో స్థానికతను ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమకు నిర్ణయించారు. ఆ ప్రాంతాల్లో నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశం ఉండదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా జీవో నంబర్ 114 ప్రకారం. పాత నిబంధనను పదేళ్లపాటు కొనసాగించాలని అందులో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం లో 2,850 సీట్లను ఎంబీబీఎస్ సీట్లను 9 వేలకు పెంచింది.

తెలంగాణ వచ్చేనాటికి ఉన్న కాలేజీల్లో మాత్రమే 15 ఓపెన్ కాంపిటీషన్ కోటా అమలు చేశాం. రాష్ట్రం వచ్చాక ఏర్పాటు చేసిన కాలేజీల్లో వంద శాతం సీట్లు తెలంగాణకే ఇచ్చాం. దీంతో 520 సీట్లు అదనంగా మనకు వచ్చాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీలో లోకల్ స్టూడెంట్లకే ఇవ్వాలని జీవో తెచ్చాం. దీంతో 24 కాలేజీల్లో తెలంగాణ పిల్లలకు 1071 సీట్లు వచ్చాయి. తెలంగాణ పిల్లలు డాక్టర్ల కావాలనే తపనతో ఈ పనిచేశాం. విభజన చట్టంలో పాత నిబంధన కొనసాగింపుకు 2024తో కాలం చెల్లిపోయింది. మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించుకోవాలి. ఇంటర్‌కు ముందు విద్యాసంవత్సం నుంచి వెనక్కి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడికి లోకల్ అని కొత్త జీవోలో చెప్పారు. గత ఏడేళ్లలో కనీసం నాలుగేళ్లు అని పాత నిబంధన చెప్తోంది. ఈ ప్రభుత్వం ఏడేళ్లు తీసేసి నాలుగేళ్లు అంటోంది. ఈ ప్రకారం తెలంగాణ విద్యార్థులు ఇంటర్ రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదివితే, లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్తే నాన్ లోకల్ అయిపోరా? మన తెలంగాణ బిడ్డలు వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు.

ఈ నిబంధన ప్రకారం వాళ్లు పీజీ సీట్లకు నాన్ లోకల్ అయిపోరా? తమిళనాడులో మాదిరి రూల్స్ ఫ్రేమ్స్ చేయండి. అక్కడ ఎంబీబీఎస్ సీటు రావాలంటే ఆరు నుంచి పదివరకు అక్కడ చదువుకుని, తల్లిదండ్రులు స్థిర నివాసం కలిగి ఉండాలి. కర్నాటక, కేరళలకు వాటి నిబంధనలు ఉన్నాయి. తెలంగాణకు కూడా సొంత రూల్స్ కావాలి. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి విధానం రూపొందిస్తే అన్ని విద్యాసంస్థలకు మార్గదర్శకత్వం అవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా పదేళ్ల పాటు ఉన్నందువల్ల పార్లమెంటు చట్టం ప్రకారం మేము పాత పద్ధతి కొనసాగించాం పదేళ్ల కాలం ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగించడం ఏమిటీ ? రాష్ట్రపతి పాత ఉత్తర్వులోని మొదటి పారాగ్రాఫ్ ను యథాతథంగా పెట్టారు .మిగతా పారాగ్రాఫ్ లు వదిలి పెట్టారు . మా చేతుల్లో ఉన్నది కనుక అపుడు ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అనే నిబంధన తెచ్చాము ఇపుడు అడ్మిషన్లలో 95 శాతం స్థానికులకే ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ విషయం పై ద్రుష్టి సారించలేదు వెంటనే జీవో 33 లో సవరణలు తేవాలి.

ఈ అంశంపై అఖిలపక్షాన్ని పిలిస్తే సూచనలు ఇస్తాం. కాంగ్రెస్ పాలన గాలిలో దీపంలా ఉంది. వైద్య విద్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఇప్పటికైనా కమిటీ వేయాలి. జీవోకు సవరణ చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో ఆగస్ట్ 5 నుంచి 9వరకు ప్రోగ్రామ్ తీసుకుంది. గతంలో మేము పారిశుద్ధ్య వారోత్సవాలు చేసేవాళ్లం. వర్షాలు రాకముందే గ్రామాల్లో శుభ్రతకు చర్యలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం ఆ పథకం పేరు మార్చింది. కానీ గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదు. మొదటి రోజు సమస్యలను గుర్తించాలన్నారు. రెండో రోజు ఒహెచ్ఆర్ఎస్ క్లీనింగ్, తాగునీటి పైపుల బాగు చేయాలని. కానీ బ్లీచింగ్ పౌడర్ ఎక్కడుంది? ఆయిల్ బాల్స్ ఎక్కడ? సర్పంచులు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. సెక్రటరీలు లక్ష వరకు సొంత డబ్బు ఖర్చుపెట్టారు. కొందరు బదిలీ అయ్యారు. పెట్టిన పైసలు వస్తయో లేవో తెలీదు. గ్రామాలు నిర్వీర్యం అయిపోయాయి. స్వచ్చదనం కావాలంటే ట్రాక్టర్లకు డీజిల్ లేదు. కరెంట్ బుగ్గలకు డబ్బులు లేవు. కూలీలకు డబ్బుల్లేవు. మొక్కుబడిగా చేయడం తప్ప ఏమీ లేదు. నిధులు లేవు, ప్రణాళిక లేవు. మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గ్రామాలు చెత్తకుప్పలుగా మారాయి. డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలాయి. దవాఖానాల్లో మందులులేవు. మంచాలు లేవు. పచ్చదనం, పరిశుభ్రత లోపించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *