వర్షాలతో బేంబేలెత్తుతున్న మణుగూరు ప్రజలకు ప్రభుత్వం బాసటగా నిలవాలి వరద ముంపును నివారించాలి : సామాజిక సేవకులు కర్నే బాబురావు

TwitterWhatsAppFacebookTelegramShare

భారీ వర్షాలతో బేంబేలెత్తుతున్న మణుగూరు ప్రజలకు ప్రభుత్వం బాసటగా నిలవాలనీ వరద ముంపును నివారించాలనీ కోరుతూ సోమవారం జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన గారికి మణుగూరు సామాజిక సేవకులు వినతిపత్రం అందజేశారు, భారీ వర్షాలు అంటేనే మణుగూరు ప్రజల గుండెజారి గల్లంతవుతోందని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న కుండ పోత వర్షాలకు మణుగూరు తో పాటు పినపాక నియోజకవర్గం కూడా అతలాకుతలం అవుతోందని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మణుగూరుకు వరద ముంపును నివారించాలని ప్రజలకు భరోసా ఇవ్వాలని రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని బాబురావు కోరినట్లు తెలిపారు.

బాబురావు ఇచ్చిన ఫిర్యాదుని మేడం గారు నిశితంగా పరిశీలించి సంబంధిత ఇరిగేషన్ డిఈ అధికారులకీ ఆదేశాలు చేస్తూ బ్రిడ్జి లు, కాలువలు ఏ విధంగా ఉన్నాయో చూసి మూడు రోజుల్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు, దీంతోపాటు మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో గల చాకలి ఐలమ్మ నగర్ గ్రామంలో సుమారు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయనీ చినుకు పడితే చాలు రాకపోకలకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు, లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితి అయినా 108 అంబులెన్స్ రావడానికి కూడా దారి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

వరదల సందర్భంగా ఇండ్లు ముంపుకు గురై మణుగూరు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి విషయాన్ని అతనపు కలెక్టర్ విద్యా చందన మేడం గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు,పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో చెత్త పేరుకుపోవడం వల్ల మురుగు నీటి కాలువలు (డ్రైనేజీలు) సరిగ్గా లేక వరద నీరు అంతా ఇళ్లల్లో కి చేరి దుర్వాసన వస్తుందన్నారు, దోమలగూడ ప్రబలుతున్నాయన్నారు, దానికి తోడు వీధిలైట్లు లేక గ్రామాలు అన్ని చిమ్మ చీకటిలో ఉన్నాయన్నారు, సంవత్సరం ఎంతో ఓపికగా విని పరిష్కారానికి క్రింది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం పట్ల అదనపు కలెక్టర్ విద్యా చందన గారికి కర్నే బాబురావు కృతజ్ఞతలు తెలిపారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version