📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,763,843  |  266 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...

ఆకలి లేని వారి కోసం ఆయుర్వేద సులభ చిట్కాలు

July 21, 2024 July 21, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

సాంకేతికత పెరిగి, జీవనశైలి మారుతున్న ఈ రోజుల్లో ఆకలి లేకపోవడము పెద్ద సమస్యే…దీని కోసం ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు పాటిస్తే సరిచేయవచ్చు…

  • మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.
  • వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .
  • యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.
  • బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .
  • పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .
  • కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.
  • పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.
    • అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు
    • తినవలసినవి
    • – తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .
    • తినకూడనవి
    • కొత్తబియ్యం,చేపలు,బచ్చలికూర,ఎక్కువుగా నీరు తాగరాదు,కంద,ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు,నేరేడు పండ్లు,గోధుమలు,పిండివంటలు,మాంసపదార్దాలు,పాలు,పాలతో వండిన పదార్దాలు,చారపప్పు,ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు,పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం,మద్యపానం ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం, అమిత భోజనం,నిద్రపోకుండా మేలుకుని ఉండటం,మలమూత్ర నిరోధం.
    • పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.

కాళహస్తి వేంకటేశ్వరరావు

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

     9885030034

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *