📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,764,897  |  304 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...

త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ : CM రేవంత్‌రెడ్డి

July 14, 2024 July 14, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్‌ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబరు 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌ అంశాన్ని అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని… కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్‌ సెంటర్ల యాజమాన్యాలు పోటీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయని రేవంత్‌ అన్నారు. పదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని… ఇప్పుడు పక్కాగా డీఎస్సీ, గ్రూప్‌ 2, 3 నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటున్నారు. ఏ పరీక్షలూ రాయనివారు దీక్షలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య’కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

సెప్టెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌ 2024’ లోగోను ఆవిష్కరించారు. ఏటా లక్ష మంది ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసుకొని ప్రపంచంతో పోటీ పడేందుకు వస్తున్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని భావిస్తున్నామని, అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైనది సివిల్‌ ఇంజినీరింగ్‌ అని రేవంత్‌ అన్నారు. కొన్ని కళాశాలలు ఈ కోర్సును నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఆ విద్యా సంస్థల్లో ఆ కోర్సు లేకుండా ఉండేలా పథకాలు వేస్తున్నాయని…. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సులు కచ్చితంగా నడపాలని రేవంత్‌ అన్నారు. పేదవాడికి విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆనాడు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొచ్చిందని రేవంత్‌ గుర్తు చేశారు.

గత సర్కారులో కొన్ని పరిణామాలు, దాని ప్రాధాన్యాల వల్ల కళాశాలలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని తెలిపారు. ఈ ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. చార్మినార్, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ, ఈఫిల్‌ టవర్, న్యూయార్క్‌ సిటీ, హైటెక్‌ సిటీ ఇలా అభివృద్ధికి చిహ్నంగా ఏవి చూపించినా అవి ఇంజినీర్లు చేసిన అద్భుతాలే అని రేవంత్‌ అన్నారు. గత సీఎంలు చేపట్టిన విధానాలతో మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్నామని రేవంత్‌ అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోర్సులు ఉండాలన్నారు. టీసీఎస్‌తో చర్చించి రూ.2,400 కోట్లతో 65 ఐటీఐలను అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చబోతున్నామని తెలిపారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టును మల్లెపల్లిలో ప్రారంభించామని… అక్కడి నిపుణులు అద్భుతాలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఫార్మా, ఐటీ తర్వాత కృత్రిమ మేధ ప్రపంచాన్ని నడిపించబోతోందన్నారు. ఈ కోర్సులు విరివిగా రావాలని తెలిపారు. త్వరలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ ఏర్పాటు చేసి అటానమస్‌ హోదా ఇస్తామని వెల్లడించారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *