అశ్వారావుపేట ఎస్సై శ్రీను మృతికి కారకులపై హత్యాయత్నం కేసు పెట్టాలి దళిత సంఘాల డిమాండ్

TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38), మృతి చెందారు. గత నెల 30న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్సై శ్రీరాముల శ్రీను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. సహోద్యోగులు తన విధుల నిర్వహణకు సహకరించడం లేదని, వేధింపులకు గురవుతున్నారనే కారణంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసు స్టేషన్‌లో తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డిని బదిలీ చేసి ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఎస్పీ కార్యాలయంలో శేఖర్, శివనాగరాజు, సన్యాసినాయుడు, సుభానీలను  అటాచ్ అచేశారు, ఎస్సై శ్రీరాముల భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు సదరు సీఐ, పోలీసు అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఎస్సీ మాల వర్గానికి చెందిన ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నానికి సంబంధించి కుల అణచివేత ఆరోపణలున్నాయి. ఈ కోణంలో నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐ శ్రీరాముల శ్రీను అశ్వారావుపేట స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తూ కన్నుమూశారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన ఎస్సై శ్రీరాముల శ్రీను స్వస్థలం అతనికి భార్య, ఏడేళ్ల కూతురు, పదేళ్ల కుమారుడు ఉన్నారు. యువ ఎస్సై మృతి పట్ల పలువురు అధికారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.ఎస్ఐ మృతి చెందిన ఈఘటనలో నిందితులపై మర్డర్ కేస్ బుక్ చేయాలి అని దళిత సంఘాల డిమాండ్.

ఎస్సై శ్రీరాముల శ్రీను కుటుంబానికి అండగా ఉంటాం : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఆఫీసర్ శ్రీరాముల శ్రీను మృతి చెందడం బాధాకరమన్నారు. అతని ఆత్మకు శాంతి కలుగుగాక. కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఎస్సై కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే జారె అన్నారు.

దళిత సంఘాలు ఆగ్రహం

కొత్తగూడెం జిల్లా మాల మహానాడు నాయకులు కొప్పురి నవతన్ మాట్లాడుతు దళిత ఉద్యోగులను వేదిస్తే చూస్తే ఊరుకోము అని, బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్ట ప్రకారం వారిపై శిక్షలు పడే వరకు పోరాటం అని హెచ్చరించారు. ఆయన మాట్లాడుతు నిందితులపై హత్యయత్నం కేసు కూడా పెట్టాలి అని డిమాండ్ చేసారు.ఎస్ఐ కుటుంబానికి ప్రభుత్వం తరుపున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి, అదే విదంగా ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రంలో వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అశ్వారావుపేట ఎస్‌ఐ మృతిపై దళిత సంఘాల ధర్నా

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version