విద్యుత్ సంస్థల పేమెంట్ యాప్స్ లో కరెంట్ బిల్లులు కట్టే విధానం

TwitterWhatsAppFacebookTelegramShare

కరెంట్ బిల్లులను కట్టేందుకు ప్రజలు గతంలో మాదిరిగా ఆయా కార్యాలయాలకు వెళ్లి కట్టటం దాదాపుగా మానేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న నేఫథ్యంలో మొత్తం ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు చేసేస్తున్నారు. ఇందుకు డిజిటల్ పేమెంట్ యాప్‌లు కూడా.. వినియోగదారులకు అనుకూలంగా పేమెంట్ ఆప్షన్లు ఇవ్వటమే కాకుండా ఎప్పటికప్పుడు మర్చిపోకుండా నోటిఫికేషన్లు ఇస్తూ బిల్లు కట్టే తేదీలను గుర్తు చేస్తుంటాయి. దీంతో.. ప్రజలు కూర్చున్న దగ్గరి నుంచి క్షణాల్లోనే కరెంట్ బిల్లుల దగ్గరి నుంచి అన్ని పేమెంట్లు చేసేస్తున్నారు. అయితే ఇక నుంచి ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు చేయడం సాధ్యపడదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్‌ ఈ సేవలనూ నిలిపి వేయడమే కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TGSPDCL) ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీజీఎస్‌పీడీసిఎల్ (TGSPDCL) తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ జారీ చేసే విద్యుత్ బిల్లులపై క్యూ‌ఆర్ కోడ్‌ను ముద్రించనున్నట్లు వెల్లడించారు. తమ మొబైల్ ఫోన్ ద్వారా ఈ QR కోడ్ ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఈ క్యూ ఆర్ కోడ్ (QR Code)తో కూడిన బిల్లులు వచ్చే నెల నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.ఆర్‌బీఐ (RBI) కొత్త నిబంధనల వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ లో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయం లేకున్నను, ప్రస్తుతానికి బిల్లు వసూళ్లపై ప్రభావం పడలేదు వారు అన్నారు. శుక్రవారం ఉదయం పది గంటల వరకు దాదాపు 1.20 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంస్థ వెబ్సైటు, మొబైల్ App నుండి Bill desk – PGI, Paytm – PG, TA Wallet, TG/AP Online, MeeSeva, T-Wallet, Bill desk (NACH) ద్వారా బిల్లులు చెల్లించొచ్చు. వినియోగదారులకు మరింతగా సౌకర్యవంతమైన చర్యల్లో భాగంగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version