📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Khammam • Nov 13, 2024

వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్ జితేష్

TwitterWhatsAppFacebookTelegramShare

కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో వైద్యులపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, వైద్యుల అర్హతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అలాగే అర్హతలకు మించి వైద్యం చేస్తున్న వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఆసుపత్రులలో పనిచేసే వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు అవసరమని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తక్షణం తరలించి వైద్యం అందించాలని, ప్రమాదకర ప్రాంతాల జియో ట్యాగింగ్ చేయాలని కోరారు. డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా వైద్య అధికారి, రక్త పరీక్ష కేంద్రాల్లో పరీక్షల ధరల వివరాలను ప్రజలకు తెలిసేలా ఆసుపత్రులలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు అరికల భాస్కర్, అనుమతులు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డా. మధువరన్, డిప్యూటీ DMHO ఫైజ్ మొహియుద్దీన్, ఉమా మహేశ్వరి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

📅 November 13, 2024🏷 Khammam
National • Nov 10, 2024

టీటీడీ పాలకమండలి తొలి సమావేశం 18న – చైర్మన్ బి.ఆర్. నాయుడు

TwitterWhatsAppFacebookTelegramShare

టీటీడీ నూతన పాలకమండలి ఈ నెల 18న‌ తమ తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10:15 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ తొలి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలు, భక్తులకు అందించే సేవలపై చర్చకు అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు ఈ సమావేశ వివరాలను “X”లో (మాజీ ట్విట్టర్‌లో) ట్వీట్ చేస్తూ, పాలకమండలి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

Loading

📅 November 10, 2024🏷 National
National • Nov 10, 2024

కాన్పుర్‌ ‘నీట్’ కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్థినిపై ఆరునెలలపాటు అత్యాచారం – ఇద్దరు టీచర్ల అరెస్ట్

TwitterWhatsAppFacebookTelegramShare

వైద్యవిద్యలో ప్రవేశం కోసం ‘నీట్‌’ శిక్షణ కోసం ఓ కోచింగ్‌ సెంటరులో చేరిన 17 ఏళ్ల విద్యార్థినిని ఆర్నెల్లపాటు నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డ టీచర్లు సిద్దీఖి, వికాస్‌లపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ కాన్పుర్‌ పోలీసులు వెల్లడించారు. బాధితురాలు కల్యాణ్‌పుర్‌ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేయగా, నిందితులపై అత్యాచారం, అక్రమ నిర్బంధం, పోక్సో నేరాల కింద కేసులు నమోదు చేశారు. 2022 డిసెంబరులో ఫతేపుర్‌ కు చెందిన బాధితురాలు కాన్పుర్‌ కోచింగ్‌ సెంటరులో చేరింది. 2023 కొత్త సంవత్సర వేడుక పేరుతో బయాలజీ టీచర్‌ సాహిల్‌ సిద్దీఖి ఆమెను ఫ్లాటుకు పిలిచి, మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి, అత్యాచారం చేసి వీడియో తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ వీడియోతో ఆమెను బెదిరించి, ఆర్నెల్లపాటు మరో టీచర్‌ వికాస్‌ పోర్వాల్‌ సహకారంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ భయంతో బాధితురాలు అప్పటివరకు మౌనంగా ఉన్నా, కోచింగ్‌ సెంటరులో మరో విద్యార్థిని వేధింపులకు గురిచేస్తున్న వీడియో చూసిన తర్వాత ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Loading

📅 November 10, 2024🏷 National
Andhra • Nov 3, 2024

నంద్యాల: డోన్‌లో క్రిప్టో కరెన్సీ పేరిట భారీ మోసం

TwitterWhatsAppFacebookTelegramShare

క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో రూ.25 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం డోన్‌లో వెలుగుచూసింది. రామాంజనేయులు అనే వ్యక్తి “రూ.లక్ష పెట్టుబడిపెడితే నెలకు రూ.10 వేలు రాబడిగా అందుతుందని” చెబుతూ కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 300 మందికి పైగా బాధితులను మోసం చేశాడు. మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇంకా కేసు నమోదు చేయడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Loading

📅 November 3, 2024🏷 Andhra
Khammam • Nov 3, 2024

రగ్ జోళ్ యాత్రను జయప్రదం చేయండి.. సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్

TwitterWhatsAppFacebookTelegramShare

ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో సేవాఘడ్ సేవాలాల్ గుడి యందు సేవాలాల్ ధర్మ జాగరణ సేన సద్భావన సమావేశం సేవాలాల్ సేన జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధరావత్ ప్రేమ్చంద్ నాయక్ గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఎస్ టిటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 26వ తారీకు నుండి జరిగే రగ్ జోళ్ యాత్రకు తండా నుండి భారీ ఎత్తున తండా ప్రజలు టేకులపల్లి మండలంలో ఉన్న సేవాఘడ్ సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ టెంపుల్ నుండి ప్రారంభం అవుతున్నది కాబట్టి చుట్టుపక్క తండాల నుండి గిరిజన లంబాడి బిడ్డలు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు, ఈ యాత్రలో అనేక సమస్యలపై ఆయా జిల్లాలలో ఉన్న మేధావి వర్గాలతో చర్చ జరపడం జరుగుతుందని అన్నారు, ఈ రగ్ జోళ్ యాత్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ యాత్ర 9 జిల్లాలలో మొదటి విడతగా జరుగుతుంది, కాబట్టి ఈ తొమ్మిది జిల్లాల తండాలలో ఉన్న మన లంబాడి జాతి బిడ్డలు ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరారు అనంతరం సేవాలాల్ సేన జిల్లా నాయకులను అనుబంధ కమిటీ నాయకులను మండల కమిటీ నాయకులను పదవులు ఇవ్వడం జరిగింది వాటితో పాటు నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా కోశాధికారిగా జరపలా లాలూ నాయక్, సేవాలాల్ సేన టేకులపల్లి మండల అధ్యక్షులుగా బానోత్ కిషన్ నాయక్, యువసేన అధ్యక్షులు జబ్బర్ సింగ్, ప్రచార కార్యదర్శిగా భూక్యా నవీన్ నాయక్, టేకులపల్లి మండలం లో ఉన్న సేవాఘడ్ గుడి పూజారిగా సేవల్ శ్రీ గణేష్ పూజారి ను నియమించడం జరిగింది , సేవాలాల్ ధర్మజాగరణ సేన జిల్లా అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షుడు గా సేవల్, ఉపాధ్యక్షులుగా తేజావత్ వీరన్న, ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్, కార్యదర్శిగా సుజాత బాయ్, ప్రచార కార్యదర్శిగా సేవల్ శ్రీ గణేష్ ప గూనోత్ రావ్, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్, రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్, బిజెపి జిల్లా నాయకులు పుణ్య నాయక్ , ధర్మజాగరణ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు జరుపల రామచంద్రనాయక్, ధర్మ జాగరణ సేన ప్రధాన కార్యదర్శి జరపల మంగీలాల్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ రమేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయక్, ఇల్లందు మండల అధ్యక్షులు వాంకుడోత్ రమేష్ నాయక్, పాల్వంచ మండల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయక్, లక్ష్మీదేవి మండల అధ్యక్షులు బోడ బాలు నాయక్, సేవాలాల్ సైనికులు, ధర్మజాగరణ సేన సైనికులు, తదితరులు పాల్గొన్నారు

Loading

📅 November 3, 2024🏷 Khammam
Andhra • Nov 3, 2024

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం గల్లంతు: వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం – సజ్జల

TwitterWhatsAppFacebookTelegramShare

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం గల్లంతైందని మండిపడ్డారు. “రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం జరుగుతుందని, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని” ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు ప్రజల ధనాన్ని దోచుకుని జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషప్రచారం చేయడం సరికాదని సజ్జల అన్నారు. “టీడీపీ ఇచ్చిన సూపర్-6 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు,” అని, ఐదు నెలల్లో ప్రభుత్వం రూ.53 వేల కోట్ల అప్పు చేసినట్టు తెలిపారు.త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశముందని, వైసీపీ పటిష్టమైన కార్యకర్తలను సిద్ధం చేస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో విజయం వైసీపీదేనని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

Loading

📅 November 3, 2024🏷 Andhra
Khammam • Nov 3, 2024

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు గిరిజన హక్కుల ఉల్లంఘన – మలోతు అశోక్ బాబు

TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మలోతు అశోక్ బాబు కొత్తగూడెం మరియు పాల్వంచ పట్టణాలు, అలాగే పరిసర గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గిరిజన ప్రజల హక్కులను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఈ నిర్ణయంతో గిరిజన ప్రజలకు ఉద్యోగాలు, ఐటీడీఏ ద్వారా అందే అభివృద్ధి పథకాలు, పంచాయతీ హక్కులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవులు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో గిరిజన ప్రజలకు దక్కాల్సిన ప్రత్యేకాధికారాలు నష్టం చెందుతాయని, 5వ షెడ్యూల్ పరిధిలో ఉన్న ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో కలపడం వల్ల ప్రజలకు ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కోల్పోతారని స్పష్టం చేశారు. చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్ వంటి ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి దిశగా ఉన్నాయని, ఈ గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో చేర్చడం అసమంజసం అని అభిప్రాయపడ్డారు. అశోక్ బాబు మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో గ్రామాలను కార్పొరేషన్‌లో కలపడం వెనుక కేవలం గిరిజన భూములను లాక్కోవాలనే కుట్రే ఉన్నట్లు ఆరోపించారు. ఏజెన్సీ హక్కుల కోసం గిరిజనులు సాగిస్తున్న ఉద్యమాలను తక్షణమే నెగ్గించాలని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే మరియు రాజకీయ నాయకులు చేసే అభివృద్ధి ప్రచారాలను తప్పు పట్టారు.ఏజెన్సీ ప్రాంతాల జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

Loading

📅 November 3, 2024🏷 Khammam
Khammam • Nov 3, 2024

కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదకర సంఘటన

TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాలలో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు స్కూలు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల చుట్టూ ఉన్న జెండాలు తొలగించే క్రమంలో రత్నం (54), ఉపేందర్‌ (45) విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన భాగానికి తగిలి శాక్‌ కొట్టి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో పాఠశాలలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Loading

📅 November 3, 2024🏷 Khammam
Andhra • Oct 27, 2024

అమరావతి: తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త పోస్టింగ్‌లు

TwitterWhatsAppFacebookTelegramShare

అయితే, తెలంగాణ నుంచి వచ్చిన రోనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ దక్కలేదు, ఇది ఆయన కంటే ముందుగా పోస్టింగ్ పొందిన అధికారులతో పాటు రాష్ట్రంలో కఠినమైన పోటీకి సంకేతం.

Loading

📅 October 27, 2024🏷 Andhra
error: Content is protected !!
Exit mobile version