📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Telangana • Dec 5, 2024

పెద్దపల్లిలో యువ వికాసం సభ: 50 వేల ఉద్యోగాలు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు

TwitterWhatsAppFacebookTelegramShare

నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన యువ వికాసం సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, INTUC సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్, మరియు సంస్థ సీఎండీ శ్రీ బలరాం నాయక్ పాల్గొన్నారు. సింగరేణి సంబంధిత స్టాల్స్ పరిశీలించిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రైతులు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు మరియు అన్ని వర్గాల ప్రగతికి అంకితమై పని చేస్తున్న పార్టీగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కష్టపడి గెలిపించినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అవకాశాల పరంగా, 50,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు రెవెన్యూ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, మెడికల్, ఫారెస్ట్, సింగరేణి, ఇతర ప్రభుత్వ రంగాలలో వచ్చిన ఘనతను కూడా కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు. తమ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్లను, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా త్వరలో అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు. సభలో ఐఎన్టీయూసీ నాయకులతోపాటు, నర్సింహారెడ్డి, త్యాగరాజన్, ఆల్బర్ట్, వికాస్ యాదవ్, ఎం.డి. రజాక్, పితాంబర్ రావు, జే. వెంకటేశ్వర్లు, సకినాల సమ్మయ్య, కలవల శ్రీనివాస్, రమేష్, రమాకాంత్ సింగరేణి అధికారులు, ఐఎన్‌టీయూసీ నాయకులు, ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగం పొందిన వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Loading

📅 December 5, 2024🏷 Telangana
National • Dec 4, 2024

తెలుగు చరిత్రలో కన్నమదాసు మహావీరుడు – మాలల వీరత్వానికి చిరునామా

TwitterWhatsAppFacebookTelegramShare

తెలుగు నేలపై మాలల వీరత్వానికి, యుద్ధ నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచిన కీర్తి గాధలు చరిత్రలో స్పష్టంగా నిలిచిపోయాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత కలిగినది 12వ శతాబ్దంలో పల్నాటి యుద్ధానికి నాయకత్వం వహించిన మాల కన్నమదాసు చరిత్ర. కన్నమదాసు మాచర్ల సేనలకు సర్వసైన్యాధ్యక్షుడిగా పని చేసి, బ్రహ్మనాయుడి విశ్వసనీయ బంటుగా నిలిచి, పాలనలో సమర్థత చూపాడు. అతని నాయకత్వంలో జరిగిన పల్నాటి యుద్ధంలో మాచర్లకు విజయం సాధించడం చరిత్రకు ఓ చిరస్మరణీయ ఘట్టం. అతని తండ్రి తెప్పలనీడు కూడా పల్నాటి రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. విరోధులు కన్నమదాసును చూసి భయపడేవారని, అతని చేతిలో భైరవ ఖడ్గం అనగానే శత్రువుల గుండెల్లో పులకరింత కలిగేదని చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ ఖడ్గం నేటికీ కారంపూడి నాగులేరు ఒడ్డున ఉన్న వీరుల గుడిలో పూజలందుకుంటోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21-25 వరకు పల్నాటి వీరులను స్మరించుకుంటూ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో మాలలు వీరగాధలను పాడుతూ చరిత్రను తరతరాల వారికి చేరవేస్తున్నారు. కన్నమదాసు వీరత్వం తెలుగు మాలల గర్వకారణంగా, గ్రీకు వీరులతో సరితూగే స్థాయిలో ప్రశంసలు పొందింది. ఈ మహావీరుని గురించి తెలుసుకోవడం మన చరిత్రకు గౌరవం చేకూర్చడం వంటిదని భావించాలి.

Loading

📅 December 4, 2024🏷 National
Editorial • Dec 4, 2024

రిజర్వేషన్ వర్గీకరణ లాభ-నష్టాల అంశం కాదు : దాసరి లక్ష్మయ్య

TwitterWhatsAppFacebookTelegramShare

రిజర్వేషన్ వర్గీకరణ అంశం లాభనష్టాలకు సంబంధించిన అంశం కాదు .ఒకరి సొత్తును ఒకరు దోచుకునే అవకాశం లేదు. అంటరానితనంతో వచ్చిన రిజర్వేషన్లు అంటరానితనంతోనే పోవాలి. రిజర్వేషన్ల మూడు ప్రధాన విభాగాలు:1) సామాజిక రిజర్వేషన్లు2) ఆర్థిక రిజర్వేషన్లు3) రాజకీయ రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్:- రామ్సే మెక్ డోనాల్డ్ అధ్యక్షతన లండన్ లో జరిగిన మొదటి, రెండు మరియు మూడవ సమావేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి సాధించిన రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే 17 సెప్టెంబర్ 1932 నుండి 24 సెప్టెంబర్ పూనా ఒప్పందం వరకు గాంధీ ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న గాంధీ తో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చర్చల సందర్భంలో నన్ను ఆ వీధి స్తంభానికి వేలాడదీసిన సాధించుకున్న హక్కులను వదులుకోనని కరాకండిగా తెలియజేశాడు బాబాసాహెబ్ అగ్రకుల హిందువులతో ఎంతో పోరాటం చేసి సాధించిన హక్కులను పూనా ఒప్పందం లోనీ నిబంధన ప్రకారం వర్గీకరించడం వీలుకాదు. ఆర్థిక రిజర్వేషన్:- ఈ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగా మరియు ఉపాధిలో కొనసాగే రిజర్వేషన్లు మనము ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నప్పటికీ మనలను వీడని అంటరానితనం కులం ఉన్నంత వరకు ఆర్థిక రిజర్వేషన్ లు వర్గీకరిస్తే రాజ్యాంగంలోని మూలసూత్రమైన ప్రతి పౌరునికి విద్య అందజేయడంలో విఫలం అవుతాము ప్రజాస్వామిక లక్ష్యాలకు విఘాతం కలుగుతుంది కావున ఈ రిజర్వేషన్లను వర్గీకరించడం వీలుకాదు. రాజకీయ రిజర్వేషన్:- లండన్ సమావేశాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ల లో డాక్టర్ బాబాసాహెబ్ గాంధీకి ఊపిరి పోసే విధంగా సడలించబడ్డ రిజర్వేషన్లే రాజకీయ రిజర్వేషన్లు. ఇవి 10 సంవత్సరాలు మాత్రమే కొనసాగాలి అని పూనా ఒప్పందం. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం అధికారం కోసం పూనా ఒప్పంద ఉల్లంఘన చేసి ఈ రిజర్వేషన్ కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ రిజర్వేషన్లు వర్గీకరించేందుకు వెసులుబాటు ఉంటుంది దీన్ని కూడా పార్లమెంట్ లో చట్టం చేసి వర్గీకరించాల్సి ఉంటుంది. దాసరి లక్ష్మయ్యTGSRTC ఆర్టీసీ మాల ఉద్యోగ సంఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Loading

📅 December 4, 2024🏷 Editorial
Uncategorized • Dec 3, 2024

తెలంగాణ విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం :కోటా శివశంకర్

TwitterWhatsAppFacebookTelegramShare

విద్యా కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం సమర్పణ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ చైర్మన్ ఆకునూరి మురళి గారికి వినతి పత్రం అందించారు. విద్యార్థుల సమస్యలు: మెస్ చార్జీల పెంపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచింది. కోట శివశంకర్ ఈ పెంపును విద్యార్థులకు నిజాయితీగా అందించాలని సూచించారు. కాస్మోటిక్ చార్జీల పెంపు: సింగరేణి హాస్టల్ అనుమతులువిద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో కాలేజీ ఎటాచ్డ్ హాస్టల్ అనుమతులు తీసుకురావాలని కోట శివశంకర్ అభ్యర్థించారు. ఔట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దు: ఉద్యోగుల సంక్షేమంరాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అవినీతిని నివారించడంపై కోట శివశంకర్ దృష్టి పెట్టారు. న్యాయ విచారణ: అవినీతి నిరోధక చర్యలుఅవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈఎస్ఐ పీఎఫ్ కట్టకుండా అవినీతి చేస్తున్నారని, వీటిపై పూర్తి విచారణ జరపాలని కోట శివశంకర్ సూచించారు.6. వినతి పత్రంలో పాల్గొన్న నాయకులుఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Loading

📅 December 3, 2024🏷 Uncategorized
Uncategorized • Dec 2, 2024

విజయవంతమైన మాలల సింహగర్జన సభ

TwitterWhatsAppFacebookTelegramShare

కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మాలల సింహగర్జన సభ విజయవంతం కావడంతో పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 1, 2024న నిర్వహించిన ఈ సభ మాలల ఆత్మ గౌరవం, ఐక్యతను చాటి చెప్పడమే లక్ష్యంగా సాగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, మాలల హక్కుల సాధన కోసం ఈ భారీ సభను ఏర్పాటు చేశారు. భారీ ప్రజా జనసందోహం చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా మాలలు తరలివచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ జన సముద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి పాశ్వాన్, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, నాగరాజు, ఎంపీ గడ్డం వంశీ తదితరులు హాజరై మాలల ఐక్యతను ప్రోత్సహించారు. ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలు సభలో మాట్లాడిన గడ్డం వివేక్, మాలల ఆత్మ గౌరవం కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. “మాలల సింహగర్జన మీటింగ్‌ను చాలామంది అవహేళన చేశారు. కానీ సొంత ఖర్చులతో వచ్చిన ప్రజల సహకారంతో సభను విజయవంతం చేశాం. మన ఆత్మగౌరవం మనమే కాపాడుకోవాలి,” అని ఆయన అన్నారు. వర్గీకరణపై స్పందన ఎస్సీలను వర్గీకరణ పేరుతో విడగొట్టే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. “ఈ దేశంలో 3 వేల ఏళ్లుగా కుల వివక్ష కొనసాగుతోంది. అంబేద్కర్ రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఇవాళ ఆ రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర జరుగుతోంది,” అని విమర్శించారు. మాలల ఐక్యతకు పిలుపు మాలల బలాన్ని ఈ సభ ద్వారా ప్రపంచానికి చూపించామని వివేక్ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనల్ని ప్రాతిపదికగా మాలలు ఐక్యంగా ఉండాలని, హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. “మాలలపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోము,” అని హెచ్చరించారు. రాజకీయ కుట్రలపై స్పందన మాలల కోసం తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వెనక్కి తగ్గబోనని, ఆత్మగౌరవ పోరాటంలో తాను అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. “మాలలు తక్కువగా ఉన్నారని అనుకుంటున్న వారికిది చెంపచెళ్లులాంటిది. రాజకీయ పార్టీల చిన్నచూపుకు ఇది సమాధానం,” అన్నారు.మాలల ఐక్యత, హక్కుల సాధన కోసం జరిగిన ఈ సభ మాలల ఆత్మ గౌరవాన్ని మరింత ఉజ్వలంగా చాటి చెప్పింది. అలరించిన రేంజర్ల రాజేష్ ఆటపాట సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మాలల సింహగర్జన సభలో రేంజర్ల రాజేష్ తన ఆటపాటలతో సభకు హైలైట్‌గా నిలిచారు. ఆయన ప్రదర్శన మాలల ఐక్యత, ఆత్మగౌరవం ప్రతిబింబించేటట్లు ఉండడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.

Loading

📅 December 2, 2024🏷 Uncategorized
Khammam • Dec 1, 2024

కార్మికుల సంక్షేమం కోసం నిరంతర పోరాటం :ఐ.ఎన్.టి.యు.సి

TwitterWhatsAppFacebookTelegramShare

కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్* కొత్తగూడెం ఏరియా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఐ.ఎన్.టియు.సి యూనియన్ కృషి చేస్తుంది అని తెలియజేస్తూ కార్మికుల అనుమతి మేరకే ఐఎన్టీయూసీ యూనియన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టామని , కల్లబొల్లి మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి ఏ.ఐ.టీ.యూ.సీ యూనియన్ ఇప్పటికైనా కార్మికుల పక్షాన ఉండాలని , కార్మికుల కోసం పనిచేయాలని కార్మికుల పక్షాన పని చేసేటటువంటి ఐఎన్టీయూసీ యూనియన్ పై విమర్శలు మానుకొని కార్మికుల కోసం , కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలని కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ తెలియజేశారు. ఇటీవల జరిగినటువంటి కార్పొరేట్ స్ట్రక్చర్ మీటింగ్ లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యూనియన్ నాయకులు ఏ ఒక్క హక్కును కూడా పూర్తిస్థాయిలో యాజమాన్యాన్ని ఒప్పించకపోవడంపై కార్మిక వర్గం అసహనం వ్యక్తం చేస్తున్నారు అని తెలియజేశారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినటువంటి ఏఐటియుసి యూనియన్ స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో కార్మికులు సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సొంత ఇంటి కాల , మారు పేర్లు గాని , సూటబుల్ జాబ్ , ఓవర్ మెన్స్ , సూపర్వైజర్ స్టాప్ , ఈపి ఆపరేటర్స్ , వివిధ డిపార్ట్మెంట్లో పని చేసేటటువంటి ఉద్యోగుల క్యాడర్ స్కీమ్ వంటి పలు అంశాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంపై కార్మికులు అయోమయంలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఐ.ఎన్.టి.యు.సి యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అనేక హక్కుల సాధనలో , కార్మికుల సంక్షేమం విషయంలో, నూతన హక్కుల విషయంలో ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన పోరాడుతుందని తెలియజేశారు.

Loading

📅 December 1, 2024🏷 Khammam
Warangal • Nov 29, 2024

శాంతి భద్రతలపై వరంగల్ పోలీస్ కమిషనర్‌ సూచనలు

TwitterWhatsAppFacebookTelegramShare

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడం పోలీస్ అధికారుల ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నివారణకు అన్ని సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పోలీసుల ముఖ్య లక్ష్యమని కమిషనర్ వివరించారు.

Loading

📅 November 29, 2024🏷 Warangal
National • Nov 29, 2024

నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం

TwitterWhatsAppFacebookTelegramShare

ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత మరియు ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నేతల హాజరు:తెలంగాణ నుంచి సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎల్పీ భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్‌రెడ్డి సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, టీ. సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రి పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు హాజరుకానున్నారు. అజెండా:ఈ సమావేశంలో పార్టీలో ఉన్నత స్థాయి వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రణాళికలు, విభిన్న అంశాలపై నాయకులు నిర్ణయాలు తీసుకోనున్నారు.

Loading

📅 November 29, 2024🏷 National
Career • Nov 29, 2024

సింగరేణిలో 64 జూనియర్ సర్వే ఆఫీసర్ ఇంటర్నల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TwitterWhatsAppFacebookTelegramShare

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన ఉద్యోగుల కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తూ, 64 జూనియర్ సర్వే ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఇంటర్నల్ అభ్యర్థులు (కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పొందారు. దరఖాస్తు వివరాలు: అర్హతలు:ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సింగరేణిలో ప్రస్తుత ఉద్యోగస్తులుగా ఉండాలి. సంబంధిత శిక్షణ, అర్హత, మరియు అనుభవం అవసరం. విధానాలు:ఈ నోటిఫికేషన్ సింగరేణి ఉద్యోగులకు మరింత అవకాశాలు కల్పించే దిశగా కీలక నిర్ణయమని భావిస్తున్నారు. రిజర్వేషన్లు, ప్రోత్సాహకాలు, మరియు సింగరేణి ఉద్యోగుల అభ్యున్నతిని లక్ష్యంగా తీసుకుని ఈ చర్యలు చేపట్టారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ అప్లికేషన్లను త్వరగా సమర్పించుకోవాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.

Loading

📅 November 29, 2024🏷 Career
National • Nov 29, 2024

రిజర్వేషన్ ప్రయోజనం కోసం మాత్రమే మీరు హిందువు అని చెబితే మీకు అనుమతి లేదు: సుప్రీం కోర్ట్

TwitterWhatsAppFacebookTelegramShare

దిల్లీ: రిజర్వేషన్ల కోసం తప్పుడు ప్రకటనలు చేయడం రాజ్యాంగానికి మరియు రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన ఒక మహిళ ఎస్సీ ధ్రువీకరణ పత్రం కోసం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ, సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు తీర్పును సమర్థించింది. తీర్పు వివరాలు:జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్. మహాదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో, తప్పుడు ప్రకటనల ద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నించడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసమే తనను హిందువుగా ప్రకటించడం సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మత మార్పులపై వ్యాఖ్యలు:న్యాయస్థానం మరో కీలక అంశాన్ని కూడా చర్చించింది. వేరే మతానికి మారాలనుకునే వారు ఆ మత విశ్వాసాలను, సిద్ధాంతాలను సంపూర్ణంగా విశ్వసించడం తప్పనిసరని స్పష్టం చేసింది. “మత మార్పిడి కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే జరిగితే, దానిని అనుమతించలేము. మారిన మత ఆచారాలను, ఆధ్యాత్మిక సూత్రాలను నిస్వార్థంగా ఆచరించాలి,” అని తీర్పులో వివరించింది. ఈ తీర్పు ఇతర మతాలను అనుసరించేవారు రిజర్వేషన్లను కేవలం ప్రయోజనాల కోసమే సద్వినియోగం చేయకుండా నియంత్రించడంలో కీలకంగా నిలుస్తుంది.

Loading

📅 November 29, 2024🏷 National
error: Content is protected !!
Exit mobile version