📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Khammam • Dec 26, 2024

ఎల్లందు జీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఎన్టీయుసి నాయకులు

TwitterWhatsAppFacebookTelegramShare

ఎల్లందు జనరల్ మేనేజర్ (జీఎం) కృష్ణయ్యను కేజీఎం, ఎల్లందు ఏరియా ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్లు ఎండీ రజాక్, వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఎల్లందులో కొత్త ఓసీ (ఓపెన్ కాస్ట్) ఏర్పాటు జరుగుతుండగా, దానికి అవసరమైన మానవ వనరులను పీవీకే 5 గనిలో పనిచేస్తున్న కార్మికుల నుండి అందించేందుకు సహకరించాలని జీఎం గారిని అభ్యర్థించారు. జీఎం కృష్ణయ్య స్పందిస్తూ, కొత్త ఓసీకి అవసరమైన అన్ని అనుమతులు వచ్చిన తర్వాత కార్పొరేట్‌కు లేఖ పంపించి, మ్యాన్ పవర్ కేటాయింపునకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఎల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, సకినాల సమ్మయ్య, బూటుక రాజేశ్వర్ రావు, చిలక రాజయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, జక్కుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Loading

📅 December 26, 2024🏷 Khammam
Andhra • Dec 25, 2024

చౌటుప్పల్‌లో గంజాయి రవాణా ముఠా అరెస్ట్: ముగ్గురు పట్టుబాటు, ఇద్దరు పరారీలో

TwitterWhatsAppFacebookTelegramShare

చౌటుప్పల్: అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రాకెట్‌ను చౌటుప్పల్ పోలీసులు, ఎల్‌బీ నగర్ జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) సంయుక్తంగా ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిల వివరాలు:నర్సీపట్నం నివాసి చెల్లూరి నాగవెంకట కృష్ణవేణి, అనకాపల్లి జిల్లా కొత్తకోటకు చెందిన అడ్డూరి ప్రసాద్, పెద్దపేటకు చెందిన కిమిడి ప్రశాంత్ ఈ గంజాయి రవాణా ముఠాలో భాగస్వాములు. వీరిలో కృష్ణవేణి, ప్రసాద్ గతంలో జైలు జీవితం గడిపినట్లు పోలీసులు వెల్లడించారు. రావణా ప్రణాళిక:ఈ ముగ్గురూ నర్సీపట్నం నుంచి 14 కిలోల గంజాయిని కిలో రూ. 5,000 చొప్పున కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో కిలో రూ. 12,000కు విక్రయించేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. నర్సీపట్నం నుండి బస్సు ఎక్కిన వారు, తనిఖీల భయంతో చౌటుప్పల్‌లో దిగారు. పోలీసుల చాకచక్యం:మంగళవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు చౌటుప్పల్ బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగ్‌లో 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 4,01,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు:హైదరాబాద్‌కు చెందిన త్రిభువన గోపాల్ రేవార్ సహా ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల హెచ్చరిక:మాదకద్రవ్యాల రవాణా, విక్రయం వంటి అక్రమ చట్రాలు సాగించే వారికి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మరిన్ని వార్తల కోసం ప్రెస్ మీట్ న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Loading

📅 December 25, 2024🏷 Andhra
Adilabad • Dec 25, 2024

క్యాజువల్ లీవ్స్ మంజూరుకు కృషి చేసిన INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కు నాయకుల కృతజ్ఞతలు

TwitterWhatsAppFacebookTelegramShare

సింగరేణి నోటిఫికేషన్ 02/2022 ద్వారా రిక్రూట్ అయిన 176 జూనియర్ అసిస్టెంట్‌లకు 2023 సంవత్సరానికి సంబంధించి 11 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయటంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు చేసిన కృషి వల్ల వారికి రావాల్సిన లీవ్‌లు అందించడం జరిగిందని INTUC కొత్తగూడెం నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. డిసెంబర్ 18, 2023 న విధులలో చేరిన 176 మంది జూనియర్ అసిస్టెంట్‌లు, కొన్ని కారణాల వల్ల వారి విధులు తాత్కాలికంగా ఆపి, 05 ఫెబ్రవరి 2024 నుండి విధులను పునఃప్రారంభించారు. ఈ సమయంలో, వారికి 15 సిక్ లీవ్లు జమ కాగా, 11 క్యాజువల్ లీవ్స్ మాత్రం జమ కాలేదు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన INTUC నాయకులు, యాజమాన్యంతో మాట్లాడి వారికి రావాల్సిన 11 క్యాజువల్ లీవ్స్‌ను వెంటనే అందించారు. ఈ కార్యక్రమంలో INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం, కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ రజాక్, రాజేశ్వర్ రావు, యూసఫ్ తదితర INTUC నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ కృషి ద్వారా, INTUC నాయకులు తమ సభ్యుల సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించి, వారి ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు కట్టుబడి ఉన్నారు.

Loading

📅 December 25, 2024🏷 Adilabad
Telangana • Dec 24, 2024

గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి తెలంగాణ సర్కార్ ప్రణాళిక

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జూనియర్ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ) పోస్టులు భర్తీ చేయనుంది. రాష్ట్రంలో 10,911 రెవెన్యూ గ్రామాల కోసం ఒక జేఆర్‌ఓను నియమించనున్నారు. కీలకాంశాలు: వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత రెవెన్యూ శాఖలో అవినీతిని నివారించడంలో ముందడుగు వేసిన ప్రభుత్వం, కొత్త నియామకాల ద్వారా గ్రామ రెవెన్యూ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Loading

📅 December 24, 2024🏷 Telangana
Andhra • Dec 24, 2024

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం: ఆంధ్రప్రదేశ్ లో దంచికొట్టనున్న వర్షాలు

TwitterWhatsAppFacebookTelegramShare

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటన ప్రకారం, నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలహీనపడే సూచనలు ఉన్నా, రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాల ప్రభావం కనిపిస్తుంది. వర్షాల శ్రేణి: డిసెంబర్ 25, బుధవారం:శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు. డిసెంబర్ 26, గురువారం:నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు. కర్నూలు, వైఎస్ఆర్, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు. డిసెంబర్ 27, శుక్రవారం:ప్రకాశం, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు. రైతులు, ప్రజల కోసం సూచనలు: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను పరిగణనలో ఉంచుకుని స్థానిక అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Loading

📅 December 24, 2024🏷 Andhra
Telangana • Dec 22, 2024

సింగరేణి సంస్థకు జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఎనర్షియా అవార్డు

TwitterWhatsAppFacebookTelegramShare

సింగరేణి సంస్థను జాతీయస్థాయిలో అత్యుత్తమ పర్యావరణహిత మైనింగ్ మరియు సోలార్ ఉత్పాదక సంస్థగా గుర్తిస్తూ, విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి ప్రతిష్ఠాత్మక ఎనర్షియా అవార్డు బహూకరించారు. ఈ అవార్డును కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ఛైర్మన్ శ్రీ ఘన శ్యామ్ ప్రసాద్ చేతులమీదుగా, సింగరేణి సీఎండీ తరఫున డైరెక్టర్ ఇ అండ్ ఎం శ్రీ డి.సత్యనారాయణ రావు మరియు జీఎం (కోఆర్డినేషన్) శ్రీ ఎస్.డి.ఎం. సుభాని స్వీకరించారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో జీఎం శ్రీ ఎస్.డి.ఎం. సుభాని ఈ అవార్డును సంస్థ ఛైర్మన్ & ఎండి శ్రీ ఎన్.ఎన్. బలరామ్‌కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ బలరామ్ మాట్లాడుతూ, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్, భారీ జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాట్లు, కార్బన్ డై ఆక్సైడ్ నుంచి మిథనాలు తయారీ, భారీగా మొక్కల పెంపకం వంటి పర్యావరణహిత కార్యక్రమాలకు ఈ అవార్డు గుర్తింపుగా ఉందన్నారు. ఇది సంస్థకు స్ఫూర్తిని కలిగిస్తుందని, భవిష్యత్తులో పర్యావరణహిత మైనింగ్‌తో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి మరింతగా పెంపొందించనున్నట్లు తెలిపారు.

Loading

📅 December 22, 2024🏷 Telangana
Khammam • Dec 22, 2024

ప్రైవేట్ రంగంలో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్

TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం రంగాపురంలో సేవాలాల్ సేన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన రిజర్వేషన్లను ప్రైవేట్ రంగంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సురేష్ నాయక్ భారత రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను అమలు చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అవసరం అంటూ అన్నారు. గిరిజనుల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలలో కోత పడుతున్నప్పుడు, ప్రైవేట్ రంగంలో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఆయన ఇంకా, గిరిజన యువత ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమవుతున్నదని, ఈ పరిస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిందని తెలిపారు. దశాబ్దాలుగా గిరిజన హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని, సేవాలాల్ సేన ఈ విషయంపై పోరాటాన్ని మరింత వేగంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రతినిధులు బానోతు నాగరాజు నాయక్, కిషన్ నాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

📅 December 22, 2024🏷 Khammam
National • Dec 22, 2024

ప్రజా సేవకు అంకితమైన గొప్ప నాయకుడు గుడిసెల వెంకటస్వామి (“కాకా”)

TwitterWhatsAppFacebookTelegramShare

హైదరాబాద్, డిసెంబరు 22: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గుడిసెల వెంకటస్వామి, అతను “కాకా” గా గుర్తించబడ్డ (జి.వెంకటస్వామి) 2014 డిసెంబరు 22న తుదిశ్వాస విడిచారు. ఆయన 1929 అక్టోబర్ 5న జన్మించి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా, ప్రజల కోసం జీవితాంతం కృషి చేశారు. రాజకీయ ప్రస్థానం వెంకటస్వామి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏకంగా 7 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన పలు కేంద్ర మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా కార్మిక, పునరావాసం, టెక్స్‌టైల్స్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ప్రజల క్షేమం కోసం కృషి చేశారు. చేపట్టిన పదవులు వ్యక్తిగత జీవితం వెంకటస్వామి కుటుంబం రాజకీయంగా కూడా సుప్రసిద్ధం. ఆయన పెద్ద కుమారుడు గడ్డం వినోద్, రైతు మరియు ఎమ్మెల్యేగా ప్రజా సేవలందించగా, రెండో కుమారుడు గడ్డం వివేకానంద, పెద్దపల్లి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇద్దరూ ఎమ్మెల్యేలు, ఆయన మనవడు వంశీ ఎంపీగా ఉన్నాడు. సేవల గుర్తింపు వెంకటస్వామి దేశంలో ఎస్సీ వర్గాలకు న్యాయం చేయడంలోనూ, బలహీన వర్గాల అభ్యున్నతికి గొప్ప మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన అమూల్యమైన సేవలను భారత రాజకీయ చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. నివాళులు ఈరోజు ఆయన మరణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యేక స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెంకటస్వామి చూపిన మార్గం ప్రేరణగా, దేశ ప్రజల అభివృద్ధికి కృషి చేయడం మన బాధ్యత.

Loading

📅 December 22, 2024🏷 National
Andhra • Dec 22, 2024

దళిత ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత పోతుల విఘ్నేశ్వరరావు (పి.వి.రావు)

TwitterWhatsAppFacebookTelegramShare

పోతుల విఘ్నేశ్వరరావు (పి.వి.రావు) దళితుల హక్కుల కోసం జీవనాంతం పోరాడిన సామాజిక ఉద్యమకారుడు. 1949 మే 10న తూర్పు గోదావరి జిల్లా దేవగుప్తం గ్రామంలో జన్మించిన రావు, దళిత మాల మహానాడును స్థాపించి షెడ్యూల్డ్ కులాలను ఎ, బి, సి, డి గ్రూపులుగా వర్గీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. SC వర్గీకరణ వ్యతిరేక పోరాటం:1997లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలను ఉపవర్గాలుగా విభజించి రిజర్వేషన్లను కేటాయించగా, ఇది దళిత సమాజాన్ని చీల్చి రాజకీయ ప్రయోజనాలు సాధించే ప్రయత్నమని రావు విమర్శించారు. ఆయన న్యాయపోరాటానికి నాయకత్వం వహిస్తూ 2004లో సుప్రీంకోర్టులో విజయాన్ని సాధించారు. కోర్టు ఈ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. చివరి రోజులు:రావు 2005 డిసెంబరు 22న న్యూఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. తన మరణానికి ముందు కూడా దళిత హక్కుల కోసం నేతలతో చర్చలు కొనసాగించటం విశేషం. ఆయనకు భార్య ప్రమీళా దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమీళా దేవి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేశారు. ఆయన ధైర్యం:పోతుల విఘ్నేశ్వరరావు సాంఘిక న్యాయం కోసం చేసిన పోరాటం దళిత ఉద్యమాలకు స్ఫూర్తి కలిగించింది. మాలల ఏకీకరణ కోసం మాల మహానాడుకు ఆయన అందించిన సేవలు అమూల్యం. భారత రాజకీయ చరిత్రలో ఆయన ఒక చిరస్మరణీయ పాత్రగా నిలిచారు.

Loading

📅 December 22, 2024🏷 Andhra
Telangana • Dec 19, 2024

వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల అసెంబ్లీ ముట్టడి విజయవంతం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య

TwitterWhatsAppFacebookTelegramShare

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలపరచి గెలుపునకు కృషి చేసిన మాలలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ ధోరణిని విడనాడాలని చెన్నయ్య కోరారు. బి జె పి ని బలపరచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గాన్ని విమర్శించే నాయకులను అక్కున చేర్చుకుని మాలలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెన్నయ్య విమర్శించారు. కులగణన లేకుండా ఎంపరికల్ డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసే వర్గీకరణను అడ్డుకుంటామనికేంద్ర ప్రభుత్వం 341 ఆర్టికల్ సవరణ ద్వారా దేశ మొత్తం అందరికీ సమ న్యాయం చేస్తే మాకు అభ్యంతరం లేదని కానీ ముఖ్యమంత్రి గతం లో చంద్రబాబు చేసిన విధంగానే చేయాలని చూస్తున్నారని దీని ద్వారా మాలల కు మాల అనుబంద కులాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని మీ వైఖరి మార కుంటే మీకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాలలు ఉద్యమిస్తారని చెన్నయ్య హెచ్చరించారు. ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లో మాల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, చెరుకు రాంచందర్ , నల్లాల కనకరాజు,గోపోజు రమేష్, తాలూకా అనిల్ కుమార్ శ్రీమతి నక్క సృజన, శ్రీనివాస్, రమేష్, శ్రీకాంత్ లలిత , సరళ, రమ తదితరులు పాల్గొన్నారు

Loading

📅 December 19, 2024🏷 Telangana
error: Content is protected !!
Exit mobile version