📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Karimnagar • Feb 1, 2025

కొత్త మున్సిపల్ కమిషనర్ల బాధ్యతల స్వీకరణ

TwitterWhatsAppFacebookTelegramShare

గోదావరిఖని, : రామగుండం కార్పొరేషన్​ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నాయిని వెంకటస్వామి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.  మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇజల్లా డోర్నకల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఆయనను రామగుండం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తానాబాద్, : సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మహ్మద్ నియాజ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఆయనను ప్రభుత్వం సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా ఉన్నతాధికారులను కలిశారు. సిరిసిల్ల టౌన్, : సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎస్.సమ్మయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కమిషనర్ లావణ్య హైదరాబాద్ జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీకి బదిలీ అయ్యారు. సమ్మయ్య గతంలో హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేశారు.

Loading

📅 February 1, 2025🏷 Karimnagar
National • Feb 1, 2025

కేంద్ర బడ్జెట్‌ 2025: ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట

TwitterWhatsAppFacebookTelegramShare

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25లో భారత ఎకానమీ వృద్ధి 6.4%గా అంచనా, 2025-26లో 6.3-6.8% శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం కోసం 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా పథకాలు ప్రవేశపెట్టారు. పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 6 ఏళ్ల ప్రణాళిక రూపొందించారు. PM ధన్‌ధాన్య యోజనను 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. రైతులకు ప్రోత్సాహం MSME, స్టార్టప్‌లకు మద్దతు విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రాధాన్యం భౌతిక సదుపాయాల అభివృద్ధి సంస్కరణలు, కొత్త పథకాలు కేంద్ర బడ్జెట్ 2025: కొత్త పథకాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం కేంద్రీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పర్యాటక రంగ అభివృద్ధి, ఇన్సూరెన్స్‌ రంగంలో 100% FDI, ఆహార భద్రత కోసం జీన్‌ బ్యాంక్‌ ఏర్పాటు, సస్టైనబుల్‌ ఇన్వెస్టుమెంట్స్‌కు ప్రోత్సాహం వంటి పలు కీలక ప్రాజెక్టుల ప్రకటనలు చేశారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఫెలోషిప్స్, పరిశోధనలకు ప్రోత్సాహం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సులభతరం సాంకేతిక పరిశ్రమలకు ప్రోత్సాహం ఈ బడ్జెట్‌ ద్వారా ఆయా రంగాల్లో పురోగతి కోసం కేంద్రం నూతన పథకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్‌ ద్వారా వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి, భారత్‌ను ఆర్థికంగా మరింత బలంగా మార్చేలా చర్యలు చేపట్టినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Loading

📅 February 1, 2025🏷 National
Telangana • Jan 31, 2025

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గద్దర్ జయంతి ఉత్సవాలు, సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళి

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) 77వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, గద్దర్‌ను సమాజానికి గొప్ప స్ఫూర్తిగా పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం గద్దర్ రచించిన “మా పల్లె” పుస్తకాన్ని ఆవిష్కరించారు. గద్దర్ ఫోటో ప్రదర్శనను ప్రారంభించి, చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సీఎం మాట్లాడుతూ, గద్దర్ సమాజాన్ని మార్చేందుకు పాటను, కవిత్వాన్ని ఆయుధంగా ఉపయోగించారని, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గద్దర్ పేరిట అవార్డు ఏర్పాటు చేయడంతోపాటు, పద్మ పురస్కారాల కోసం గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావుల పేర్లు కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రాలు కలిసి కేంద్రం అవుతాయని, ఏ వ్యక్తి రాజ్యం కాదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి గద్దర్‌కు పురస్కారం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, గోరటి వెంకన్న, ప్రొ. కోదండరాం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గంటా చక్రపాణి, ప్రొ. కంచె ఐలయ్య, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, అల్లం నారాయణ, కే.శ్రీనివాస్, విమలా గద్దర్, గద్దర్ ఫౌండేషన్ సూర్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Loading

📅 January 31, 2025🏷 Telangana
Khammam • Jan 31, 2025

సింగరేణి GM కె.శ్రీనివాసరావు, వెల్ఫేర్ & ఆర్.సి. పదవి విరమణ, ఘనంగా సన్మానం

TwitterWhatsAppFacebookTelegramShare

హెడ్ ఆఫీస్ కార్పొరేట్ నందు వెల్ఫేర్ & ఆర్.సి,జి.ఎం గా విధులు నిర్వహిస్తూ ది.31.01.2025 న పదవి విరమణ చేయుచున్న కె.శ్రీనివాసరావు,సింగరేణి సంస్థ నందు వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉద్యోగాన్ని ప్రారంభించి, జి.ఎం, వెల్ఫేర్ & ఆర్.సి గా కార్పొరేట్ నందు పదవి విరమణ చేయుచున్న సందర్భంగా సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు, కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ఆధ్వర్యంలో, హెడ్ ఆఫీస్ లోని వారి కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది వారు వెల్ఫేర్ ఆఫీసర్ నుండి అంచెలంచెలుగా ఎదిగి సింగరేణి సంస్థ జిఎం వెల్ఫేర్ అండ్ ఆర్ సి గా పదవులు నిర్వహిస్తూ కార్పొరేట్ హెడ్ ఆఫీస్ నందు పదవి విరమణ చేయుచున్న వారికి అభినందనలతో పాటు ఆరోగ్యం మంచిగా ఉండాలని రజాక్ ఆకాంక్షిస్తూ, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు కె.శ్రీనివాస్ రావు కు అభినందనల తోపాటు ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని కోరుతున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో అధికారులు ఐటి జిఎం హరి శంకర్, ఎజిఎం మెయిన్ వర్క్ షాప్ రాజీవ్ కుమార్, ఆఫీస్ సిబ్బంది వరప్రసాద్, శ్రీనివాస్, పాస్ నైట్, కోటేశ్వరరావు,ట్రెజరర్ బీముడు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ విప్లవ రెడ్డి, కాసర్ల సమ్మయ్య, ఫిట్ కార్యదర్శిలు,ఎం.డి సత్తార్ పాష,శనిగరపు కుమార్, కే నట్రాజ్, డి శంకర్ బాబు, ఐఎన్టియుసి నాయకులు కలవల శ్రీనివాస్, సీతారామరాజు, యాకుబుద్దీన్, బాబుదిన్, కొప్పుల కుమార్, భాను కమల్, భరత్, చందులాల్, అధర్ శ్రీనివాసరావు ఎస్. ప్రభాకర్, కే కుమార్, సంజయ్, అల్తాఫ్, కాంపల్లి శ్రీనివాస్, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఐఎన్టియుసి నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*

Loading

📅 January 31, 2025🏷 Khammam
Editorial • Jan 31, 2025

“దళిత చైతన్యం, రాజకీయ కుట్రలు – అసలు దొంగలు ఎవరు?” – అల్లాడి పౌల్ రాజ్

TwitterWhatsAppFacebookTelegramShare

1952 నుండి రాజ్యాంగం ఫలాలను ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ అప్పటికి దళితుల్లో అర్హులై, ఫలాలు అనుభవించేవారు లేరు. అలాగా సుమారు 18 ఏళ్ళు అంటే 1970 వరకు దళితులు రాజ్యాంగ ఫలాలు అనుభవించలేదనే చెప్పాలి. 1970 నుండి సుమారు 15 ఏళ్ళు కొద్దిగా చైతన్యం పొందిన దళితులు మెల్లమెల్లగా ఎదగడం ప్రారంభం అయింది. చైతన్యం పెరిగేకొద్దీ ప్రశ్నించడం కూడా మొదలైంది. మొదటినుండి బ్రాహ్మణ ఆధిపత్యంలో ఉన్న భూమి, రాజ్యాధికారంను నెయ్యితోనో , భయపెట్టో ఆక్రమించేశారు రెడ్లు, కమ్మలు. దేవుడు పేరుతో అనుభవిస్తున్న బ్రాహ్మణులను అదిరించి , ఎదిరించి , బెదిరించి లాగేసుకున్నారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రధానంగా రెడ్డి ఆధిపత్యం కోసమే. (ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వెలమల కోసం ఎలాగో అలా ) చేయబడ్డ ఉద్యమం. ప్రత్యేక ఆంధ్రోద్యమంపై శ్రీశ్రీ ” కుడితి నీళ్లు తాగే రెడ్లు…” అని ఎద్దేవా చేశారు. అలా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన సమయంలో కమ్మలు కూడా ప్రధాన పాత్ర పోషించి రాజ్యధికారం కొరకు పోటీ పడే సందర్భంలో జనాబాపరంగా అత్యధికంగా రెడ్లు ఎక్కువుగా కమ్మలు తక్కువుగా ఉండే తెలంగాణ కలుపుకుని బలపడేందుకు రెడ్లు వేసిన ఎత్తుగడ విశాలాంధ్ర. ఆంధ్రాలో b. n. రెడ్డి, తెలంగాణలో రంగారెడ్డి (ఈయన మొదట వ్యతిరేఖించారు ) మొదలగు వారి వ్యూహంలో కమ్మలు చిక్కుకున్నారు. దీనితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్ల రాజ్యం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో నాదెండ్ల భాస్కరరావు వంటి ఆంధ్రా రాజకీయ నాయకులకు దొరికిన ఆయుధం ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు ఉన్న ప్రజాభిమానం, పాపులారిటీ , అప్పటికి రెడ్లు చేతకాని పరిపాలన టీడీపీని సునాసాయంగానే అధికారంలోకి తెచ్చింది. టీడీపీ రాకతో ఆంధ్రుల్లో రాజకీయ, సామాజిక చైతన్యం పెరిగింది. టీడీపీ రావడంతోనే దుష్ట కాంగ్రెస్ రెడ్ల పరిపాలన పోయి దుర్మార్గపు కమ్మ పరిపాలన మొదలైంది. కమ్మలకు ఎక్కడాలేని పొగరు, అహంకారం, అధికారంతో వచ్చిపడింది. ఈ కులహంకారమే కారంచేడు దుర్మార్గానికి ప్రధానకారణం. నిజం చెప్పాలంటే, విశాలాంధ్ర ఏర్పడకపోతే ఇక్కడ రెడ్ల స్థానంలో కాపులు ప్రధానశక్తిగా ఎదిగే అవకాశాలు ఉండేవి. అధికారం రెడ్లు, కమ్మలు మధ్యే తిరుగుతూ ఉండేది కాదు. ఇప్పుడు కాపులు కమ్మ-రెడ్డి మార్గంలో ఉన్నారు. అప్పటికే చైతన్యంతో ఉన్న దళితులు టీడీపీ అధికారంలోకి వచ్చే సమయానికి మరికొంత చైతన్యం, ఐక్యత కలిగి ఉన్నారు. కారంచేడు మాదిగలు ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉండేవారు. ఈ క్రమంలో మాదిగల ఆత్మగౌరవం, ప్రశ్నించేతత్వం నచ్చని కమ్మలు ఎన్టీఆర్ వియ్యంకుడు దగ్గుబాటి పురంధేశ్వరి మామ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటి చెంచురామయ్య ముఖ్యపాత్రలో కారంచేడు చుట్టుపక్కల కమ్మలను పోగేసి చేసిన మారణకాండ ఆంద్రప్రదేశ్ ను ఉలిక్కిపడేట్లు చేసింది. కారంచేడు మాదిగలకు మేమున్నాం అంటూ చీరాల , ఒంగోలు, బాపట్ల, నెల్లూరు, పొన్నూరు, తెనాలి..ఇలా ఒకటేమిటి అన్ని ప్రాంతాలనుండి సంఘీభావం తెలిపారు. కత్తి పద్మారావు దళితమహాసభ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమంలో మాలలు ముఖ్యపాత్ర పోషించారు. అప్పుడసలు మాల, మాదిగ వేర్వేరు అని చాలామందికి తెలియదు కూడా. SC లేదా హరిజనులు ఇవే పదాలు వినపడేవి. ఆ ఉద్యమంలో భాగంగా మా ఊర్లో యువకులు అనేక కేసులు ఎదుర్కొని జీవితాలు ఫణంగా పెట్టారు. ఉద్యమ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత చైతన్యం తీవ్రమైంది. ఈ చైతన్యం ఒక్క ఉద్యమ రూపంలోనే కాకుండా విద్యా , ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రస్ఫుటంగా కనిపించింది. పర్యవసానంగా టీడీపీ, కాంగ్రెస్ కు అధికారం కోల్పోయింది. అప్పటికే కొద్దో గొప్పో చదువుకున్న మాల IAS, IPS లు కమ్మల పెత్తనాన్ని అధికారికంగా నిలదీశారు. BSP ప్రవేశం కూడా కమ్మలకు కంటగింపు అయింది. మాల మాదిగల ఐక్యత భవిష్యత్తులో ఎప్పటికైనా ప్రమాదమని భావించిన కమ్మలు మనువాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఏ ప్రకాశం జిల్లాలో మాదిగలకు బద్ధ శత్రువులుగా చూడబడుతున్నారో అదే ప్రకాశం జిల్లా అదే కారంచేడు గ్రామానికి దగ్గర్లోనే ఈదులుమూడి గ్రామంలో మాదిగలకు గల కమ్మ శత్రుత్వాన్ని మాలలపైకి మళ్లించే ప్రయత్నమే రిజర్వేషన్లు వర్గీకరణ ఉద్యమం. వాస్తవానికి కారంచేడులోనే ప్రారంభించే ప్రయత్నం చేశారు. తర్వాత కారంచేడు బాధితులకు చీరాల మాలలు ఆశ్రయం కల్పించిన పునరావాస కేంద్రం విజయనగర కాలనీలో కూడా ప్రయత్నించారు. వారు ఒప్పుకోలేదు, సరికదా… మాకు మాలల అండ లేకపోతే ఇప్పుడు మేము ఏమైపోయేవాళ్ళమో, వెళ్లిపోండి అని మాదిగ నాయకులను తరిమితే, ఈదులుమూడి గ్రామాన్ని వేదికగా చేసుకున్నారు. నిజంగా మాదిగల వెనుకబాటు కారణంగా ఏర్పడిన ఉద్యమం అయితే అందుకు వేదిక కారంచేడు అయ్యేది కాదు. కారంచేడు వేదిక కావడంలోనే ఆ ఉద్యమ లక్ష్యం, నాయకుల స్వార్ధం, కమ్ముల కుట్ర కనబడుతున్నాయి. ఉద్యమ నేపద్యం కానివ్వండి, స్థిరమైన కుల వృత్తి లేకపోవడం వలన లేదా క్రైస్తవ మిషనరీ స్కూల్స్ వలన కానివ్వండిమాలలు చదువునే ఆయుధంగా మలచుకున్నారు. 1970 తర్వాత సుమారు ఒక 10, 15 ఏళ్ళు తిండి తిప్పలకు నోచుకోకుండా కనీసం సొంత ఇళ్లు కూడా లేనప్పటికీ పెళ్లిళ్లు వాయిదా వేసుకుని చదువుకై తమ జీవితాలను దారబోసిన ఫలితంగా విద్యా, ఉద్యోగాల్లో స్థిరపడటం మనం గుర్తించవచ్చు. అనేక కార్యాలయాల్లో ఆధిపత్య కులాలకు చెందిన వారు దళిత అధికారుల ముందు చేతులు కట్టుకోవాల్సి రావడం, అనేకమంది మాల అడ్వకేట్లు కారంచేడు బాధితుల పక్షాన పోరాటం చేయడం…కమ్మ, రెడ్లకు కంటగింపుగా మారింది. ఇలాంటి సందర్భాల్లో కారంచేడు సంఘటన తర్వాత పరిణామాల్లో మాలల పోరాటాలు, వాటికి మాదిగల మద్దతును విచ్చిన్నం చేసే కుట్రే వర్గీకరణ ఉద్యమం. అంటే రిజర్వేషన్లు ఫలాలు 20 ఏళ్ళు కూడా అనుభవంలోకి పూర్తిగా రాకుండానే బేధాలు అనే బీజం వేసారు ఆధిపత్య కులాలు. వర్గీకరణ ఉద్యమం మొదలై ఇప్పటికి 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళు ఒక పార్టీ మాలలను, మరొకటి మాదిగలను మార్చి , మార్చి వాడుకుంటూ అధికారాన్ని మార్చుకుంటూ వచ్చాయి. ఈ 25 ఏళ్లలో రిజర్వేషన్లు వలన మాలలు పొందింది ఎంతో, మాదిగలు నష్టపోయింది ఎంతోకాని అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టి ఇద్దరూ ఆ మాటకొస్తే మిగిలిన bc కులాలు సైతం ఎంతో నష్టపోయాయన్నది నిష్టూర సత్యం. వాస్తవంగా దళితులు రాజ్యాంగం అమలులోకొచ్చిన మొదటి 20 ఏళ్లు అనుభవించింది శూన్యమనే చెప్పవచ్చు. తర్వాతి 10 ఏళ్లకు వర్గీకరణ ఉద్యమం వచ్చింది. ఈ 10 ఏళ్లలో మాలలు ఎంత లాభపడి ఉంటారు ? అంతే లాభం వర్గీకరణ ఉద్యమం తరువాత ఇద్దరూ పొంది ఉంటారు. కానీ అంతకంటే 10 రెట్లు ఇద్దరూ నష్టపోయారు. అయినా కష్టపడి చదువుకుని తెచ్చుకున్న ఉద్యోగాలు దొంగతనం ఎలా అవుతాయి ? ఎవరెక్కువ , ఎవరు తక్కువ అని బేరీజులు వేసుకుంటూ ఒక్కో కుల నాయకుడు ఒక్కో పార్టీకి తొత్తుగా మారి బాబాసాహెబ్ అంబేడ్కర్ కలలను కళ్లలోనే కప్పేశారు. నాయకులుగా చెలామణి అవుతూ వారు జాతికేం చేశారో ఇతిమిద్దంగా ఎవరూ చెప్పలేరు, కానీ చేసిన నష్టం, పోగేసుకున్న చిల్లర కాష్టం మాత్రం బాగానే ఉంది. మాలలు ఓ రెండు శాతం అధికంగా ఉద్యోగాలు పొందే ఉండొచ్చు. అయితే…ప్రభుత్వాల ఉద్యోగ ప్రకటనలు ఎన్ని ? సరిగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఇంకా బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకున్నాయి ? ఈ 30 ఏళ్లలో ఏ కుల నాయకుడైనా బ్యాక్ లాగ్ పోస్టుల కొరకు ఉద్యమం చేశాడా ? ఏడాదికి బడ్జెట్ ఎంత, దళితుల అవసరాలు ఎంత, బడ్జెట్ లోఎంత కేటాయిస్తున్నారు, నిధులు ఎన్ని విడుదల చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, అందులో బినామీలు ఎంత ? ఎన్ని లక్షల కోట్లు దారి మళ్లుతున్నాయి ? అవి ఎవరి బొక్కసాలు నింపుతున్నాయి..?అసలు దొంగలు ఎవరు ? కుల నాయకులు ప్రారంభంలో ఆస్తిపాస్తులెన్ని ఇప్పుడెన్ని ? వారికి కార్లు , బంగ్లాలు , వారి పిల్లల ఖరీదైన చదువులు, మైంటైనన్సు ఎక్కడినుండి వస్తున్నాయి / వచ్చాయి..? ఆడిటింగ్ చేసిన తర్వాత దోపిడీదారు లెవరో తేల్చుకుందాం. పరిష్కారాలు దొంగలు , దోపిడీదార్లను చూయిస్తుంటే… మనం చప్పట్లు కొట్టడం.మనం ఎంగిలాకుల్లో పోటీదార్లమే కానీ దొంగలం, దోపిడీదార్లం కాదు, మనకంత సీన్ లేదు, పాలకులు సంపదలో భాగస్వామ్యం ఇవ్వరు కూడా. ఆలోచిస్తారని ఆశిస్తూ… మీ అల్లాడి పౌల్ రాజ్ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అద్యక్షులు

Loading

📅 January 31, 2025🏷 Editorial
Career • Jan 29, 2025

భారతీయ రైల్వే: ఉద్యోగాల ఖాళీలు, ఎంపిక విధానం మరియు ముఖ్య తేదీలు

TwitterWhatsAppFacebookTelegramShare

భారతీయ రైల్వేలో వివిధ పోస్టుల కోసం 32,438 ఖాళీలను ప్రకటించారు. ఈ క్రింద ఉన్న పోస్టుల సంఖ్యను పరిశీలించండి: ఎంపిక విధానం: ప్రారంభ వేతనం: రూ.18,000 పరీక్ష విధానం: దరఖాస్తు రుసుము: ముఖ్య తేదీలు: దరఖాస్తు చేసేందుకు:rrbapply.gov.in/#/auth/landing

Loading

📅 January 29, 2025🏷 Career
Telangana • Jan 29, 2025

ఖమ్మంలో.. మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రగతిశీల మాల విద్యార్థి సమైక్య ఆవిర్భావ సభ

TwitterWhatsAppFacebookTelegramShare

31/01/2025 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం నగర మందు రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగే మాలల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి. మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ గుంతేటి వీరభద్రం. ఖమ్మం జిల్లా మాల మహానాడు నాయకులకు కార్యకర్తలకు ముఖ్యులకు అభిమానులకు ఆత్మీయ కుల బంధువులందరికీ తెలియజేయునది, మిత్రులారా 31/1/2025 న జరుగు మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రగతిశీల మాల విద్యార్థి సమైక్య తెలంగాణ ఆవిర్భావ సభ కు విద్యార్థులతో పాటు యువకులు సంఘ నాయకులు అందరు కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మాలల యొక్క సత్తా ఏంటో తెలియజేయాలని ఈ సందర్భంగా మాల మహానాడు ఏసి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ గుంతేటి వీరభద్రం మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే వివిధ మండలాలలో ఉండబడినటువంటి మండల కమిటీలు గ్రామ కమిటీలు ప్రతి ఒక్కరు కూడా శక్తియుక్తులను ఓడిపి ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేయాలని గుంతేటి వీరభద్రం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ జి చెన్నయ్య, వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ జూపూడి ప్రభాకర్ రావు, గౌరవ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ పి ఎస్ ఎన్ మూర్తి, మరో ఐ ఆర్ ఎస్ అధికారి శ్రీ ఉప్పలేటి దేవి ప్రసాద్, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ అధికారి శ్రీ పిల్లి బాలరాజు, బహుజన ప్రజా గాయకులు శ్రీ రేంజర్ల రాజేష్, సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి శ్రీ డిగాంబర్ కాంబ్లి, మహాసేన అధ్యక్షులు శ్రీ మహాసేన రాజేష్, ఏ ఎం ఎస్ ఏ శ్రీ ,మందాల భాస్కర్, మరియు మాల మహానాడు ప్రధాన కార్యదర్శి మంచాల వెంకటస్వామి తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు కావున ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాలలాత్మీయ బంధువులందరికీ గుంతెటి వీరభద్రం తెలియజేసినారు.

Loading

📅 January 29, 2025🏷 Telangana
Andhra • Jan 29, 2025

సూర్యాపేట జిల్లాలో సంచలన పరువు హత్య – ప్రేమ వివాహం కారణంగా యువకుడి హత్య

TwitterWhatsAppFacebookTelegramShare

సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి వద్ద ఇటీవల జరిగిన పరువు హత్య కేసు సంచలనంగా మారింది. మామిళ్ల గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సోమవారం మృతదేహం మూసీ కాలువ కట్టపై గుర్తించబడిన అనంతరం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పుడు జరిగిన హత్య వెనుక ప్రేమ వివాహం, కులాంతర వివాహం కారణంగా ఉన్న ద్వేషం ఉంది. ఆరు నెలల క్రితం, మాల బంటికి, పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల భార్గవి అనే యువతితో ప్రేమ వివాహం జరిగింది. ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చింది, వీరు సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా సూర్యాపేటలో కలిసి జీవిస్తున్నారు. ఈ కులాంతర వివాహం, యువతి కుటుంబంలో తీవ్ర ద్వేషం కలిగించింది. ఈ సందర్భంలో, యువతి అన్న నవీన్ గౌడ్(నిందితుడు), మృతుడు మాల బంటిని మహేష్ అనే వ్యక్తితో ఫోన్ చేయించి తీసుకెళ్లాడు. అతన్ని గొంతు నులిమి హత్య చేసి, శవంతో పాటు రాత్రి మొత్తం తిరిగి మూసీ కాలువ కట్టపై వదిలేసి పారిపోయారు. పోలీసులు నిందితుడైన నవీన్ గౌడ్‌ను విచారించినపుడు, అతను నేరం చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. నవీన్ చెప్పిన ప్రకారం, తన నానమ్మ కళ్లల్లో ఆనందం పొందేందుకు ఈ హత్యను చేశానని, మృతదేహాన్ని తన కారులో ఉంచి రాత్రి తిరిగి ఎవరూ ఉండని మూసీ కాలువ కట్టపై వదిలేశాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. పోలీసులు ఘటనను ఛేదించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Loading

📅 January 29, 2025🏷 Andhra
Editorial • Jan 28, 2025

దమ్ముంటే ప్రధానమంత్రి “లేఖకు” సమాధానం చెప్పు, బండి సంజయ్ వ్యాఖ్యలపై సంగటి మనోహర్ మహాజన్

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గద్దర్ కుమార్తె వెన్నెలతో పాటు అనేక మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సంగటి మనోహర్ మహాజన్ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్ గురించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సంగటి మనోహర్ మహాజన్ ఆగ్రహంతో స్పందించారు. “మెడకాయమీద తలకాయ లేనివాడిలా నిరాధార ఆరోపణలు, అసత్యాలు, అభూతకల్పనలతో గద్దర్‌ను విమర్శించడం ఎంత మాత్రం సమంజసమా?” అని ప్రశ్నించారు. గద్దర్ భావజాలం గురించి మాట్లాడుతూ, “గద్దర్ బీజేపీ కార్యకర్తలను చంపించాడు” అని బండి సంజయ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. “మీ దగ్గర ఏకమైనా ఆధారం ఉందా? నిజంగా గద్దర్ నీవు చెప్పిన వ్యక్తిత్వం కలిగినవాడే అయితే, ఎందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గద్దర్ సేవలను ప్రశంసిస్తూ గొప్పగా లేఖ రాస్తారు? అంటే ప్రధాన మంత్రికి నీవు చెప్పిన విషయాలన్నీ తెలియక ఇలా వ్రాశాడా?” అని నిలదీశారు. సంగటి మనోహర్ మహాజన్ బండి సంజయ్ వ్యాఖ్యలను “జొల్లుకూతలు, కారుకూతలు, పిచ్చికూతలు మరియు తప్పుడుకూతలు”గా అభివర్ణిస్తూ, “ఇలాంటివి ప్రజలను తికమకపెడతాయి, గందరగోళపరుస్తాయి” అని విమర్శించారు. “గద్దర్ ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని అర్పించారు. శరీరంలో బుల్లెట్లు ఉంచుకొని కూడా పోరాడిన వ్యక్తి ఆయన. బండి సంజయ్ చేసిన అవాస్తవాలు, అసత్యాలు, అవాకులుచెవాకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గద్దర్ అభిమానులను బాధించాయి” అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, గద్దర్ కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గద్దర్ అభిమానులకు క్షమాపణలు చెప్పాలని కోరారు. “ఇటువంటి బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. మహాజన్ మాట్లాడుతూ, “రండి, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిద్దాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం, పరిరక్షించుకుందాం. నూతన ప్రజాస్వామిక విప్లవానికి జైభీములు మరియు బుద్ధవందనాలతో ఆందోళన వ్యక్తం చేద్దాం” అని పిలుపునిచ్చారు. (సంగటి మనోహర్ మహాజన్)వ్యవస్థాపక జాతీయ కన్వీనర్,రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి & మహాజన రాజ్యం పార్టీ ;వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,కడప, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా – 9849508416.

Loading

📅 January 28, 2025🏷 Editorial
Andhra • Jan 28, 2025

అనంతపురం-గుంటూరు మధ్య ప్రయాణం మరింత సులభం

TwitterWhatsAppFacebookTelegramShare

అనంతపురం-గుంటూరు మధ్య రోడ్డు ప్రయాణం మరింత సులభం కాబోతోంది. కేంద్రం ఎన్‌హెచ్-544డి విస్తరణకు ఆమోదం తెలిపింది. రూ.5,417 కోట్ల వ్యయంతో 219.8 కి.మీ మేరను 21 బైపాస్‌లతో కలిపి నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. బుగ్గ నుంచి గిద్దలూరు వరకు 135 కి.మీ, వినుకొండ నుంచి గుంటూరు వరకు 84.8 కి.మీ మేర 4 లేన్ల రహదారులు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ఆర్థిక అభివృద్ధికి దోహదపడడంతోపాటు ప్రయాణదూరాన్ని గణనీయంగా తగ్గించనుంది.

Loading

📅 January 28, 2025🏷 Andhra
error: Content is protected !!
Exit mobile version