📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Telangana • Feb 6, 2025

CM రేవంత్ రెడ్డికి మాలలు రిటన్ గిఫ్ట్ ఇస్తారు – మాల మహానాడు నేత పిల్లి సుధాకర్

TwitterWhatsAppFacebookTelegramShare

👉SC వర్గీకరణ ఏకపక్షంగా జరిగింది👉పార్లమెంట్ ద్వారా జరిగే వర్గీకరణ అసెంబ్లీ ద్వారా చేయడం ఒక కుట్ర👉2011 జనాభా లెక్కల ప్రకారం చేయడం వల్ల ఏం శాస్తీయత ఉంటుంది?👉బిజేపి రాష్ట్రాలలో ఎక్కడైనా జరిగిందా?👉మోడీ, చంద్రబాబు ల మెప్పు కోసం దళితుల్ని విభజిస్తావా👉మాలల జనాభా లో అన్నీ తప్పుడు లెక్కలు👉న్యాయ పోరాటానికి, రాజకీయ పోరాటానికి సిద్ధం👉మాలలు రోడ్ల మీదకు రాండి, అడుగడుగునా నిలదీయండని పిలుపు👉ఎక్కువ కాలం ఈ వర్గీకరణ ప్రక్రియ నిలవదు👉సూప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధంగా వర్గీకరణ👉మాలలకు జరుగుతున్న అన్యాయాలపై త్వరలో గడప గడపకు వెళ్తాం ఇటీవల అసెంబ్లీ లో ఆమోదించిన SC వర్గీకరణ అంశం పూర్తిగా అశాస్త్రీయమైనదని, సూప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధంగా వర్గీకరణ చేపట్టారని మాలమహానాడు రాష్ట్ర అద్యక్షులు పిల్లి సుధాకర్ విమర్శించారు. కాంగ్రేస్ పార్టీకి అండగ నిలబడిన మాలలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని వాఫోయారు, వర్గీకరణకు పూర్తిగా మద్దతిచ్చిన బిజేపి ప్రభుత్వం తమ రాష్ట్రాలలో ఎందుకు వర్గీకరణ అమలు చేయడం లేదని ప్రశ్నించారు, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు, మోడీ, చంద్రబాబు ల మెప్పుకోసమే రేవంత్ రెడ్డి దళితులను విభజించాడని అన్నారు, వర్గీకరణ ప్రక్రియ 2011 జనాభా లెక్కల ప్రకారం జరగడమే శాస్త్రీయం కాదని అన్నారు. మాలల జనాభా ను పూర్తిగా తక్కువ చేసి చూపించారని అన్నారు.దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మాలలు మరింత పోరాటాలకు రోడ్ల మీదకు రావాలని అన్నారు. మాలమహానాడు గా మాలలకు జరుగుతున్న అన్యాయంపై గడప గడపకు వెళ్ళి పోరాట చైతన్యాన్ని నింపుతామని అన్నారు. ఈ సమావేశం లో జాతీయ ప్రధాన కార్యదర్శి భైరి రమేష్, రాష్ట్ర కో. ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి, జిల్లా అద్యక్షులు గండేటి చిన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గోనెల ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి మహేందర్, గుడ్ల రవికుమార్, ఆంజనేయులు, బ్యాగరి యాదయ్య, బెండ శ్రీనివాస్, గాజ రవి, హరిప్రసాద్, సూర్య రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లి సుధాకర్రాష్ట్ర అద్యక్షులుజాతీయ మాల మహానాడుతెలంగాణ రాష్ట్ర అద్యక్షులు

Loading

📅 February 6, 2025🏷 Telangana
Telangana • Feb 6, 2025

కులగణన రీ సర్వే చేయాలి – మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

TwitterWhatsAppFacebookTelegramShare

పద్మారావు నగర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నాయని విమర్శించారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే, 2024లో కాంగ్రెస్ సర్వేలో 62 లక్షల మంది తక్కువగా లెక్కబట్టారని పేర్కొన్నారు. ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నందున కులగణనకు రీ సర్వే అవసరమని స్పష్టం చేశారు. BCల రిజర్వేషన్బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని తలసాని పేర్కొన్నారు. SC వర్గీకరణSC వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని ప్రభుత్వం తొలగించాలని, స్పష్టమైన విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Loading

📅 February 6, 2025🏷 Telangana
Telangana • Feb 4, 2025

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం – అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ ఉప వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ముందుగా తెలంగాణలో వర్గీకరణను అమలు చేయాలని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం తీవ్ర పోరాటాలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతదళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తమ ప్రభుత్వానికి అత్యంత సంతృప్తినిచ్చే అంశమని సీఎం రేవంత్ అన్నారు. ఎస్సీలకు సమానమైన హక్కులు, అవకాశాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కృషి చేస్తూనే ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వర్గీకరణ ప్రక్రియ – మూడు గ్రూపుల విభజనసుప్రీంకోర్టు తీర్పును పాటిస్తూ ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్‌కు సూచించామని సీఎం రేవంత్ తెలిపారు. కమిషన్ 59 ఎస్సీ ఉపకులాలను గుర్తించి వాటిని మూడు గ్రూపులుగా విభజించాలని సిఫారసు చేసిందన్నారు. 📌 గ్రూప్-1: 15 ఎస్సీ ఉపకులాలకు 1% రిజర్వేషన్ (జనాభా: 3.288%)📌 గ్రూప్-2: 18 ఎస్సీ ఉపకులాలకు 9% రిజర్వేషన్ (జనాభా: 62.748%)📌 గ్రూప్-3: 26 ఎస్సీ ఉపకులాలకు 5% రిజర్వేషన్ (జనాభా: 33.963%) ఇదే మేరకు శాసనమండలి కూడా వర్గీకరణకు ఆమోదం తెలిపిందని, ఆమోదం అనంతరం శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేశారని సీఎం వెల్లడించారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం చారిత్రక నిర్ణయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఎస్సీ వర్గీకరణ PDF

Loading

📅 February 4, 2025🏷 Telangana
Telangana • Feb 4, 2025

తెలంగాణ కులగణన సర్వే-2024 నివేదిక: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే-2024ను పూర్తి చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఈ సర్వే చేపట్టామని, 66.99 లక్షల కుటుంబాల సమాచారం సేకరించి 96.9% సర్వే పూర్తయిందని తెలిపారు. సర్వే ప్రకారం, రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, ముస్లీం మైనార్టీ బీసీలు 10.08% కాగా, మొత్తం బీసీ జనాభా 56%గా ఉంది. ముస్లీంలతో సహా ఓసీలు 15.79%గా ఉన్నారని సీఎం వెల్లడించారు. దేశవ్యాప్తంగా బలహీన వర్గాల గణన లేకపోవడం వల్ల రిజర్వేషన్ విధానంలో సమస్యలు వస్తున్నాయని, 1931 తరువాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కులగణన జరపలేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో తెలంగాణలో కులగణన చేస్తామని హామీ ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు. 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు కృషి చేసి రూ.160 కోట్ల వ్యయంతో నివేదికను రూపొందించినట్లు తెలిపారు. కేబినెట్ ఆమోదంతో చట్టబద్ధత కల్పించామనీ, 56% బీసీలకు తగిన గౌరవం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా ఈ నివేదికను సిద్ధం చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు.

Loading

📅 February 4, 2025🏷 Telangana
National • Feb 4, 2025

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం – వికసిత్ భారత్ మా లక్ష్యం

TwitterWhatsAppFacebookTelegramShare

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, దేశ ప్రజలు నాలుగోసారి తనపై విశ్వాసం ఉంచారని అన్నారు. 21వ శతాబ్దంలో 25 శాతం గడిచిపోయిందని, వికసిత భారత్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని, పేదలు, మధ్య తరగతి ఆకాంక్షలు నెరవేర్చామని తెలిపారు. ఐదేళ్లలో 12 కోట్ల మందికి తాగునీటి వసతి, 4 కోట్ల పేదలకు గృహాలు అందించామని వివరించారు. రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తూ, కొందరు నేతలు పేదలతో ఫొటోలు దిగినా, పార్లమెంట్‌లో చర్చలకు దూరంగా ఉంటారని విమర్శించారు. మేము బూటకపు హామీలు ఇవ్వలేదని, 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించామని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా పారదర్శకత తీసుకొచ్చామని, స్వచ్ఛ్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని తెలిపారు.

Loading

📅 February 4, 2025🏷 National
Khammam • Feb 4, 2025

కొత్తగూడెంలో ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘ స్ట్రక్చర్ కమిటీ సమావేశం : పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ MD రజాక్

TwitterWhatsAppFacebookTelegramShare

కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘ స్ట్రక్చర్ కమిటీ సమావేశం జిఎం ఆఫీస్ నందు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు స్ట్రక్చర్ కమిటీ నందు పొందుపరిచిన అంశాలు. పై తెలిపిన 10 అంశాలను స్ట్రక్చర్ కమిటీ నందు పొందుపరచడం జరిగింది, వాటిపై కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు సానుకూలంగా స్పందించి ఏరియా పరిధిలో పరిష్కరించదగిన సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది, అలాగే కార్పొరేట్ పరిధిలో పరిష్కరించవలసిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కార్యక్రమంలో ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్, జిఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యులు ఎండి రజాక్, చెన్నకేశవరావు, నాగార్జున, ఎస్ఓటు జిఎం జివి.కోటిరెడ్డి, ఏరియా ఇంజనీర్ కే సూర్యనారాయణ రాజు, ఎజిఎం (సివిల్) సిహెచ్ రామకృష్ణ, ఏజెంట్ పద్మావతి ఖని బి రవీందర్, డీజీఎం(పర్సనల్) బి. శివకేశవరావు, జె.వి.ఆర్ ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్ వి ఆర్ ప్రహ్లాద్, డిజిఎం (ఈ & ఎం) జే వి ఆర్ సి హెచ్ పి కే సోమశేఖర రావు, డిజిఎం (ఐ ఈ డి) ఎన్.యోహన్, డిజిఎం (ఈ & ఎం) ఏరియా వర్క్ షాప్ టి శ్రీకాంత్, మెడికల్ సూపర్డెంట్ సార్ ఎం. పరశురాములు, సీనియర్ పిఓలు మజ్జి మురళి, కే దేవదాస్, విజయ సందీప్ పాల్గొన్నారు.

Loading

📅 February 4, 2025🏷 Khammam
Uncategorized • Feb 3, 2025

ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు స్పందన

TwitterWhatsAppFacebookTelegramShare

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. భక్తుల భద్రతను నిర్ధారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ ఉందని పేర్కొంది. దురదృష్టకరమైన ఈ ఘటనపై విచారణ కోరిన న్యాయవాది విశాల్ తివారీని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించగా, మౌని అమావాస్య సందర్భంగా జనవరి 30న జరిగిన ఈ ఘటనపై పిటిషనర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద మార్గదర్శకాలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసును హైకోర్టులోనే విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Loading

📅 February 3, 2025🏷 Uncategorized
Khammam • Feb 3, 2025

కొత్తగూడెం క్లబ్‌లో అవకతవకలపై కలెక్టర్ కు గిరిజన సంఘాల ఫిర్యాదు

TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా గిరిజన సంఘ నాయకులు కొత్తగూడెం క్లబ్‌లో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేశారు. పూర్తిగా గిరిజనులు నివసించే ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాలో, సింగరేణి, ప్రభుత్వ సహాయంతో స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ క్లబ్, క్యాంటీన్‌ను కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం అక్రమంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ క్లబ్‌ను ఫంక్షన్ హాల్‌గా మార్చి, కొత్త వారికి సభ్యత్వం ఇవ్వకుండా, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను నిర్లక్ష్యం చేస్తూ, పేదలకు అందని విధంగా లక్షల నుంచి రెండు లక్షల వరకు కిరాయిలు పెంచారని తెలిపారు. క్లబ్ నిర్వహణలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నూతన కమిటీలో ఎస్సీ, ఎస్టీలకు స్థానం లేకపోవడంతో దాన్ని రద్దు చేసి, ప్రభుత్వం లేదా సింగరేణి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడు బాలాజీ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోతు శివ నాయక్, లావుడియా ప్రసాద్ నాయక్, బానోతు దుర్గాప్రసాద్, బట్టు అరుణ్ నాయక్, అశోక్ బాబు నాయక్, జరుపుల లచ్చు నాయక్, భూక్య దేవ్ సింగ్ నాయక్, ధారావత్ రామ్నాథ్ నాయక్, రాంబాబు నాయక్, శ్రీనివాస్ నాయక్, ప్రతాప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

📅 February 3, 2025🏷 Khammam
Andhra • Feb 3, 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైల్వే గుడ్‌న్యూస్ – టెండర్ల ప్రక్రియ ప్రారంభం

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు మధ్య ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి మొదటి అడుగుగా టెండర్లు జారీ చేసింది. ఈ నెల 10 నుండి 24వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. రూ. 33 కోట్ల వ్యయంతో లైడార్ సర్వే చేపట్టనుంది, ఇది 8 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్- చెన్నై కారిడార్:ఈ మార్గం సుమారు 620 కి.మీ. పొడవుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కర్నూలు, రేణిగుంట, గుంటూరు, వాడి-రాయచూరు మీదుగా చెన్నై వెళ్లే మార్గాలు ఉన్నాయి. కొత్త ప్రతిపాదనలలో హైదరాబాద్-సూర్యాపేట-అమరావతి-తిరుపతి, అలాగే కాజీపేట-విజయవాడ మీదుగా మార్గాన్ని పరిశీలిస్తున్నారు. హైదరాబాద్- బెంగళూరు కారిడార్:570 కి.మీ. పొడవులో నిర్మించనున్న ఈ మార్గం మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్, అనంతపురం మీదుగా కొనసాగే అవకాశం ఉంది. గంటకు 350 కి.మీ. గరిష్ట వేగంతో, 320 కి.మీ. సగటు స్పీడ్‌తో రైళ్లు నడుస్తాయి. అంటే కేవలం 2 గంటల్లో బెంగళూరు, చెన్నై చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అమలయితే రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతోపాటు ఆర్థిక ప్రగతికి సహాయపడనుంది.

Loading

📅 February 3, 2025🏷 Andhra
Telangana • Feb 2, 2025

మాలల హక్కుల పోరును కొనసాగిస్తాం : MLA వివేక్ వెంకటస్వామి

TwitterWhatsAppFacebookTelegramShare

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రథమ సర్వసభ్య సమావేశం సంగారెడ్డిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాల జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఫేక్ ప్రచారాలపై స్పందిస్తూ, మాలలపై అలా మాట్లాడే వారికి ఈ సమావేశాల ఉద్దేశ్యం ఎంత సారవంతమైనదో వివేక్ స్పష్టం చేశారు. ‘‘మాలలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. మాలల ఐక్యత కోసం, వారందరికీ హక్కులు రావాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు చేపట్టాం. మాదిగల అంశం కాదు, మాలల గౌరవం గురించి. మాలల గౌరవం కోసమే ఈ వేదిక,’’ అని చెప్పారు. అలాగే, వివేక్ వెంకటస్వామి, బీజేపీ నాయకులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ నాయకులు తమ పార్టీ内 పనుల్లోనే ఉండాలి. మాలలను అవమానించడం వంటివి చేయకూడదు. మాలలు ఒక్కటై పోరాడితే వాటి హక్కులను సాధించగలుగుతారు,’’ అన్నారు. అంతే కాకుండా, 540 పేజీల సుప్రీం కోర్టు తీర్పును వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పు ఉద్యోగుల వ్యతిరేకంగా ఉన్నది. మంద కృష్ణ మాదిగలను మభ్యపెట్టారు. మాలలు ఐక్యంగా ఉంటే ఎలాంటి విజయాలు సాధించగలుగుతారు,’’ అని చెప్పారు. మాలల హక్కుల కోసం కొనసాగుతున్న పోరులో, డిసెంబర్ 1న జరిగిన మాలల సింహగర్జన విజయవంతం అయిందని అన్నారు. ‘‘దళితులపై కుల వివక్ష 3,000 ఏండ్లుగా కొనసాగుతోంది. ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, మాల జాతి కోసం ఓ మంచి భవిష్యత్తు సాధించాలి’’ అని ఆయన ఆహ్వానం పలికారు.

Loading

📅 February 2, 2025🏷 Telangana
error: Content is protected !!
Exit mobile version