లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సీనియర్ ఎంపీ జగదాంబికా పాల్ సభను నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, సభ్యుల సస్పెన్షన్ వంటి కారణాలతో 118 మంది ఎంపీల మద్దతుతో దీనిని తెచ్చారు. అయితే 293 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీయేకు మెజార్టీ ఉండటంతో, విపక్షాల తీర్మానం నెగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. చర్చానంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.
![]()

Leave a Reply Cancel reply