📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,536,964  |  68 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దళితుల రాజ్యాంగ హక్కుల సాధనకై “ఛలో ఢిల్లీ” : పిల్లి సుధాకర్‌

November 5, 2025 November 5, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

హబూబాబాద్‌ జిల్లాలోని గాంధీపురం మున్సిపల్‌ పరిధిలో జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో జరగనున్న “ఛలో ఢిల్లీ” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవంబర్‌ 26న ఢిల్లీలో దళితుల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం విస్తృత స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా దళితుల హక్కులు, సమాన అవకాశాలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొంటూ, దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సందర్భంలో మాలమహానాడు తరఫున పలు కీలక డిమాండ్లు ఉంచబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి — పార్లమెంట్‌కు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును ఇవ్వడం, మాల, మహార్‌ అనుబంధ కులాల అభివృద్ధికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పునర్మూల్యాంకనం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం ప్రవేశపెట్టి, రిజర్వేషన్ల శాతాన్ని 15 నుండి 20 శాతానికి పెంచడం ఉన్నాయి. అదేవిధంగా, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, న్యాయస్థానాలు, రాజ్యసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడం, విద్యార్థులకు భారత రాజ్యాంగాన్ని ప్రాంతీయ భాషల్లో అందించడం, కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ చిత్రాన్ని ముద్రించడం వంటి అంశాలు ఉన్నాయి.

లాగే బ్యాగరి, కాటికాపరులకు జాతీయ గుర్తింపు, గౌరవ వేతనం, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ సహకారం, పాఠశాలల్లో రాజ్యాంగ పీఠికను ప్రతిరోజు ప్రార్థనలో చదివేలా చేయాలని కూడా డిమాండ్‌ చేశారు. పిల్లి సుధాకర్‌ మాట్లాడుతూ, ఈ పోరాటం దళితుల హక్కులకే కాకుండా రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండమల్ల జాని, పచ్చర్ల బన్ను, గాజుల చిన్ని, గోగు మహేష్‌, ఇర్రి నాగరాజు తదితర నేతలు పాల్గొన్నారు. చివరగా “జై మాల, జై భీమ్” నినాదాలతో సభ ముగిసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *