TwitterWhatsAppFacebookTelegramShare

దిల్లీలో వీధి కుక్కల సమస్యపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. ఈ నెల 11న ఇచ్చిన తీర్పులో మార్పులు చేస్తూ, అన్ని కుక్కలను కాకుండా కేవలం రేబిస్‌ ఉన్న శునకాలనే షెల్టర్లకు తరలించాలని స్పష్టంగా పేర్కొంది. వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై కూడా మార్గదర్శకాలను ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం పెట్టరాదని, ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే ఆహారం పెట్టాలని ఆదేశించింది. ఈ చర్యలు ప్రజల భద్రతను కాపాడటంతో పాటు, జంతు హక్కులను గౌరవించే దిశగా రూపొందించబడ్డాయి.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version